BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Illu Illalu Pillalu ToIlluday Episode August 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. నీళ్ల కోసమని వెళ్లిన నర్మదకు ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. కచ్చితంగా దొంగలాగే ఉన్నాడు అని గట్టిగా కేకలు వేస్తుంది.. అక్కడే ఉన్న తిరుపతి లేచి దొంగను పట్టుకుంటాడు. దొంగ దొంగ అని ఇద్దరు కలిసి అరవడంతో శ్రీవల్లి టెన్షన్తో మా నాన్న దొరికిపోయాడా ఏంటి అని అనుకుంటుంది.. హాయ్ బాబు ఇలా జరిగిందేంటి మా నాన్న దొరికితే ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆనందరావు మాత్రం నర్మద చేతిలోంచి తప్పించుకొని పారిపోతాడు.. అలా తప్పించుకుని వెళ్లిన అన్న ఆనందరావు భద్రావతి ఇంట్లోకి వెళ్తాడు.. భద్రావతి గదిలోకి వెళ్లి కూర్చుంటాడు.


రామరాజు ఇంట్లో నుంచి పారిపోయిన ఆనంద్ రావు భద్రావతి గదిలో కూర్చుని ఉంటాడు. దొంగలా ఉన్నాడే అని లైట్ వేసి పిలుస్తుంది. భద్రాసేన ఇద్దరినీ అరుస్తుంది దొంగ వచ్చాడు అని అంటుంది. వాళ్ళందరూ అలర్ట్ అయ్యి దొంగని పట్టుకుంటారు.. అటు రామరాజు కుటుంబం ఆ దొంగ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. పద ఇక్కడేం కనిపించలేదు అని లోపలికి వెళ్తారు. ఆనందరావును కట్టేసి ఉదయం తెలుసుకుందాం అని అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంకాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం అని నర్మదా అంటుంది. కాసేపట్లో తెల్లారిపోతుంది కదా మేల్కొని ఉండడమే మేలు ఈ దొంగ మళ్ళీ వచ్చినా రావచ్చు అని ధీరజ్ కూడా అంటారు. అవును మనం ఇక్కడే ఉంటే బెటర్ అని అందరూ అంటారు. అయితే అత్తయ్య మామయ్యను కలపడానికి ఇదే మంచి సమయం మనం ఏదో ఒకటి చేయాలి అని ప్రేమ నర్మదా ప్లాన్ చేస్తారు.. నర్మదా వేదవతిని పిలుస్తుంది. నేను మీ ఇద్దరితో మాట్లాడనని తెలుసు కదా మరి ఎందుకు మీరిద్దరూ నాతో మాట్లాడాలని చూస్తున్నారు అని వేదవతి అడుగుతుంది.


నాకు ఎప్పటినుంచో మీ లవ్ స్టోరీని తెలుసుకోవాలని ఆశగా ఉంది అత్తయ్య ఇప్పుడు ఖాళీ గానే ఉన్నాం కదా మీ లవ్ స్టోరీ చెప్పండి అని నర్మదా అడుగుతుంది. అవును అత్తయ్య మీరు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అని ప్రేమ కూడా అడుగుతుంది. బాబాయ్ గారు ఇలా ఉంటే ఏం బాగోలేదు కదా వీళ్ళు చెప్పాల్సిందే అని తిరుపతిని అడుగుతుంది నర్మదా. తిరుపతి వాళ్ళు చెప్పడం కాదమ్మా వాళ్ళు మొదటి నుంచి ఎలా ఉన్నారు? నేను చెప్తానని వాళ్ళ లవ్ స్టోరీ గురించి చాలా గొప్పగా చెప్తాడు.

మీ చెయ్యి పట్టుకొని మీతో పాటు వచ్చేసిన అత్తయ్య మీ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. మీ దగ్గర ఎప్పుడు ఏది దాచిపెట్టలేదు అని నర్మదా రామరాజుకి భార్య గురించి తెలుసుకునేలా చేస్తుంది. మీరే జీవితం అనుకొని మీ చేయి పట్టుకొని వచ్చేసిన అత్తయ్య మేనకోడలే గొప్ప అని ఎలా తనని వెనకేసుకొని వస్తుంది ఆలోచించండి మావయ్య అని నర్మదా అంటుంది. నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళిన విషయం అత్తయ్యకు తెలియదు మావయ్య ఇందులో అత్తయ్య తప్ప ఏమీ లేదు అని ప్రేమ ఉంటుంది.. అయితే రామరాజు వేదవతిని క్షమించినట్లే అనిపిస్తాడు.

ఇక ఉదయం లేవగానే రామరాజు అంటూ భద్రావతి వాళ్ళ కుటుంబం మొత్తం రామరాజు ఇంటి దగ్గరికి వస్తారు.. మా వియ్యంకుడుని ఎందుకు కట్టేసారు ఇలా అని అడుగుతారు.. నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ ఇలా అతని మీద చూపించడం ఏంటి అని రామరాజు సీరియస్ అవుతాడు.. ఇతని మీద చూపించడానికి మాకేం పని లేదు అనుకున్నావా రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చాడు అందుకే కట్టేసి ఇప్పుడు తీసుకొస్తున్నామని సేన అంటాడు..

శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.. బాబోయ్ ఎల్తే వెళ్ళాడు కానీ ఆ ఇంటికి వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు ఏంటి..? నాన్నకి కొంచెం కూడా బుద్ధి లేదు 10 లక్షలు మేటర్ నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఇలా పరువు పోగొట్టేసాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా వియ్యంకుడిని పట్టుకొని దొంగ అని అంటారా? మీకు కొంచమైనా బుద్ధుందా అని రామరాజు అడుగుతాడు. అయితే సేన వాళ్ళు మాకు బుద్ధిలేక మీతో సరదాగా మాట్లాడడం కోసం ఇక్కడకు తీసుకురాలేదు రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చాడు కాబట్టే తీసుకొచ్చామని అంటారు..

మా మామయ్యని కట్టేసి కొడతారా అని చెందూతో పాటు ధీరజ్ అందరు కూడా గొడవ పడతారు.. ఇందులో రామరాజు వెళ్లి ఆ గొడవని ఆపుతాడు.. కోటీశ్వరుడు అది ఇది అని చెప్తున్నారు కదా మరి దొంగతనానికి ఎందుకు వచ్చారు ఈ రామరాజే మా ఇంట్లో దొంగతనం చేయమని పంపించారు అని భద్రావతి అంటుంది.. మాటలు మర్యాదగా రానివ్వండి. రోజులు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు అతని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని రామరాజు అరుస్తాడు..

Also Read :  పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

అసలు ఇతను దొంగతనానికి వచ్చాడు మరే దానికి వచ్చాడో తెలియాలంటే పోలీసులు రావాల్సిందే అని భద్రావతి అంటుంది. శ్రీవల్లి మాత్రం పోలీసుల్ని పిలవకండి మా నాన్న అటువంటి వాడు కాదండి అని బ్రతిమలాడుతుంది.. చందు వాళ్ళని బ్రతిమిలాడుతావ్ ఏంటి పోలీసులు రావాల్సిందే అని అంటాడు. సేనా వాళ్ళింట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి సమాచారం అందిస్తాడు. అప్పుడే భాగ్యం ఆయన గారండీ అంటూ వెతుక్కుంటూ వస్తుంది.. శ్రీవల్లి పుట్టినరోజు అని శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వచ్చారు ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని చెప్తుంది.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి

 

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×