Intinti Ramayanam Today Episode August 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ప్రేమగా అవనికి గోరుముద్దలు పెడతాడు. భానుమతి తన మొగుడు కొట్టాడని బాధపడుతూ ఉంటుంది. కమలు భానుమతిని ఓదారుస్తూనే మరోవైపు ప్రణతి పెళ్లి గురించి చెప్తాడు. ప్రణతి భరతులు ఇంట్లోంచి వెళ్లేందుకు మొత్తం సర్దుకుని పెట్టుకుంటారు.. భరత్ ప్రణతి దగ్గరికి వస్తాడు. ప్రణతి ఇంట్లోంచి వెళ్లి పదం పదాన్ని అంటుంది. భరత్ ప్రణతి మాట విని బయటికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోంచి బ్యాగులు తీసుకుని బయటకు వెళ్లిపోతారు. ప్రణతి, భరత్ లు బయటికి రాగానే అక్కడ అక్షయ్ ఎదురుగా ఉండటం చూసి షాక్ అవుతారు.
అక్షయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నాకు కొంచెం ఏదోలా ఉంది అనిపిస్తే వాకింగ్ చేద్దామని బయటికి వచ్చాం అన్నయ్య అని ప్రణతి అంటుంది. ప్రణతి, భరత్ లు ఇంట్లోంచి వెళ్లడం అక్షయ్ పట్టుకుంటాడు. అవనికి విషయం చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు ఇలా చేస్తే ఇంటి పరువు ఏమవుతుంది అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే అవని రాజేంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి మావయ్య గారు మీకు ఏమైనా కాఫీ తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది. కానీ రాజేంద్రప్రసాద్ నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా అని అంటాడు.. ప్రణతి పూజ చేస్తే హారతి తీసుకొని వస్తుంది. నేను ఉదయం పూజ చేశాను కదా ప్రనితి నువ్వు మళ్ళీ ఇప్పుడు చేసావ్ ఏంటి అని అడుగుతుంది. అవని.. ఈరోజు ఇంటర్వ్యూ ఉందని భరత్ వెళ్ళాడు వదిన అది ఖచ్చితంగా రావాలని పూజ చేశాను అని అంటుంది. కచ్చితంగా ఈ జాబ్ తనకే వస్తుంది అని అవని అంటుంది. రాజేంద్రప్రసాద్ ఈ జాబు లేకపోయినా ఏదో ఒక జాబ్లో నేను పెట్టిస్తాను అని అంటాడు.
అప్పుడే అవనికి ఫోన్ వస్తుంది. భరత్ మీ తమ్ముడేనా అతని అరెస్ట్ చేసాము మీరు పోలీస్ స్టేషన్ కి రండి అని ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఆ మాట వినగానే అవని ప్రణతి రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. పల్లవి చక్రధర్ ప్లాను సక్సెస్ అయిందని ఇద్దరూ తెగ ఖుషి అవుతుంటారు.. వీడు బుక్ అయ్యాడు పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారో చూడాలి అని పల్లవి వాళ్ళని ఫాలో అవుతుంది.. పోలీస్ స్టేషన్లో భరత్ ని చూసిన అవని తనది షాక్ అవుతారు..
మా తమ్ముడు అలాంటి వాడు కాదండి. అలాంటి తప్పులు జీవితంలో చేయడు అని అవని ఎంత చెప్తున్నా సరే ఎస్సై మాత్రం ఎవరు మేము తప్పు చేశామని చెప్పరమ్మా అని అంటాడు.. ఆ అమ్మాయి తప్పు జరిగిందని ఒప్పుకుంది కానీ వీడు మాత్రం ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు. చందమామ కథలు చెప్తున్నాడు అని ఎస్సై అంటాడు. అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి భరత్ కి బెయిల్ ఇచ్చి వెళ్తాడు. అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. రెండు కోటింగ్ లు అయిపోయాయి ఇంకో నాలుగు కోటింగ్లు వేపిద్దామని అనుకున్నాను కానీ నీ తమ్ముని విడిపించుకుని వెళ్తున్నావా అని అనుకుంటుంది.
ఇక పల్లవి ఈ విషయాన్ని ఎలాగైనా సరే పార్వతికి చెప్పాలని బయలుదేరుతుంది.. ఇంట్లో పల్లవి అనుకున్నట్లు అనుకున్నట్లుగానే పార్వతికి చెప్తుంది. పార్వతి ఆవేశంగా ఇలాంటి వాడికి నా కూతుర్ని చేయి పెళ్లి చేయాలని చూస్తుందా? ఆ అవని ఏమైందో తేల్చుకుంటాను అని అనుకుంటుంది.. పల్లవి పార్వతి ఇద్దరూ అవని వాళ్ళింటికి బయలుదేరుతూ అక్షయకి ఫోన్ చేస్తుంది. బ్రోతల్ కేసులో అరెస్టు అయ్యాడు అన్న విషయాన్ని అక్షయకి పార్వతి చెప్తుంది..
అవని తన తమ్ముని తీసుకొని ఇంటికి రాగానే అక్షయ్ నీలాంటిది వాడికి నా చెల్లెలి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని చితగ్గొట్టేస్తాడు.. అవని ఎంతగా అడ్డుపడుతున్న సరే ఇలాంటి వాడికి నా చెల్లిని ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ అవన్నీ కూడా తిడుతూ భరత్ ని దారుణంగా కొడతాడు అక్షయ్.. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా చేయడం మంచిది కాదు అని రాజేంద్రప్రసాద్ అనడంతో ఆగుతాడు..
Also Read : నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?
అప్పుడే వచ్చిన పార్వతి.. ఛీ ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి గొంతుకొయ్యాలని చూస్తున్నావా అని అవని పై సీరియస్ అవుతుంది.. ఇలాంటివాడు ఎలాంటివాడు మీకు తెలీదా.. వీడు ఒక గాలి వెధవ జూలై వాడు తిరుగుబోతు అని మీకు అర్థం అవ్వలేదా.. నా కూతురు విషయంలో నా నిర్ణయం ఫైనలు అని అంటుంది పార్వతి.. గారితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..