E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవని ప్లాన్ లో ఇరుక్కున్న అక్షయ్.. కమల్ ను బుట్టలో పెట్టుకున్న పల్లవి..

Intinti Ramayanam Today Episode : అవని ప్లాన్ లో ఇరుక్కున్న అక్షయ్.. కమల్ ను బుట్టలో పెట్టుకున్న పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode December 7th :  నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో పూజ చెడిపోయినందుకు పల్లవి బయటకు వచ్చి సంతోషంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరి మంచి కోసం చేస్తున్న పూజ చెడిపోతే నీకు సంతోషంగా ఉందా నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావ్ అనేసి అవని అడుగుతుంది. ఈ పల్లవి నాకు టెన్షన్ గా ఉంటే డాన్స్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా అక్క అనేసి అంటుంది. నువ్వు ఈ పూజ చెడిపోవడానికి కారణం నువ్వే కదా.. రాత్రి కుండలో పోసిన నెయ్యి బాగానే ఉంది పొద్దున చూసినప్పుడు నెయ్యి ఉంది. నువ్వు కాఫీ చేయడానికి వంట గదిలోకి వెళ్లావు అప్పుడే కుండకి చిల్లు పెట్టావని అర్థమవుతుంది నువ్వు తప్ప వంటగదిలోకి ఎవరు వెళ్ళలేరు అని అవని అడుగుతుంది. ఆ మత్తుమందు స్ప్రే చేసిన ఆవిడ నువ్వు పంపించిన ఆవిడే కదా నిజం చెప్పు అనేసి అవని అడగ్గాని పల్లవి నువ్వు చాలా ఇంటలిజెంట్ అక్క నీ తెలివికి జోహార్లు అనేసి అంటుంది. నువ్వు చేసే పూజ మంచి జరుగుతుందంటే అందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు కానీ పూజ ఆగిపోతే అందరూ నిన్ను తిడతారు నాకు కావాల్సింది అదే కదా అనేసి అంటుంది. ఇక పల్లవి ప్లాన్ ను బయట పెడుతుంది. ఇక అవని అక్షయ్ మందును తాగేస్తుంది. అక్షయ్ కు చుక్కలు చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఈ ఇల్లు చెడిపోవాలని నేను అనుకున్నాను అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను నా ప్లాన్ చేంజ్ అయింది అని పల్లవి అంటుంది. నాకు ఇండ్లు కావాలి ఇంటి ఆస్తికి నా కొడుకు ఒక్కడే వారసుడవ్వాలి అంటే శ్రీకర్ బావ లాగే నువ్వు అక్షయ్ బావ కూడా బయటికి వెళ్లాలి నీ బిడ్డ ఈ ఆస్తికి అడ్డు రాకూడదు అనేసి పల్లవి అంటుంది. పల్లవి మాటలు విన్న అవని షాక్ అవుతుంది. నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని అస్సలు ఊహించలేదు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని వృధా చేస్తూనే ఉన్నావు. ఇకమీదట నీకు అవకాశాలు ఇచ్చేదే లేదు అని అవని అంటుంది. అనుకుంటున్నవేవి జరగవు జరగనివ్వను అనేసి అవని పల్లవితో అంటుంది. ఇక అక్షయ్ ఆరాధ్యను తీసుకుని వచ్చి పాలు తీసుకొస్తాను తాగు అనేసి అంటాడు. పాలు తీసుకురాగానే ఆరాధ్య మమ్మీ తీసుకొస్తుంది కదా నువ్వెందుకు తీసుకొచ్చావు నాన్న అనేసి అంటుంది. మీ మమ్మికి చాలా పనులు ఉంటాయి నిన్ను చూసుకునే అంత పని లేదులే అనేసి వెటకారంగా అంటాడు. అప్పుడే అవని వచ్చి ఆ పాలు నేను తాగిస్తాను ఇవ్వండి అనేసి అంటుంది. కానీ నేను చూసుకుంటానని ఆరాధ్యన్ని తీసుకొని బయటికి వెళ్తాడు.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ మందుని అవని తాగినట్టు యాక్ట్ చేస్తుంది. ఇక జీవితంలో మీరు మందు తాగకుండా చేయాలనేసి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అవని మందనంతా సింకులో పడేసి తాగినట్టు నటిస్తుంది. అక్షయ్ అవని నిజంగానే మందు తాగిందని భయపడతాడు. అవని నేను బయటికి వెళ్తాను అనేసి అనగానే అక్షయ్ నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్తే అందరూ ఏదో అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు మీరు తాగుతుంటే నాకు కంపెనీ కోసం నన్ను అడిగారని అంటాను. మీరు తాగితే తప్పులేదు నేను తాగితే తప్ప అనేసి అవని అక్షయ్ కి షాకిస్తుంది. అవని తన మీద అనుమాన పడుతున్నాడని అక్షయ్కి చెప్తుంది. నా భర్త నన్ను కొడుతున్నాడని నన్ను తిడుతున్నాడని నామీద అనుమానంతో నన్ను దూరం పెడుతున్నాడని మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అనేసి బయటకు వెళ్తానని అంటుంది. ఇలా అరవకు అరిస్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు బాగోదు నువ్వు తాగేవని తెలిస్తే ఇంక ఇంట్లో అస్సలు ఊరుకోరు అనేసి అక్షయ్ అవనీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు.

కానీ అవని మాత్రం అక్షయ్ ని ఇంకా ఇబ్బంది పెట్టాలని ఎక్కువగా గా యాక్ట్ చేస్తుంది.. అక్షయ్ మాత్రం అవనీని ఎలా కంట్రోల్ చేయాలి ఇలా వెళ్తే నేను అడ్డంగా దొరికిపోతానని ఆలోచిస్తూ ఉంటాడు. అవని మాత్రం అస్సలు తగ్గకుండా నేను బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మీరు నాతో డాన్స్ చేయాలని ఇద్దరూ కలిసి కాసేపు డాన్స్ చేస్తారు. ఇక పల్లవి కమల్ ని ఎలాగైనా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. కమల్ కి ఇష్టమైన ఫుడ్ ని తీసుకురావాలని అనుకుంటుంది. మంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ పెట్టిన ఫుడ్డు రావడంతో మొత్తం తానే చేసిందని కవరింగ్ ఇచ్చుకునేందుకు ఆ ఫుడ్ ని ఇంట్లో చేసినట్టు రెడీ చేసి కమల్ని పిలుస్తుంది. బావా నీకు ఎప్పుడు ఫోన్ ఏనా నువ్వు రా బయటికి అనేసి తీసుకొని వస్తుంది. ఏమైంది అని అడిగితే నీకోసం నేను కష్టపడి ఫుడ్ చేశానని అంటుంది. ఇక భానుమతి పార్వతీలు అక్కడికి వస్తారు. నీ భార్య నీ కోసం కష్టపడి ఫుడ్ చేసింది మాకు చాలా సంతోషంగా ఉందని అంటారు. అనుమతి తినబోతుంటే ఇది నా భార్య చేసింది నేనొక్కడినే తినాలి నువ్వు వెళ్లి ఏం మజ్జిగ పెరుగు వేసుకుని తిను అనేసి అంటాడు. ఇక అవని అక్షయ్ కి రెస్టు లేకుండా చేస్తుంది. అక్షయ్ కి ఎలాగైనా నిజం చెప్పాలని తనని వాళ్ళిద్దరి మధ్య దూరం పోవాలని అనుకుంటుంది. అక్షయ్ కి తన అమ్మ తమ్ముడు గురించి చెప్పకపోవడానికి కారణం తన అమ్మకి ఇచ్చిన మాటే అని నిజం చెప్తుంది. నేను మా అమ్మ మా తమ్ముడిని కలవడానికి మీకు అబద్ధం చెప్పి వెళ్ళను తప్ప నేనే తప్పు చేయలేదండి అనేసి అవని అంటుంది. అవని చెప్పింది నిజమే అని అక్షయ్ అనుకుంటాడు. అక్కడి తో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×