BigTV English

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..వణికిపోతున్న శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..వణికిపోతున్న శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode October 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ శ్రీవల్లిని దెయ్యం అనడంతో పాటుగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు డాన్స్ చేయాలి లేదంటే నీ మెడ తెగిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. శ్రీవల్లి చచ్చినట్లు ప్రేమ చెప్పినట్లు డాన్స్ వేస్తుంది. ప్రేమ నీ బాడీలో రిధం రావాలంటే నేను ఒక వస్తువు ఇస్తాను దానిమీద నువ్వు డాన్స్ చేయాలి అని అంటుంది. డాన్స్ బాగానే ఉంది కదా ఇంకేంటి మరి నేను వెళ్ళిపోతాను అని శ్రీవల్లి అంటుంది. వెళ్ళిపోయావంటే మెడ తెగిపోతుంది అని ప్రేమ అంటుంది.. ఇక గాజు పెంకుల మీద శ్రీవల్లితో డాన్స్ చేస్తుంది ప్రేమ. ఉదయం లేవగానే శ్రీవల్లి బయట కూర్చుని సోకాలు పెడుతూ ఉంటుంది. రాజు పెంకులు గుచ్చుకున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పెద్ద రచ్చ చేస్తుంది.. భాగ్యం రామ రామరాజు ఇంటికి వస్తారు. రామరాజు ఎంతగా నిజం చెప్పాలని అడిగితే ఆనందరావుకి గుండెపోటు వచ్చినట్టు నాటకం ఆడి బయటకు వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..భాగ్యం ఆనందరావు కాలు తొక్కుతుంది. దాంతో ఆనందరావు గుండెపోటు వచ్చినట్టు నటిస్తాడు. నాటకాన్ని రక్తి కట్టించేలా మేము హాస్పిటల్ కి వెళ్ళాలి అని భాగ్యం అంటుంది. ఇక బయటికి అర్జెంటుగా తీసుకొని వచ్చేస్తారు ఆటోలోకి రాగానే అల్లుడుగారు దీని తప్పు లేదండి మా అమ్మాయిని తప్పుగా చూడకండి అని భాగ్యం అంటుంది. ఇక ఆ ఇల్లు దాటిన తర్వాత ఆనందరావు నాటకాన్ని ఆపేస్తాడు. మన ప్లాన్ వర్కౌట్ అయింది అని సంతోష పడతారు అప్పుడే ఆటో డ్రైవరు ఆటోని ఆపేస్తాడు..

శకుని కన్నా ఎక్కువ తెలివితేటలున్నాయి బుర్ర కాస్త ఇంతే ఆటోకు గుద్దుకొని బద్దలు ఏది? ఎందుకురా ఆపేవ్ అని భాగ్యం అరుస్తుంది. నేను ఆపలేదండి ఎదురుగా ఎవరో వచ్చారు అని ఆటో డ్రైవర్ అంటాడు. ఫులి నుంచి తప్పించుకున్నాం కానీ చిరుతపులి నుంచి తప్పించుకోలేము కదా అని ఆనంద్ రావు అంటాడు. నర్మదని చూసి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతారు భాగ్యం ఆనందరావు. నర్మదా మీ నాటకాలు ఇక ఆపండి గుండె కుడివైపు కాదు ఎడమవైపు ఉంటుంది.


మీరు ఎక్కువ నాటకాన్ని మొదలుపెడితే నేనే హాస్పిటల్ తీసుకెళ్లి మీకు గుండె ఆపరేషన్ దగ్గరను చేయిస్తానని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. నేను కూడా ముందు ఆటో దిగండి మీతో మాట్లాడాలి అని నర్మదా అడుగుతుంది. ఎదురింటి వాళ్ళకి ప్రేమ ఫోటోలు గురించి ఎందుకు చెప్పారు అని అడుగుతుంది. ప్రేమ నా కూతురు లాంటిదే నేనెందుకు చెప్తానని భాగ్యం అంటుంది భాగ్యం అంటుంది. నా గురించి కానీ నా చెల్లెలు గురించి కానీ నా కుటుంబానికి ఏదైనా హాని చేయాలని చూసారో అస్సలు వదిలిపెట్టను అని నర్మదా వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది..

శ్రీవల్లి దుప్పటి కప్పుకొని వణికిపోతూ ఉంటుంది. వత్తి తీసిన బాంబు మీద కూర్చున్నట్లు ఉంది ఎలాగైనా సరే ప్రేమకి నిజం చెప్పి క్షమించమని బ్రతిమలాడుతాను అని శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వెళ్తుంది. తెలిసో తెలియకో మీ ఇంట్లో వాళ్లకి ఫోటోలు గురించి చెప్పాము నన్ను క్షమించు అని అడుగుతుంది. ఆ మాట వినగానే ప్రేమ రెచ్చిపోతుంది. నీ గురించి చందు బావ దగ్గర మీరు చేసిన మోసాల గురించి బయట పెడతాను అని ప్రేమ అంటుంది. మధ్యలో నర్మద వచ్చి ప్రేమని ఆపుతుంది. మావయ్య గారికి నీ గురించి అన్ని చెప్తాను నేను నర్మద అక్క అంత మంచిదాన్ని కాదు అని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.

కాదు ఈ విషయము ప్రేమకు ఎలా తెలిసింది అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. నేనే తప్పైపోయిందని అడగడానికి ఈ విషయాన్ని చెప్పాను అని శ్రీవల్లి అంటుంది. ఇదే చెప్పు కంటిన్యూ ఒంటికి పూసుకోవడం అంటారు అని నర్మద కూడా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. మీరు నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు మీకు నేను దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తానని శ్రీవల్లి అనుకుంటుంది. నీకు ఒక సీక్రెట్ ఇక మగవాళ్ళందరూ బతుకమ్మ కోసం పువ్వులని తీసుకొని రావడానికి బజారుకు వెళ్తారు. ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

అక్కడికొచ్చిన నర్మద మనిషి ఇక్కడుంది మనసు ఎక్కడో ఉంది. ఏంటి సంగతి అని ప్రేమను అడుగుతుంది నర్మద.. అస్సలు విషయాన్ని ప్రేమ నర్మదతో చెప్తుంది. ధీరజ్ నన్ను కిస్ చేసాడో లేదో తెలియలేదు అక్క అని ప్రేమ అంటుంది. నిన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియనంత అమ్మాయి ఏకంగా ఉన్నావా ఏంటి అని నర్మద అడుగుతుంది. నేను కాస్త డ్రింక్ చేశాను కదా అక్క అందుకే నాకేం తెలియలేదు. ధీరజ్ నిజంగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియాలి అని ప్రేమ అనుకుంటుంది.

ఈరోజు నన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో నువ్వే అడిగి తెలుసుకోవా ప్లీజ్ అని నర్మదని రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటివన్నీ నేను ఎలా అడగాలి అని నర్మదా అంటుంది. ధీరజ్ రావడం చూసి అక్క నువ్వు అడగాలి అక్క అనేసి వెళ్ళిపోతుంది ప్రేమ. సాగర్ ఏంటి బంగారం నన్ను చూడకుండా అసలు ఉండలేవా? ఇలా బయట వెయిట్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు. మావయ్య గారు ఇంత లేట్ అయిందని మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారని అనగానే సాగర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు.

Also Read: ప్రభావతిని ఇరికించిన మీనా.. కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..పాపం బాలు..

ధీరజ్ వెళ్ళిపోతుంటే నర్మదా ఆపుతుంది. మొన్న మీరు బ్యాచిలర్ పార్టీకి వెళ్లారు కదా బాగా జరిగిందా అని అడుగుతుంది. నువ్వు ప్రేమ ఫంక్షన్లో ఏదో చేశారంట కదా అనగానే ధీరజ్ దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు అందరూ బతుకమ్మని ఎంతో శ్రద్ధగా పేరుస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Nindu Noorella Saavasam Serial Today october 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరుకు మరో వరం ఇచ్చిన గుప్త

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవనికి అనుమానం.. రాజేశ్వరికి నిజం చెప్పిన అవని..శ్రీవల్లికి కమల్ షాక్…

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు చుక్కలు చూపిస్తున్న కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి

GudiGantalu Today episode: ప్రభావతిని ఇరికించిన మీనా.. కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..పాపం బాలు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Jayammu Nischayammuraa:  సింగపూర్ క్రైమ్ లో కీర్తి సురేష్… సంతోషమే వేరన్న మహానటి!

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా లవ్ స్టోరీ.. ఊహించని ట్విస్టులు..

Big Stories

×