E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేంద్రను తోసేసింది లేడీ..పల్లవి, చక్రధర్ ప్లాన్.. పార్వతి పరిస్థితి సీరియస్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రను తోసేసింది లేడీ..పల్లవి, చక్రధర్ ప్లాన్.. పార్వతి పరిస్థితి సీరియస్..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అన్నది తెలుసుకోవాలి అని అంటాడు.. ఇది ఎలాగైనా సరే అవి చెప్పి అసలు నిజాలని కనిపెట్టాలని అక్షయ్ అనుకుంటాడు. అభి కి ఫోన్ చేసి అక్షయ్ రమ్మని పిలుస్తాడు. కామెంట్స్ గురించి చెప్పగానే వాటి గురించి నేను కనుక్కుంటాను అని అభి అంటాడు.. ఆ తర్వాత శ్రియ భానుమతి ఇద్దరు కూడా అవనీని దారుణంగా తిడతారు.. భానుమతి పల్లవి శ్రీయ ఆ ముగ్గురు కూడా అవని కావాలనే ఆస్తి రాయించుకుంది అంటూ దారుణంగా అవమానించేలా మాట్లాడుతారు… అవని ఇలాంటి తప్పు చేస్తుందని అసలు అనుకోలేదు అంటూ భానుమతి అనుకుంటుంది..

భానుమతికి సపోర్టుగా పల్లవి నిలవడంతో ఇంకాస్త రెచ్చిపోయి అందరూ కూడా అవనీని అవమానిస్తారు. అక్షయ్ మీరు నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అక్షయ్ అంటాడు. అసలు అవనీయ చేసిందని రుజువు ఎక్కడ మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అక్షయ్ అంటాడు.. ఇప్పటికీ నువ్వు నీ భార్యని వెనకేసుకుని వస్తున్నావా ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి లేదా అని భానుమతి అంటుంది.. అభి రాజేంద్రప్రసాద్ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారు అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. అవనికి పల్లవి పై అనుమానం ఉంటుంది.. నువ్వే కనక ఇదంతా చేసావని తెలిస్తే నీకు చుక్కలు చూపిస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… అభి రాజేంద్ర ని ఎవరు తోసేసారు అని తెలుసుకోవడానికి ఫామ్ హౌస్ కి వెళ్తాడు.. అక్కడ రాజేంద్ర ఎలాపడ్డాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. ఒక కుర్రాడు అక్కడ అనుమానంగా కనిపించడంతో పోలీసులు అతన్ని తీసుకొని వస్తారు. ఆ కుర్రాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని ఇక్కడనుంచే నేను చూస్తూ ఉంటాను అని అంటాడు. వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి ఈ బిల్డింగ్ నుంచి నేను చూస్తూ ఉంటాను అని అతను చెప్తాడు. అంతేకాదు మేము ఇక్కడ రీల్స్ కూడా చేసాము అని ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసినప్పుడు అభికి వెనకాల రాజేంద్రప్రసాద్ ని ఎవరు తోచినట్లు కనిపిస్తుంది.. అది చూసి షాక్ అవుతాడు.

ఆ వీడియోని నాకు పంపించు అని అతనితో చెప్పి వీడియోని పంపించుకుంటాడు.. వెంటనే అవనికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తాడు… అవని వెంటనే పోలీస్ స్టేషన్ కి రాగానే ఆ వీడియోని అవినీకి చూపిస్తాడు అభి. ఆ వీడియోని చూసిన ఆవని షాక్ అవుతుంది. రాజేంద్రని తోసి చంపాలి అనుకునేది ఒక లేడీ అని కన్ఫామ్ చేసుకుంటారు.. అవును ఒక లేడీ లాగే ఉంది. మరి ఈవిడ ఎవరు ఉంటుంది అని అభి ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ వీడియోని మీరు ఎవరికి చూపించలేదు కదా నాకు ఒకసారి ఆ వీడియోని పంపించండి మనము ఎవరు అన్నది తెలుసుకున్నాము. ఈ వీడియోని ఎవరికి చూపించకున్నా ఉంటేనే మంచిది హత్య చేయాలనుకున్న వాళ్ళు వేరే ఆలోచన చేస్తారు. తప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు అని అవని అంటుంది.

Advertisement

అవని అలా తోసి చంపాలనుకునేది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ఆరాధ్య బాధపడుతూ ఉంటే కోటి ఆరాధ్య ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు. అయితే నువ్వు బాధ పడిపోతూ ఉంటే.. మీ అమ్మ నాన్న చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడడం నీకు ఇష్టమా లేదు కదా అయితే మనిద్దరం ఒక ఆట ఆడదాం చాలా సంతోషంగా ఉండు నిన్ను చూసి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆరాధ్యతో కోటిలింగం అంటాడు. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడదామని అనుకుంటారు.. అయితే ఆడుతున్న సమయంలో బాలు లోపలికి వెళ్ళిపోతుంది.. ఆరాధ్య నేను వెళ్లి బాలుని తీసుకొని వస్తాను అని అంటుంది..

డైరెక్ట్ గా పల్లవి గదిలోకి వెళ్లిన బాలుని తీసుకున్న ఆరాధ్య అక్కడున్న బ్రేస్ లైట్ ని చూసి ఈ బ్రేస్లెట్ చాలా బాగుంది అని అంటుంది.. అది పట్టుకుని చూస్తూ ఉండగా పల్లవి లోపలికి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది.. నీ దగ్గర ఉన్న ఈ జువెలరీ చాలా బాగుంది పిన్ని అని అంటుంది.. ఇక వెంటనే అవి దగ్గరికి వెళ్లిన ఆరాధ్య నాకు పల్లవి పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లెట్ కావాలి అని అడుగుతుంది. అది నాకు బాగా నచ్చింది అలాంటిది నా బర్త్ డే కొనిస్తావా అమ్మ అని అడుగుతుంది. ఒకసారి ఆ బ్రేస్లెట్ ఎలా ఉందో చూద్దాం పద అని అవని ఆరాధ్యన్ని తీసుకొని వస్తుంది.

Also Read :గ్రాండ్ గా చక్రీ, మహాల రిసెప్షన్.. నారాయణ సర్ప్రైజ్ గిఫ్ట్.. మాధవ్ కోరిక తీరుతుందా..?

మొదట పల్లవి చూపిస్తాను అని అంటుంది. కానీ నేను వాడే వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు.. అంటూ మళ్ళీ ఆ బ్రేస్లెట్ ని చూపించదు. నా దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నాకు నచ్చదు అని పల్లవి చెప్తుంది. తనకి ఇష్టమైన వస్తువులు వేరే వాళ్ళ దగ్గరుంటే దాన్ని సహించలేక తాను చేసిన పనుల గురించి చెప్తుంది.. వస్తువులు పోలిన వస్తువులు చాలానే ఉంటాయి కానీ నువ్విలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని అవని అంటుంది.. మొత్తానికి పల్లవి ఆ బ్రేస్లెట్ ని చూపించడానికి ఒప్పుకోదు. పార్వతి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది అందరూ కలిసి పార్వతిని పట్టుకొని భోజనం చేయమని బలవంతం చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×