Intinti Ramayanam Today Episode October 22nd: స్కూల్లో నుంచి ఆరాధ్య బయటకి రాగానే కొందరు వ్యక్తులు వచ్చి ఆరాధ్యను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. అయితే డ్రైవరు ఎంతగా ప్రయత్నించినా సరే వాళ్ళు ఎవరో తెలియకుండానే ఉంటారు ఇక డ్రైవరు అవినీకి ఫోన్ చేసి ఆరాధ్యని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తాడు. ఆ విషయం వినగానే అవని ఒక్కసారిగా భయపడిపోతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది పల్లవి నీది కచ్చితంగా చేసి ఉంటుంది అని అవని అలాగే పార్వతి ఇద్దరూ అనుకుంటారు. అయితే పల్లవి సంగతి నేను చూసుకుంటాను అని అవని అంటుంది.
అవని నేను పల్లవి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాను అని చెప్తుంది. అయితే పల్లవి దగ్గరికి వెళ్లి ఆరాధ్య కనిపించడం లేదు ఎక్కడ దాచావు అని అడగగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. అయితే పల్లవి నాకు తెలీదు నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను నాకేం అవసరం అని ఎంతగా చెప్తున్నా సరే.. ఇక అప్పుడే అవనికి పార్వతి ఫోన్ చేసి ఆరాధ్య ఇంటికి వచ్చేసింది అని చెప్పగానే పల్లవి నిజంగానే కిడ్నాప్ చేయలేదు అని అందరూ అనుకుంటారు. అయితే పల్లవి మాత్రం తన ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాను అని చాలా సంతోషంగా ఉంటుంది. అవని నాకు సారీ చెప్పింది కాబట్టి నేను నిజంగానే గ్రేట్ అని పల్లవి సంతోష పడిపోతూ ఉంటుంది.
అవని తన కూతురు ఎక్కడుందో చెప్పాలి అని చెప్పమని అవని ఎంతగా అడిగినా కూడా పల్లవి నాకు తెలీదు నాకు ఏ సంబంధం లేదు అని చెప్తుంది. అయితే అవని నువ్వు ఇలా అడిగితే చెప్పవు నీ సంగతి నేను చెప్తాను అని అంటుంది. కానీ అవి పార్వతి ఫోన్ చేసి ఆరాధ్య వచ్చేస్తుందమ్మా అని చెప్పగానే.. ఆరాధ్య ఫోన్ మాట్లాడుతుంది నేను వచ్చేసానమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న నన్ను కారులో తీసుకొని వచ్చాడు అని అబద్ధం చెప్తుంది అదే నిజమనుకొని నమ్మిన అవని తన దగ్గరికి వెళ్ళడానికి తొందరపడి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఎవరి వెళ్లిపోతుంటే ఏంటి నాటకాలు ఆడుతున్నావా..? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తిడితే పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు అని అవనిదో పల్లవి అంటుంది ఇక మొత్తానికి సారీ చెప్పించుకుంటుంది.
అయితే ఇంటికొచ్చిన అవని తన కూతుర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆరాధ్య నువ్వు వచ్చేసావా అసలు మన కారు కాకుండా వేరే వాళ్ళ కారు ఎందుకు ఎక్కావు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అవని కంగారు పడిపోతుంది.. అయితే రాత్రి అవ్వగానే ఆరోగ్య హోమ్ వర్క్ చేస్తూ ఉండగా అవని అక్కడికి వస్తుంది ఆ హోమ్ వర్క్ అంతా తప్పులు తప్పులు చేశావు మళ్లీ రాయు నీకు వచ్చినదా ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటుంది. ఆ మాట వినగానే ఆరోగ్యం మళ్లీ రాస్తుంది కానీ మళ్ళీ కూడా తప్పులు చేయడంతో ఎందుకు నువ్వు ఇలానే చేస్తున్నావు అని అంటుంది.. మరి నువ్వు ఎవరి కారులో ఎక్కావు వాళ్లు ఫ్రెండ్ ఎవరు వాళ్ళ నాన్న ఎవరు అని అవని అన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఆరాధ్య ఒక రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు వదిలిపెట్టేటప్పుడు ఎవరికైనా చెప్తే మళ్ళీ నేను తీసుకెళ్తాము అని చెప్పారు అందుకే నేను నిజం చెప్పలేదు అమ్మ అని చెప్పగానే ఇదంతా పల్లవి పని అని అవని అనుకుంటుంది.
భానుమతి పల్లవికి ఫోన్ చేసి నువ్వు ఇంట్లోకి వస్తే బాగుంటుంది అని అంటుంది కానీ పల్లవి మాత్రం కమల్ ఏమనుకుంటున్నాడు కనుక్కోమని చెప్తుంది. అయితే హాల్లో పడుకుని ఉన్న కమల్ దగ్గరికి అవని వెళ్తుంది. అయితే కమల్ దగ్గరికి వచ్చిన అవని ఏంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పగానే అక్కడ దోమలు ఉన్నాయి వదినా అని ఏదో ఒకటి చెప్పి అబద్ధం చెప్పేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి గదిలో పల్లవి లేదని నువ్వు ఇలా పడుకున్నావా అని అనగానే కమల్ ఒక్కసారిగా రెచ్చిపోయి.. భానుమతికి వార్నింగ్ ఇస్తాడు. అని పేరును కూడా నా ముందు తీసుకురావడానికి వీల్లేదు అని కోప్పడతాడు ఒక్కసారిగా భానుమతి భయపడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది చూడాలి..
Also Read :గురువారం మూవీ లవర్స్ కు పండగే.. అన్నీ హిట్ సినిమాలే..