Illu Illalu Pillalu Today Episode October 22nd : అమూల్య నిద్రపోతుండగా విశ్వం తనకు నిద్ర పట్టడం లేదు అని అర్థరాత్రి ఫోన్ చేస్తాడు. ఏంటి నిద్రపోతున్నావా బంగారం అని అడగ్గానే అమూల్య తిట్ల పురాణం మొదలు పెడుతుంది. అమూల్య ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకు నిద్ర పట్టడం లేదు. నీకేమో నిద్ర పట్టకపోతే నాకు ఫోన్ చేస్తావు. నాకు నిద్ర పట్టలేదు అంటే నువ్వు ఎందుకు ఇలా తిడుతున్నావు అని విశ్వం బాధపడతాడు కానీ అమూల్య ఎందుకు రాలేదు చెప్పు ఏంటి నీ బాధ అని అడుగుతుంది. అయితే తిరుపతి కింద పడిన సౌండ్ రావడంతో అమూల్య అక్కడికి వెళ్ళగానే సుకన్య మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కానీ తనకి అనుమానం కూడా వస్తుంది. అమూల్య దొరికిపోతుందా లేదా అన్నది చూడాలి.
ఉదయం ఆనంద్ రావు వల్లి ఎక్కడికి వెళ్లిందో అని కంగారు పడిపోతూ ఉంటాడు. వల్లి కోసం వెతుకుతూ ఉండగా భాగ్యం అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఉంటారులే అని అనగానే భాగ్యం ఆనందరావు డైలాగులతో సీన్ ని మరింత రక్తి కట్టిస్తారు. అయితే అప్పుడే ధీరజ్ వల్లిని తీసుకుని రావడం చూసి ఒక్కసారిగా భాగ్యం షాక్ అవుతుంది. ఇంట్లోకి రానివ్వను అని ఎంత చెబుతున్నా సరే భాగ్యం వినకుండా ధీరజ్ కి మాటకి మాట సమాధానం చెప్తుంది. అప్పుడే పోలీస్ ఎస్ఐ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా గన్ను తీసి పేల్చడంతో భాగ్యం దడుచుకుంటుంది. ఇక వల్లి నీ లోపలికి తీసుకొని వెళుతుంది..
వల్లిని భాగ్యం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని ధీరజ్ అందరికీ చెప్పేస్తాడు.. అయితే అక్కడ ఇంత జరిగిందా ఇంత జరుగుతుంటే వాళ్ళు నాటకం మొదలు పెడుతున్నారా లేకపోతే ఇదంతా నిజంగానే జరిగిందా అని అందరూ కూడా అనుమానపడతారు. కానీ కూతుర్ని కూడా తన పంతం కోసం వదిలేసింది అంటే నేను మాకు ఎక్కడో అనుమానంగా ఉంది అని వేదవతి కూడా అంటుంది.. వాళ్ల గురించి మీకు తెలీదు అక్కడ ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా మనల్ని తప్పుదారి పట్టించి మళ్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టించేందుకు ఇలా చేశారు అని చందు అంటాడు. అయితే అప్పుడే రామరాజు అక్కడికి రావడంతో ఆ బల్లి గురించి చందు చెప్పడంతో సరే వాళ్ల గురించి వదిలేసేయండి మనం వెళ్లిపోదాం పద అని రామరాజు అంటాడు అయితే… కార్ల కంపెనీ వాళ్ళని వచ్చింది కదా దాన్ని నువ్వు ఎలాగైనా సరే సొంతం చేసుకుని తిరిగి రావాలి అని రామరాజు అంటాడు.
ప్రేమ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది.. ఆ కార్ల కంపెనీని ఎలాగైనా సరే మన సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఆ కార్ల కంపెనీ వేలానికి వెళ్లాలని అనుకుంటారు. వాళ్ళిద్దరూ అలా వెళుతున్నప్పుడు వేదవతి నేను కూడా వస్తాను అని చెప్పింది మా ఇద్దరి వెంట నువ్వేమి అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు అని అనగానే వేదవది ఏంటే నా కొడుకు నానని అప్పుడు దూరం చేస్తున్నావా అని అంటుంది. మీ కొడుకు అంటే మీకు ప్రేమ కదా మిమ్మల్ని మీ ఇద్దరినీ నేను ఎందుకు దూరం చేస్తాను అని ప్రేమ అంటుంది. వాళ్ళిద్దరూ వెళ్తారులే నువ్వు ఇక్కడే ఉండు అని నర్మద కూడా అనడంతో వేదవతి సరే వెళ్లి రండి మనకే వచ్చేలా చేయండి అని వేదవతి అంటుంది. ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వేలానికి వెళ్తారు.
అక్కడ వేలం పట్ల చాలామంది వచ్చి ఉండడంతో ప్రేమ టెన్షన్ పడిపోతుంది దీనికి ఒక 10 లక్షల కు మించి ఎక్కువ పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. వేలం పాట పాడాలి అంటే ఒక రేంజ్ ఉండాలి మీరు చిన్నపిల్లలు మీకు ఏమీ తెలియదు వెళ్లిపొండి అని ఎగతాళి చేసేలా మాట్లాడడంతో దీవించు ప్రేమ ఇద్దరు కూడా అతనికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చి వేలం పాటలో కూర్చుంటారు. అవతలి వాళ్ళు ఎంత చెప్పినా సరే అతను మాత్రం ఒక్క రూపాయి అంటూ అందరికీ టెన్షన్ పెట్టిస్తూ ఉంటాడు. అయితే ప్రేమ తీరదులు కూడా అతనికి దీటుగా నేను సమాధానం చెబుతూ వేలం పాట పాడుతారు. ఆల్రెడీ 14 లక్షలు అయిపోయింది కదా ఇంకా ఆపేద్దామని ప్రేమ అంటుంది. కానీ అప్పుడే భద్రావతి సడన్ గా ఎంట్రీ ఇచ్చి వేలం పాటను పెంచుతుంది దాంతో ప్రేమ షాక్ అవ్వడంతో పాటు టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
వేలం పాట పాడాలి అంటే ఒక రేంజ్ ఉండాలి.. నీకు నీ మొగుడికి అంత సీన్ లేదు పెళ్ళాం సంపాదన మీద బతికేవాడు. అలాంటి వాడి కోసం నువ్వు వేలంపాటికి వచ్చావా వీడికి అంత సీన్ లేదు అని ధీరజ్ ని అవమానించేలా మాట్లాడుతూనే ప్రేమను రెచ్చగొడుతుంది భద్ర. ప్రేమ ఇక చేసేది ఏమీ లేక భద్రతతో పోటీకి దిగాలి అని అక్కడ కూర్చుంటుంది. ఈరోజు వద్దు అని ఎంత చెప్పిన సరే ఇరవై ఒక్క లక్షలు అని ఒక్కసారిగా పెంచేస్తుంది. ఇక భద్రావతి 25 లక్షలు అని అనగానే ధీరజ్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ప్రేమని ఆపాలి అని అనుకుంటాడు కానీ ప్రేమ మాత్రం ఆగకుండా పాటను పెంచుతూ వస్తుంది. దాంతో భద్రాది ఇంకా పెంచి దాన్ని 30 లక్షల ఒక్క రూపాయికి తీసుకొని వస్తుంది. ఇక మొత్తానికి ధీరజ్ ప్రేమలే ఆ వేలం పాటలో సొంతం చేసుకుంటారు. ధీరజ్ మాత్రం అంత డబ్బులు కట్టాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తనకి భద్ర అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..