E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: సిటీకి వచ్చిన కోటిలింగం..చక్రధర్ కోసం పల్లివి కొత్త డ్రామా.. చక్రధర్ ను విడిపిస్తారా..?

Intinti Ramayanam Today Episode: సిటీకి వచ్చిన కోటిలింగం..చక్రధర్ కోసం పల్లివి కొత్త డ్రామా.. చక్రధర్ ను విడిపిస్తారా..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 13th : నిన్నటి ఎపిసోడ్ లో..శ్రీయా కన్నా ముందుగా నేను తల్లవ్వాలి అనుకున్నాను.. కానీ అది నాకన్నా ముందు తల్లి అయింది. దానికి సేవలు చేస్తుంటే నా కడుపు రగిలిపోతుంది.. ఏదైనా చేసి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి లేదంటే నన్ను బానిసలాగా చూస్తారు.. నాకు చాలా గిల్టీగా ఉంది అని పల్లవి బాధ పడుతూ ఉంటుంది. ఇక శ్రేయ ఈ శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో తెలియట్లేదు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడిపోతూ శ్రీకర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు కనీసం ఫోన్ అయినా చేసి చెప్తే నేను టెన్షన్ పడకుండా ఉంటాను కదా అనేసి శ్రియ అనుకుంటుంది.. అక్షయ్ తో కలిసి చేస్తున్న బిజినెస్ గురించి శ్రీకర్ చెప్పిన శ్రీయ తిడుతుంది. పల్లవి తల్లి అవుతుంది అని తెలుసుకొని అందరు సంతోషంగా ఉంటారు.. పల్లవి కొత్త డ్రామా మొదలు పెడుతుంది. అది కాస్త అందరిని నమ్మించేస్తుంది.. మరి ఈ డ్రామా వెనకాల పల్లవి ఎలాంటి కుట్రలు చేస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి తల్లి కాబోతుందని ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి మాత్రం ఈ సంతోషంలోనే మా నాన్నని బయటకు తీసుకురావాలి అని అనుకుంటుంది.. ఇక కోటిలింగం సిటీని చూస్తూ రీమ్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటాడు. అయితే అక్కడున్న సిటీని చూపిస్తూ కోటిలింగం చేసే రియల్సు ఎపిసోడ్ కి హైలైట్ గా మారుతాయి. ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఫ్రెండ్ నేను మా ఫ్రెండ్ అడ్రస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటాడు.. వంద రూపాయలు అయ్యేదానికి వెయ్యి రూపాయలు అడుగుతాడు ఆ ఆటో డ్రైవర్.. మొత్తానికి కోటిలింగం ని తింగరోడు అనుకొని ఆటో డ్రైవరు అడిగినంత డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటాడు.

Advertisement

రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరికి ఈ విషయం గురించి చెప్తే బాగుంటుందని అనుకుంటారు.. అయినా పల్లవి తల్లి కాబోతున్న విషయం తల్లికి తెలియకుండా ఉంటుందా ఏంటి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఎలా తెలుస్తుంది పల్లవి చెప్పిందో లేదో అని పార్వతి అడుగుతుంది.. పల్లవి నేను చెప్పలేదని చెప్పగానే రాజేశ్వర్ కి రాజేంద్రప్రసాద్ ఫోన్ చేస్తాడు.. రాజేశ్వర్ కి ఈ విషయం చెప్పగానే సంతోష పడినా కూడా తన భర్త జైల్లో ఉన్నాడని బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి తన తల్లి ప్రేమకు నోచుకోలేదని బాధపడుతూ కొత్త డ్రామా ని మొదలుపెడుతుంది. వాళ్ళు నిజంగానే బాధపడుతుందని తెలుసుకున్న పార్వతి మీ తల్లిని తీసుకొని వచ్చే బాధ్యత నాది అని మాటిస్తుంది.

ఇక పల్లవి 4 కన్నీళ్లు చుక్కలు రాలిస్తేనే సెంటిమెంటు వర్కౌట్ అవుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ సంతోష్ పడిపోతుంది. ఇక తర్వాత ఇదే విషయాన్ని భానుమతికి కూడా చెప్తుంది పల్లవి. ఇక పార్వతి పల్లవి తల్లి కాబోతుంది కదా తన ఒడి నింపడానికి రాజేశ్వర్ అని పిలిస్తే రానని చెప్పింది అన్న విషయాన్ని అవని అక్షయలతో చెప్తుంది. తల్లి కాబోతున్న ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే ఆ ఇంటికి మంచిది కాదు అని పార్వతి అంటుంది. ఎలాగైనా సరే మీ ఇద్దరు వెళ్లి రాజేశ్వరుని ఇంటికి తీసుకురండి అని పార్వతి అంటుంది.. ఆ మాట వినగానే అవని సరే అత్తయ్య ఎలాగైనా సరే పిన్ని ఇంటికి తీసుకొని వస్తాము అని అంటుంది.. ఇక అవని అక్ష ఇద్దరు కూడా రాజేశ్వరిని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు..

Advertisement

ఇక అవని అక్షయ్ ఇద్దరు కలిసి రాజేశ్వరి ఇంటికి వెళ్తారు. వాళ్ళింటికి వెళ్లిన తర్వాత అక్షయ్ మనం పిలిచినా కూడా అత్తయ్య రాదేమో అవనీ అని చెప్తాడు.. నా మీద కోపం కన్నా కన్నబిడ్డ మీద ప్రేమ అభిమానం ఎక్కువగా ఉంటాయి మనం వెళ్లి చెబుదాం ఆవిడ ఏమంటుందో ఆ తర్వాత చూద్దాం రండి అని అవని అంటుంది. ఇక అక్షయ్ రాజేశ్వరిని పిలుస్తాడు. నా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు అని రాజేశ్వరి అడుగుతుంది. మీకు మామయ్య గారు ఫోన్ చేశారు మీ అమ్మాయి తల్లి కాబోతుందని చెప్పారు. పల్లవి కి తల్లిగా మీరు చేయాల్సింది చేస్తే చాలా ఆనందపడుతుంది.. నువ్వు వస్తే పల్లవి చాలా సంతోషపడుతుంది రా అత్త వెళ్దామని అక్షయ్ అడుగుతాడు.

Also Read :రోహిణిపై అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..మరో తప్పు చేసిన మనోజ్..

మీ అత్త ఇప్పుడు గుర్తొచ్చిందా అని అంటుంది రాజేశ్వరి. నా కూతురు సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు. రిలీజ్ అయితే నేను సంతోషంగా ఉంటాను. కానీ నా భర్త రిలీజ్ అవ్వకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. ఆడపిల్లని ఆశీర్వదించి ఆనందించడానికి తల్లిదండ్రులు కలిసి రావాలన్న విషయం మాత్రం తెలియదా మీకు.. బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి పల్లవి గర్భవతి అయిన దానికి రెండింటికి ముడిపెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. నా భర్త మంచివాడు కాదు మీకు తెలుసు కదా మీకోసమే నేను ఎంతగా ఆలోచించను. అలాంటిది నా భర్త మారిపోయిన సరే మీరు నా భర్తని విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు అని రాజేశ్వరి అడుగుతుంది. భర్తతో కలిసి నేను ఇంటికి వస్తాను లేదంటే మాత్రం ఆ ఇంటికి రాను అని రాజేశ్వరి తేల్చి చెప్పేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కమల్ చక్రధర్ ని రిలీజ్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×