Indian Cricketers – AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ప్రపంచాన్ని శాసించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీ చేయని అద్భుతం లేదంటూ దూసుకుపోతోంది. ఈ రోజుల్లో ఎంతటి చిన్న పని చేయాలన్నా టెక్నాలజీ ఉండాల్సిందే. దానికి తోడు ఇప్పుడు ఏఐ తోడైంది. మామూలుగానే మన పనిని టెక్నాలజీ ఈజీ చేసింది. దానిని మరింత సులభం చేసింది ఏఐ. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని వాడుతోంది.
Also Read: IPL 2025: పాక్ ప్లేయర్లకు డబ్బులు ఇస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు ?
అయితే ఇందులో అందరికంటే భారత్ మరీ ఎక్కువగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానంపై సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ అండ్ నెగిటివ్ చర్చలు కూడా జరిగాయి. దీనిని కొంతమంది మంచి కోసం వాడుతుంటే.. మరి కొంతమంది చెడు కోసం వాడుతున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల నష్టాలు తప్ప లాభం లేదని పలువురు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం మార్పును స్వాగతించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు.
ఇది భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని వాదిస్తున్నారు. ఏదైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయని.. దానిని మనం ఉపయోగించుకునే తీరును బట్టి ఫలితం ఉంటుందని ఏఐ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ఏఐతో డిజైన్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నకిలీ ఫోటోలు కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ.. మరికొన్ని సందర్భాలలో వారి ఫోటోలను చూసి నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు.
తాజాగా టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ క్రికెటర్ల ఫోటోలని చిన్నపిల్లలుగా మార్చి.. వైరల్ చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సంజు శాంసన్, మహమ్మద్ సిరాజ్, శుబ్ మన్ గిల్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, సూర్య కుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.. ఈ తొమ్మిది మంది క్రికెటర్లకు సంబంధించిన ఏఐ ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Telugu Warriors vs Bengal Tigers: తెలుగు వారియర్స్ కు అగ్ని పరీక్ష..గెలవకపోతే ఇంటికే ?
ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు.. వారి అభిమాన క్రికెటర్ అచ్చం చిన్నప్పుడు ఇలానే ఉండేవాడేమోనని తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే.. మరో రెండు రోజులలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు. ఇక భారత్ గ్రూప్ – ఎ లో భాగంగా ఈ నెల 20న బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో ఛాంపియన్ ట్రోఫీ వేటను ఆరంభించబోతోంది. ఇక ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">