Dil Raju : తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు.. ఈ మధ్య తెలుగుతో పాటుగా పలు బాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. గతంలో ఈయన పేరును ప్రభుత్వం ప్రకటిస్తుందని వార్తలు వినిపించాయి. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాలనే కాదు చిన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు దిల్ రాజు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను క్రియేట్ చేశారు.. అంతేకాడు ఆ బ్యానర్ కు ప్రత్యేకమైన వెబ్ సైట్ కు ఉందని తెలుస్తుంది.. బడా నిర్మాతగా కొనసాగుతున్న ఈయన ఇప్పుడు ఈ పదవి రావడంతో ఆయనకు ఇండస్ట్రీలోని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే కాదు. బలగం లాంటి చిన్న సినిమాలను నిర్మించి భారీ విజయానన్ని సొంతం చేసుకున్నాడు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు దిల్ రాజు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను క్రియేట్ చేశారు. మొదట ఆయన సినిమాలకు డిస్టిబ్యూటర్ గా పని చేసిన విషయం తెలిసిందే.. 35 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా రానిస్తున్నాడు. ఇప్పటికి అదే సక్సెస్ తో దూసుకుపోతున్నాడంటే మామూలు విషయం కాదు. సక్సెస్ కు కేరాఫ్ గా ఎన్నో తెలుగు చిత్రాలను ఆయన బ్యానర్ పై నిర్మించాడు..
నిజానికి దిల్ రాజు అసలు పేరు అదికాదు.. ఆయన అసలు పేరు దిల్ రాజు కాదు. వెంకటరమణారెడ్డి. ఆయన నిర్మించిన తొలి సినిమా హిట్ అవ్వడంతోనే ఆ సినిమానే పేరుగా మార్చుకున్నాడట.. ఇక 1990 లో పెళ్లి పందిరి అనే సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా దిల్‌రాజు కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో హీరో నితిన్ నటించిన దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది.. తెలుగులో మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రామ్‌చరణ్- శంకర్‌ల కాంబోలో భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.. వీటితో పాటుగా మరో మూడు ప్రాజెక్టులను అనౌన్స్ చెయ్యనున్నారని టాక్..