E-Paper
Advertisement

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!
Advertisement

YSRCP Leaders: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, టీడీపీ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్తే పోలీసులే అడ్డుకున్నారని, మహిళల చేతిలోని నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు. ప్రభుత్వం రూమ్‌లో కూర్చొని మేయర్లు, కార్పొరేటర్లు ఎవరో రాసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తుపాకులు ఎక్కుపెట్టి భయపెట్టాలని చూస్తోందని, రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఘటనలపై విచారణ జరిపి తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు తీర్పు.. ఈసీకి విజ్ఞప్తులు

Advertisement

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్సార్‌సీపీ విజయం కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులను, పక్షపాతంగా ఉన్న పోలీసులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) కోరినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 19 మున్సిపాలిటీల్లో తిరిగి నామినేషన్లకు 48 గంటల సమయం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, మార్గదర్శకాలను అమలు చేయకపోతే మళ్ళీ న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

చంద్రబాబు, హోంమంత్రి రాజీనామాకు డిమాండ్

Advertisement

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోటీ చేయనీయకుండా అడ్డుకున్నారని, 722 వార్డులకు గాను 458 వార్డుల్లో నామినేషన్లు వేయలేని పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ అరాచకాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని, ఎన్టీఆర్ నుంచి పార్టీని దొంగిలించినట్లే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.

Also Read: చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

Tags

Related News

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

Big Stories

Advertisement
×