BigTV English

Intinti Ramayanam Today Episode : అవనిని బయటకు వెళ్లగొట్టిన పార్వతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Intinti Ramayanam Today Episode : అవనిని బయటకు వెళ్లగొట్టిన పార్వతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Intinti Ramayanam Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్యకు జ్వరం వచ్చింది వదిన అమ్మ అని నిన్నే కలవరిస్తుంది.. నువ్వు ఒక్కసారి వచ్చిపో వదిన అనికమల్అంటే నేను ఆ ఇంటికి వస్తే ఎంత గొడవలు జరుగుతాయో నాకు తెలుసు కన్నయ్య.. నేను ఇప్పుడు వస్తే ఏం జరుగుతుందో అత్తయ్య ఎలా గొడవ చేస్తుందో నీకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది. ఇక కమల్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తాడు నర్స్ వేషంలో అవని ఆ ఇంటికి వస్తుంది. డాక్టరు ఏమీ లేదు మామూలు జ్వరమైనా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళ అమ్మని పాప కలవరిస్తుంది మరి వాళ్ళ అమ్మ ఇక్కడ లేదండి అని అడుగుతారు డాక్టర్. కానీ లేదండి వేరే పని మీద బయటకెళ్ళిందని వాళ్ళు చెప్తారు. పాపకు వచ్చింది చిన్న జ్వరమే అయితే మా నర్సు మీకు రాత్రంతా చూసి చెబుతుంది అని అనగానే నర్సిం ఎందుకండీ మేము చూసుకుంటాం అనేసి పార్వతి అంటుంది. తనకి టైం కి మెడిసిన్స్ ఇవ్వడం ఫీవర్ ని చెక్ చేయడం మా నర్సు చూసుకుంటుంది లేండి అనేసి డాక్టర్ అంటుంది. ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది నర్సు మీరందరూ బయటకు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి అంటుంది. అవని ఆరాధ్యను దగ్గరకు తీసుకుంటుంది. దానితో ఆరాధ్య అమ్మను పట్టుకొని ఏడుస్తుంది నువ్వు వెళ్ళిపోతావ్ అమ్మ నువ్వు ఉండకపోతే నేను ఉండలేను అమ్మ నేను చూడాలనిపిస్తుంది అనేసి ఏడుస్తుంది. నువ్వు మంచి మంచిగా ఉండి నాన్న చెప్పిన మాట విని స్కూలుకు వెళ్తే నేను మళ్ళీ వస్తాను నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా అమ్మ అనేసి అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాద్యకు జ్వరం రావడంతో అవనికి కాల్ చేసి కమల్ రమ్మని పిలుస్తాడు. అవని నర్సుగా వచ్చి తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రింత ఆమె చూసుకున్న విధానం చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నిజంగా నర్సుగా చాలా బాగా చేసిందని అనుకుంటారు. ఇక అక్షయ్ ను చూసి భాధ పడుతుంది అవని.. ఉదయం లేవగానే అందరు ఆరాధ్య కోసం వెయిట్  చేస్తుంటారు. అవని ఆరాధ్యం తీసుకొని బయటకొస్తుంది. ఆరాధ్య నడుచుకుంటూ రావడంతో అందరూ సంతోషపడతారు. మా మనవరాలికి ఏమైందో నాని టెన్షన్ తో మేము రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు కానీ మీరు ఒక నర్సుగా కాకుండా తల్లిగా దగ్గరుండి మా మనవరాలుకి నయం ఎలా చేశారు. మీరునాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అనేసి అందరూ అంటారు. అవని అందరికీ చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి ఏ ఆగు ఒక నిమిషం ఇలా తిరుగు అనేసి అడుగుతుంది. తన పేర్కొన్న మాస్క్ ని తీసేస్తుంది. అవని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక పార్వతి అవనిపై చిందులేస్తుంది. నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టద్దు అని చెప్పాను కదా అయినా నువ్వు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వస్తావనేసి పార్వతి అంటుంది. మనుషుల్ని చంపాలనుకున్న నీకు ఇలా మారువేషంలో రావాలనుకోవడంలో తప్పులేదులే అనేసి అవనిని పార్వతి నోటికొచ్చినట్లు తిడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ పార్వతిని అరుస్తారు బిడ్డ కోసం తల్లి రావడంలో తప్పులేదు అనేసి అంటారు. కానీ పార్వతి మాత్రం తన మాటే నెగ్గాలని అవనిపై అరుస్తుంది..

ఇక ఆ గొడవ అయిన తర్వాత రాజేంద్రప్రసాద్ కమల్ దగ్గరకొచ్చి బాధపడతాడు. అవని నీ ఇంట్లోకి తీసుకురావడానికి కమలై అంతా చేశాడని పల్లవి ఇంకా ఎలాగైనా అవని ఇంట్లోకి రాకుండా ఉండాలని ప్లాన్ వేస్తుంది. అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు కానీ పల్లవి మాత్రం భోజనం చేయడానికి రాదు. ఏమైంది ఎందుకు రాలేదంటే అవన్నీ చేసిన పనికి నాకు సిగ్గుగా ఉంది ఎవరింట్లోనో నీతిమాలిన వారింట్లో ఉంటూ ఇంటి పరువు తీస్తుంది అనేసి అరుస్తుంది. అవని అక్కని క్షమించి ఇంటికి తీసుకురావాలని ఇదంతా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఈసారి ఇంకొకరు వస్తారు. ఇంట్లో మీరంతా ఎలా ఉంటున్నారు మీకు కొంచెం కూడా సిగ్గులేకుండా ఎలా తినాలనిపిస్తుంది అనేసి పల్లవి అరుస్తుంది. దానికి నా భార్యకు బుద్ధి లేదు అంటావా నిన్ను అనేసి పల్లవిని కొట్టడానికి అక్షయ్ వెళ్తారు. ఇక కమల్ నువ్వు కొడితే నిన్ను మళ్ళీ క్షమాపణ చెప్పమని అడుగుతది నా భార్యని కొట్టడానికి నీకేం లేదు అన్నయ్య నేను కొట్టాలి అనేసి మా వదిన అంత మాట అంటావా మా వదినకి సిగ్గు లేదంటావని నాలుగు పీకుతాడు.. అప్పుడే అక్కడికి చక్రధర వస్తాడు.. నా కూతుర్నే కొడతావా అనేసి కమల్ దగ్గరికి వెళ్తాడు. కమలు కొడితే తప్పేంటి రా అది నా భార్య అనేసి రివర్స్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని అక్షయ కోసం బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..


Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×