Inaya sultana:తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా బాగా పరిచయమై, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఇనయా సుల్తానా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన కెరీర్, వ్యక్తిగత జీవితం మరియు పెళ్లిపై ఆమె స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో తాను ఎవరిలా ఉండాలనుకుంటుందో చెపుతూ పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ఇలాంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడే ఇనయా సుల్తానా.. రీసెంట్ ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ఆలోచనలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాగా శాశ్వతంగా నిలిచిపోవాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక సల్మాన్ ఖాన్ తర్వాత ఇనయా ఖాన్ మాత్రమేనని, తన దారి వేరని ఆమె ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఎప్పుడూ కుంభస్థలాన్ని కొట్టాలనే లక్ష్యంతోనే తాను ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
also read:జీరోతో మొదలై వందల కోట్ల ఆస్తి వరకు.. విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా!
ఇక పెళ్లి మరియు ప్రేమ గురించి మాట్లాడుతూ ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు చేశారు. “పెళ్లి చేసుకుని ఏం ప్రయోజనం? రోజూ గొడవలు పడుతూ ఆ భారం మోయడం మనకెందుకు? ప్రేమ, పెళ్లి లేకుండానే ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తాను వీటిని ఎప్పుడూ నమ్మనని, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివని అన్నారు. ఇక గతంలో ఏదైనా బాధ అనుభవించి ఉంటారేమో అని అడిగితే.. తాను ఎప్పుడూ సూటిగానే మాట్లాడతానని, తన మనసులో ఏముంటే అదే ముఖం మీద చెబుతానని ఇనయా స్పష్టం చేశారు.
వ్యక్తిగత విషయాలతో పాటు తన కెరీర్ గోల్స్ గురించి కూడా ఇనయా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే తాను ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నానని, తన సొంత బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నానని వెల్లడించారు. తన సమయమంతా ఆ వ్యాపారానికే కేటాయిస్తున్నానని, త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు. ఇక జీవితంలో ఎంత నెగెటివిటీ ఉన్నా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తేనే విజయం సాధించవచ్చని ఆమె నమ్ముతున్నారు.
ఇక మొత్తానికి చూస్తే, పెళ్లికి దూరంగా ఉంటూ తన కెరీర్‌పై, బిజినెస్ ప్లాన్స్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఇనయా సుల్తానా ఆలోచనలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్‌లో తనకంటూ ఒక బలమైన ముద్ర వేయాలని చూస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.