E-Paper
Advertisement

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు
Advertisement

Devaragattu Strick Fight: అంతా అనుకున్నట్లుగానే జరిగింది. దేవరగట్టు సమరంలో హింస చెలరేగింది. తలలు పగిలినా, భక్తులు గాయాలు పాలైనా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఉత్సవంలో దేవరగట్టు కొండపై కర్రల సమరం రక్త సిక్తమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 100 మందికి పైగానే గాయపడ్డారు.

దసరా తర్వాత కర్నూలు జిల్లాలోదేవరగట్టు సమరం

దసరా సందర్భంగా ప్రతీ ఏడాది జరుగుతున్న దేవరగట్టు కర్రల సమరం ఈసారి కూడా హింసాత్మకంగా మారింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో రాత్రి కర్రల సమరం జరిగింది. తొలి మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించిన తర్వాత కొండపైనున్న ఉత్సవ మూర్తులను కిందకు తీసుకొచ్చారు. సింహాసనం కట్ట వద్దకు చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలతో బన్ని ఉత్సవం ప్రారంభమైంది. ఉత్సవ మూర్తుల కోసం వివిధ గ్రామాల ప్రజలు కర్రలు, దివిటీలను తిప్పి ఊరేగించారు.

ఆరు గ్రామాల మధ్య కర్రలతో ఫైటింగ్, ఒకరు మృతి, 100 మందికి పైగానే

Advertisement

అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపులో ఒక్కసారిగా హింస చెలరేగింది. కర్రలు, దివిటీలు తిప్పే క్రమంలో భక్తుల కర్రల సమరం మొదలైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 100 మందికి పైగానే గాయపడ్డారు. ఆలూరుకు చెందిన 28 ఏళ్ల పోతురాజు మృతి చెందాడు. ఉత్సవంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ట్రీట్‌మెంట్ తర్వాత ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.

నెరనికి-నేరనిక తండా-కొత్తపేట గ్రామాల ప్రజలు స్వామివారి ఉత్సవ మూర్తులు కొండపై నుంచి కిందికి తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ఆలూరు-అరికెర- ఎల్లార్తి గ్రామాల ప్రజలు కర్రలతో ఎదురెదురుగా తలపడ్డారు. సంప్రదాయ బద్ధంగా కొనసాగుతున్న ఉత్సవమని భావించారు పోలీసులు. వారి కళ్ల ముందు కర్రలతో పెద్ద రణ రంగాన్ని తలపించేలా దాడులు-ప్రతిదాడులతో రెచ్చిపోవడం కనిపించింది. ఆరు గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మంది కర్రల సమరంలో పాల్గొన్నారు. పోలీసులను భారీ ఎత్తున మోహరించినప్పటికీ కర్రల సమరాన్ని ఆపలేకపోయాయి.

Advertisement

ALSO READ: కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే.

దివిటీలు ఉద్దేశపూర్వకంగా విసురుకోవడంతో అనేక మంది మహిళలు, యువకులు గాయాలు పాలయ్యారు. పలువురు పోలీసులు గాయపడినట్టు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ రణరంగంలో కర్రల దాడులు చేయడం, కింద పడేసి కొట్టడం, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాట జరగడంతో పలువురు గాయ పడ్డారు. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 100 మందికి పైగానే గాయపడ్డారు. చివరి నిమిషంలో స్పెషల్ పార్టీ పోలీసులను మొహాలకు హెల్మెట్లు పెట్టుకుని గుంపు మధ్యలో నిలబడాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 

Related News

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈసాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

చంద్రబాబు పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలంటూ ధర్మాన డిమాండ్

Big Stories

Advertisement
×