E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతికి కమల్ ఝలక్.. ఆస్తి కోసం శ్రీయ గొడవ..రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: భానుమతికి కమల్ ఝలక్.. ఆస్తి కోసం శ్రీయ గొడవ..రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం..
Advertisement

Intinti Ramayanam Today Episode November 29th: నిన్నటి ఎపిసోడ్ లో..తన తండ్రిని అరెస్ట్ చేయించింది అవని అని పల్లవి కోపంగా ఉంటుంది. అలా పల్లవిని చూసిన మీనాక్షి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది.. నిన్ను పల్లవి చూడడం నేను చూశానమ్మా నిన్ను ఏదైనా చేపిస్తుందేమో… నాన్న నేను అరెస్ట్ చేయించావు కదా నీ మీద పగతో రగిలిపోతున్నట్లు ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మీనాక్షి అంటుంది. ఎన్ని ప్లాన్ వేసినా తన మెడకే చుట్టుకొని అవి రివర్స్ అవుతున్నాయి అమ్మ నువ్వేం కంగారు పడకు అని అంటుంది.. ఇక పల్లవి లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది.. పల్లవిని చూసిన భానుమతి ఏంటే టెన్షన్ పడుతూ అలా తిరుగుతున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మా నాన్న అరెస్టయి జైల్లో ఉంటే నేను ఈడ పిండి వంటలు చేసుకుని పండగ చేసుకోమంటావా అని పల్లవి అంటుంది.. మా నాన్న అరెస్టవడానికి కారణం మీనాక్షి, అవనీలు..వాళ్లు అన్యాయంగా మా డాడీ ని ఇరికించారు అని పల్లవి అంటుంది..

నా అల్లుడిని ఇంత మోసం చేసి ఇరికించారా ఆ మీనాక్షిని ఇప్పుడే వెళ్లి బయటికి గెంటేస్తాను అని భానుమతి అంటుంది.. నువ్వు కూడా నా మొగుడు లాగే ఆవేశ పడతావ్ ఏంటి..? కాస్త ఆలోచించి మనం ప్లాన్ ప్రకారం చేయాలి అని ఒక ప్లాన్ ని భానుమతికి చెప్తుంది. శ్రీయ సాయం చేస్తానని చెయ్యదు. లాయర్ ఆస్తి వెనక్కి వస్తుంది అనగానే అందరు సంతోషంగా ఉంటారు. పల్లవి, శ్రీయాలు మాత్రం ఆస్తిలో వాటాలు కావాలంటూ రచ్చ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆస్తులు మళ్లీ తిరిగి వచ్చాయని అందరూ సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి భానుమతిని తీసుకొని బయటకు వెళ్తుంది.. అసలు తిరిగి వచ్చాయి కదా అమ్మమ్మ.. మా వాటా మాకు ఇవ్వొచ్చు కదా.. లేకపోతే అవని మళ్లీ మావయ్య గారిని మాయ చేసి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద తన మొగుడి పేరు మీద రాయించుకుంటుంది అని అంటుంది.. శ్రియ కూడా శ్రీకర్ తో మనకు ఆస్తి కావాలి అని అడుగుతుంది.. ఆస్తుల కోసం శ్రీయ, పల్లవి గొడవలకు దిగుతారు.. పల్లవి ఆస్తి అంతా అవని పేరు మీదకి వెళ్ళిపోతుంది. మాకేం మిగులుతుంది చెప్పు అనేసి భానుమతిని రెచ్చగొడుతుంది. భానుమతి వెళ్లి కమల్ దగ్గర అడుగుతుంది. ఆస్తులు గురించి నీకెందుకే అసలు నువ్వు ఆస్తులు గురించి మాట్లాడే అర్హతలు కోల్పోయామని పల్లవిని కమల్ తీరుతాడు..

ఆ తర్వాత భానుమతి ఆస్తి లేకపోతే ఎక్కడ అడక్కు తింటావా ఏంటి అని అడుగుతుంది.. భానుమతికి పనిష్మెంట్ ఇవ్వాలని కమలనుకుంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ను పార్వతి ఆస్తులు గురించి అడుగుతుంది.. ఒకప్పుడు ఆస్తులు పంచి ఇవ్వాలని మీరే అనుకున్నారు కదా ఇప్పుడు వాటిని పంచి ఇవ్వండి. ఈ గొడవలన్నీ తీరిపోతాయి అని అంటుంది. అందరూ సమానంగా ఉన్నట్లుగా ఫీలవుతారు. అక్షయ్ చేత బిజినెస్ చేయించాలని మీరు అనుకున్నప్పుడు ఎన్ని గొడవలు జరిగాయో మీకు తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి గొడవలే జరుగుతాయి కాబట్టి మీరు ఆస్తులను పంపకాలు మొదలుపెట్టండి అని రాజేంద్రప్రసాద్ తో పార్వతీ అడుగుతుంది.

Advertisement

రాజేంద్రప్రసాద్ మాత్రం ఆస్తులు పంచిస్తే అభిమానాలు, అనురాగాలు దూరం అవుతాయి.. మనము ఆస్తులు నిస్తే.. మా టీవీ మా కారు మేమే ఎక్కాలి అని అన్నట్లుగా మా ఆస్తులు మావే అని చాలామంది అనుకుంటారు. అలాంటి మనస్తత్వాలు అందరికీ ఉంటాయి.. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. అదే ఆస్తులను పనిచేస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఏమీ కంగారు పడకు పార్వతి అని రాజేంద్రప్రసాద్ అంటాడు..

అప్పుడే శ్రియా అక్కడికొచ్చి.. లాయర్ గారు ఆస్తులు వస్తాయని చెప్పారు కదా మీరు వాటిని పంపకాలు చేయండి అని అడుగుతుంది.. ఆ ఆస్తులును మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు తెలియాలి అని శ్రీయ రాజేంద్రప్రసాద్ ని అడుగుతుంది.. నీకు తెలియడమేంటి ఆస్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడేంటి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అనుకోవడం అడిగి తెలుసుకోవడం తప్పులేదు కదా నాన్న అని శ్రీకర్ అంటాడు.. ఆస్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడేంటి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు శ్రియ అని అక్షయ్ అంటాడు.. ఆస్తులు వచ్చిన తర్వాత మీరు డైరెక్టర్ చైర్మన్ అవుతారు ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది..

ఇక పల్లవి సందులో సడేమీయా అన్నట్లు శ్రీ అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా మావయ్య మాకు ఆస్తులను పంచి ఇవ్వండి అని పల్లవి అడుగుతుంది.. ఆ మాట వినగానే అవని ఆస్తులు గురించి మాట్లాడే అర్హత అధికారం నీకు లేదు అని పల్లవికి షాక్ ఇస్తుంది. నాకు లేకపోతే ఇంకెవరుకుంది అని పల్లవి అంటుంది.. ఆస్తులు పోవడానికి ఇంత జరగడానికి కారణం మీనాన్నే అలాంటిది నువ్వు ఆస్తులు గురించి మాట్లాడుతున్నావా అని అవని అడుగుతుంది.. కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే అని అవని అనగానే పల్లవి మా గురించి మాట్లాడొద్దు మమ్మల్ని అనే ముందు నీకు సిగ్గు లేదా అనేసి అంటుంది.

ఆస్తులు మాకు రాకుండా మొత్తం నువ్వే లాగేసుకుని మా చేతిలో చిప్ప పెట్టాలని చూస్తున్నావా అని పల్లవి అంటుంది.. తనకి ఆస్తులు గురించి ఆశ లేదమ్మా తన దగ్గర ఉన్నది అందరికీ పంచాలని అనుకుంటుందని మీనాక్షి అంటుంది. ఆ మాట వినగానే శ్రియా రెచ్చిపోతుంది.. ఆస్తులు గురించి ఇప్పుడు గొడవలు పడడం ఏందీ.. మీ ఆస్తులు మీకు వచ్చాయి కదా అని మీనాక్షి అంటుంది.. ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా మీ ఆస్తులు గురించి అడుగుతున్నాం అనుకుంటున్నారా? అయినా మా గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అసలు మీరు ఎవరు అని అడుగుతుంది..

Also Read : మీనాకు నిజం చెప్పిన బాలు..షాక్ లో శృతి.. దొంగ దొరికినట్లే..

ఆవిడని ఎవరని అడుగుతున్నావేంటి శ్రీయ? మా అత్తయ్య గారు అంటే మనకి సొంత మనిషి అని అంటాడు అక్షయ్ అంటాడు. ఇంట్లో ఆస్తుల కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. ఇక భానుమతి అరే రాజేంద్ర ఆస్తుల కోసం ఇంత గొడవలు జరుగుతున్నాయి. అక్షయ్ అవనీలకు ఎంత హక్కు ఉందో మిగిలిన వాళ్లకు కూడా అంతే హక్కు ఉంది అని భానుమతి అంటుంది. అమ్మమ్మ గారు కూడా చెప్తున్నారు కదా మామయ్య మీరేం మాట్లాడరేంటి అని శ్రీయా అడుగుతుంది. అడుగుతున్నావ్ కాబట్టి చెప్తున్నాను.. ఈ ఇళ్లు ఆస్తులు అన్ని కూడా నా కష్టార్జితం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైంది మీరు అవనికి అక్షయ్ కి ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఇంట్లో ఆస్తి కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మీనాక్షి అవని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !

Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్… దొంగలను పట్టుకున్న బాలు…

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Gundeninda Gudigantalu Serial : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!

Big Stories

Advertisement
×