Gundeninda GudiGantalu Today episode October 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ఇంట్లో లేకపోవడంతో బాలు టెన్షన్ పడుతూ ఊరంతా వెతుకుతూ ఉంటాడు. సుమతికి ఫోన్ చేసి మీనా ఉంటే ఇవ్వు అని అడుగుతాడు. అక్కడ లేకపోవడంతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కకి ఏదో అయిందని శివ టెన్షన్ పడుతూ ఉంటాడు. కచ్చితంగా వాడే అక్కని ఏదో చేసి ఉంటాడు అని శివ అంటాడు. ఇదో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రోహిణి చేసిన వంటని మెచ్చుకుంటూ అందరూ తింటూ ఉంటారు. రోహిణి చేసిన వంటకి అందరూ షాక్ అవుతారు. సత్యం మాత్రం మీనా రాలేదని అందరికి క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కామాక్షి ప్రభావతిని ఇంకా టెన్షన్ పెడుతుంది. మీనా రూమ్ లో ఏదైనా లెటర్ రాసిపెట్టి వెళ్ళిందేమో ఒకసారి వెతుకుదాం పద అని కామాక్షి ప్రభావతితో అంటుంది. లెటర్ ఏంటి అంటే మరణ వాంగ్మూలం మా అత్త నన్ను హింసిస్తుంది అని లెటర్ రాసి చనిపోవడానికి వెళ్లిందేమో అని కామాక్షి ఇంకాస్త బయట పెట్టుకుంది. వాళ్ళిద్దరూ వెతుకుతుంటే రోహిణి, శృతి కూడా అక్కడికి వచ్చి వెతుకుతారు..
రూమ్ అంత వెతక అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. దాన్ని చూసిన కామాక్షి ఈ లెటర్ ని రాసి చనిపోయిందేమో అని ప్రభావతి ఇంకా టెన్షన్ పెడుతుంది. ప్రభావతి తనను జైల్లో పెట్టినట్టు కలగంటుంది. ప్రభావతి కలగనడం చూసిన కామాక్షి వదిన అప్పుడే జైలుకు వెళ్లినట్టు కల గన్నావా? గమనించావా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. ప్రభావతి వాళ్ళని కామాక్షి టీ పెట్టమని అడుగుతుంది. అయితే మీకెవరికి టీ పెట్టడం రాదా నేనే పెడతాను పదండి అని కామాక్షి అంటుంది.
ఇక బాలు మీనా కోసం ఊరంతా వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. మీనా ఎక్కడికి వెళ్లిందో నాకు అర్థం కావట్లేదు నేను ఎక్కడికి వెళ్లినా సరే మీనా చేయి పట్టుకుని ఈరోజు ఇంటికి వెళ్తాను అని బాలు అంటాడు. రాజేష్ బాలు మీనా కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు. శివాకి ఈ విషయం తెలిసి గుణ దగ్గరికి వెళ్లి చెప్తాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్లింటుంది బాలుని ఏదో ఒకటి చేసి ఉంటాడు లేకపోతే కొట్టింటాడు అందుకే బయటకు వెళ్లిపోయి ఉంటుంది. మీ ఇంటికి కూడా రాలేదు అంటే మీ బావని అందరూ నమ్ముతారు కదా అందుకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని సలహా ఇస్తాడు.
శివ అలాగే గుణ నేను వెళ్లి మా బావ మీద కంప్లైంట్ ఇస్తాను అని వెళ్ళిపోతాడు. బాలు నా కోపం వల్లే మీనా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈరోజు కచ్చితంగా నేను మీనా చేయి పట్టుకొని ఇంటికి వెళ్తాను అని అంటాడు. సత్యం ఫోన్ చేయడం చూసి బాలు టెన్షన్ పడతాడు. ఇక సత్యం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదేమోరా అనిఇక సత్యం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదేమోరా అని అంటాడు. రాజేష్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది అని అనుకుంటాడు..
ఇక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన శివ మా బావ వాళ్ళ మా అక్క వెళ్ళిపోయింది. ముందు మా బావని అరెస్ట్ చేయండి అని పోలీసులకు చెప్తాడు. బాలు అప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఇతని మా బావ ఇతన్ని అరెస్ట్ చేసి మా అక్క ఏమైందో తెలుసుకోండి అని అంటాడు. శివ మాటలు విన్న బాలు ఇంకాస్త సీరియస్ అవుతూ పోలీస్ స్టేషన్ లోనే గొడవపడతాడు. ఇక శివా నేను వెళ్లి అడుగుతాను మా అక్కని ఏం చేశాడో తెలుసుకుంటాను అని అంటాడు. చివరికి బాలు ఇంటికి వచ్చేస్తాడు. రాజేష్ ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు.
బాలు ఇంట్లోకి రాదని సత్యం ఏమైందిరా అని అడుగుతాడు. బాలు ఎక్కడ దొరకలేదు నాన్న అని సత్యంతో ఉంటాడు. ఇది వెతకడం వేస్ట్ రాని అనగానే బాలు టెన్షన్ పడతాడు. మీనా ఇందాకే ఇంటికి వచ్చింది రా అని సత్యం అంటాడు. మీనాన్ని చూసిన బాలు ముందుగా అర్చిన ఆ తర్వాత నీకోసం టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. చెప్పకుండా వెళ్ళిందని తల ఒక మాట అంటారు. అసలు ఎక్కడికి వెళ్ళిందో మీనా నిజం చెప్పేస్తుంది. శ్రుతికి నేను నిజం చెప్పే వెళ్ళాను అని అంటుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు వేడి నీళ్లు ఇస్తూ నేను చెప్పాను కదా నువ్వు సరే అని అన్నావు అని అంటుంది.
Also Read : 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?
నేను డబ్బింగ్ మాట్లాడుతున్నాను దానివల్లే మీనా ఏం చెప్పిందో అర్థం చేసుకోలేకపోయాను అని శృతి అంటుంది. కామాక్షి మాత్రం ప్రభావతికి చురకలు అంటిస్తూనే ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా బాలుని ఒక ఆట ఆడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..