BigTV English

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు చుక్కలు చూపిస్తున్న కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు చుక్కలు చూపిస్తున్న కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి

Brahmamudi serial today Episode: కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి ముగ్గురు హల్లో కూర్చుని తాము రాజ్‌తో ఆడుతున్న నాటకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజ్‌ రావడంతో ముగ్గురు సైలెంట్‌ అయిపోతారు. రాజ్‌ వచ్చి భోజనం పెట్టమని అపర్ణను అడుగుతాడు. నేను పెట్టను అని అపర్ణ చెప్తుంది. దీంతో నువ్వు వడ్డించకపోతే మా నాన్నమ్మ లేదా తను వడ్డిస్తుంది అంటాడు రాజ్‌. ఇంద్రాదేవి కూడా తాను వడ్డించనని కరాకండిగా చెప్పేస్తుంది. ఎందుకు వడ్డించరు అని రాజ్‌ అడగ్గానే.. నీకు పెళ్లి చేసింది.. పెళ్లాంతో పనులు చేయించుకోవడానికి అని చెప్తారు. దీంతో రాజ్‌, కావ్య కోసం సైగ చేస్తుంటాడు. కావ్య ఉలకదు పలకదు.. దీంతో రాజ్ కోపంగా ఏయ్‌ పిలుస్తుంటే వినిపించడం లేదా..? అంటాడు.


దీంతో కావ్య అత్తయ్యా అమ్మమ్మ ఇక్కడ ఎవరైనా నన్ను పిలిచారా..? అంటుంది. ఏయ్‌ దగ్గుతుంటే వినిపించడం లేదా..? అంటాడు రాజ్‌. దగ్గుతే తుమ్మితే ఎవరు పలకరని చెప్పండి అమ్మమ్మ గారు.. మా నాన్న నాకు కావ్య అని పేరు పెట్టారు అని చెప్తుంది. దీంతో రాజ్‌ ఏయ్‌ నేను నిన్ను పిలవను వచ్చి వడ్డించు.. అంటాడు. నా బిడ్డే నచ్చనప్పుడు నేను వడ్డిస్తే మీకేం నచ్చుతుందండి.. వడ్డించుకుని తినమనండి అమ్మమ్మ గారు అంటుంది కావ్య. అంటే ఏంటి నాకు వడ్డించుకుని తినడం రాదు అనుకుంటున్నావా..? నాకు రెండు చేతులు ఉన్నాయి.. నేను వడ్డించుకోగలను.. మీరు వడ్డించకపోతే నేను వడ్డించుకోలేనా..? అనుకుంటూ రాజ్‌ భోజనం చేస్తుంటాడు.

ఇంతలో పొలమారడంతో కావ్య అమ్మమ్మగారు అక్కడే వాటర్‌ ఉన్నాయి. తాగమనండి అని చెప్తుంది. మాకు తెలుసు మేము తాగలేమా ఏంటి..? వడ్డించుకున్నోళ్లకు ఆ మాత్రం వాటర్‌ ఎక్కడుందో తెలియదా..? అంటాడు రాజ్‌. అయినా అంత ఆత్రం ఎందుకురా మెల్లగా తినొచ్చు కదా..? అంటుంది అపర్ణ. నువ్వు అన్నమే వడ్డించలేదు.. అయినా నేను ఫాస్ట్‌గా తినడం వల్ల పొలమారలేదు.. ఇక్కడ ఎవరో నన్ను బాగా తిట్టుకుంటున్నారు..  అయినా వాళ్లను ఇక్కడకు పంపించొచ్చు కదా కాస్త దిష్ట తగలకుండానైనా ఉంటుంది అని అడగ్గానే.. ముగ్గురు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.


రాజ్‌ భోజనం చేసిన తర్వాత రూంలోకి వెళ్లగానే.. కావ్య కోపంగా రాజ్‌కు దిండు దుప్పటి ఇచ్చి బయటకు వెళ్లి పడుకోమని చెప్తుంది. ఈరోజు నుంచి మీ పడక గది హాల్లో సోఫానే అని చెప్తుంది. దీంతో రాజ్‌ ఏంటి సోఫాలో పడుకోవాలా..? నేను వెళ్లను.. అంటాడు. నా జీవితంలోంచి వెళ్లిపోవడానికి ఫిక్స్‌ అయ్యారు కదా..? ఇక గదిలోంచి వెళ్లలేరా..? అంటుంది కావ్య. నేనేం ఫిక్స్‌ అవ్వలేదు నువ్వు అలా ఫిక్స్‌ చేస్తున్నావు అంటాడు రాజ్‌. దీంతో కావ్య కోపంగా ఏంటి నేను చేస్తున్నానా… నా బిడ్డను చంపుకోమని చెప్పింది ఎవరు..? మీరు..? నేను కావాలో బిడ్డ కావాలో తేల్చుకోమని చెప్పింది ఎవరు..? బిడ్డను తీయించుకోకపోతే విడిపోతాను అని చెప్పారు కదా వెళ్లండి అంటుంది కావ్య.

దీంతో ఒసేయ్‌ ఆ మాట అంది నువ్వు కదే.. అంటాడు రాజ్‌. నేను ఆ మాట అనేటట్టు చేసింది మీరే కదా అంటుంది కావ్య. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.  తర్వాత రాజ్‌ బయటకు వచ్చి సోఫాలో పడుకుంటుంటే పై నుంచి అపర్ణ చూస్తుంది. వీడేంటి గదిలో పడుకోకుండా సోఫాలో పడుకుంటున్నాడు.. కొంపదీసి కావ్య గదిలోంచి గెంటేసిందా..? లేదు వీళ్ల మధ్య దూరం పెరగనివ్వడం అంత మంచిది కాదు.  అది ఆడేది నాటకమే అయినా వాడికి కోపం వచ్చి నిజానికి ఏదైనా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే వీలైనంత తొందరగా..రాజ్‌ నిజం చెప్పేలా వాణ్‌ని ప్రెసర్‌ చేయాలి కానీ ఎలా అనుకుంటూ ఆలోచించి ఎస్‌ అనుకుని రూంలోకి వెళ్లి..

సుభాష్‌ను చూస్తూ.. వాడు అక్కడ పెళ్లాంతో గొడవ పడి బయట పడుకుంటుంటే.. మీరి ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారా..? చెప్తాను ఉండండి మీ పని అనుకుని సుభాష్‌ కప్పుకున్న దుప్పటి లాగేస్తుంది. సుభాష్‌ను కిందకు రాజ్‌ దగ్గరకు పంపిస్తుంది. సుభాష్‌ రాజ్‌ దగ్గరకు వెళ్లగానే.. రాజ్‌ షాక్‌ అవుతాడు. వాళ్ల టైం నడుస్తుంది నాన్న సరే పడుకోండి మీరు ఇటు పడుకోండి.. నేను ఇటు పడుకుంటాను అని చెప్తుండగానే.. మరి నేను ఎక్కడ పడుకోవాలి నాన్న అంటూ ప్రకాష్‌ వస్తాడు. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఏంటి బాబాయ్‌ పిన్ని నిన్ను కూడా గెంటేసిందా..? అని అడుగుతాడు. దీంతో కొట్టడం ఒక్కటే తక్కువ అయినా దీనికంతటికీ కారణం నువ్వే కదా అసలు ఆ నిజం ఏంటో చెబితే ఈ కర్మ మనకుండదు కదా నిజం చెప్పు అంటూ ఇద్దరూ రాజ్‌ను ఒత్తిడి చేస్తారు.

తర్వాత రాజ్‌ బాత్రూంలో స్నానం చేస్తుంటే.. కావ్య వాటర్‌ ఆపేస్తుంది. రాజ్‌ నిజం చెప్తేనే వాటర్ ఆన్ చేస్తానని చెప్తుంది. మరోవైపు అప్పు బాధగా ఆలోచిస్తూ కూర్చుని ఉండటం రుద్రాణి చూసి ఈ పొట్టిదేంటి ఇంతలా ఆలోచిస్తుంది. ఇదేమైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చా..? అనుకుని ఆ ఇప్పుడు ఆ ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి దీన్ని చూపించి దీనికంతటికీ కారణం ఆ కావ్యనే అని చెబితే సరి అనుకుని కిందకు వచ్చి ధాన్యలక్ష్మీని తీసుకుని పైకి వెళ్తుంది. నీ కోడలు చూడు ఎంత బాధపడుతుంది. అంటూ ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today october 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరుకు మరో వరం ఇచ్చిన గుప్త

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవనికి అనుమానం.. రాజేశ్వరికి నిజం చెప్పిన అవని..శ్రీవల్లికి కమల్ షాక్…

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..వణికిపోతున్న శ్రీవల్లి..

GudiGantalu Today episode: ప్రభావతిని ఇరికించిన మీనా.. కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..పాపం బాలు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Jayammu Nischayammuraa:  సింగపూర్ క్రైమ్ లో కీర్తి సురేష్… సంతోషమే వేరన్న మహానటి!

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా లవ్ స్టోరీ.. ఊహించని ట్విస్టులు..

Big Stories

×