E-Paper
Advertisement

Family Drama OTT : భార్య లవర్ తో చెల్లి పెళ్లి… కితకితలు పెట్టే ఫ్యామిలీ కామెడీ డ్రామా

Family Drama OTT : భార్య లవర్ తో చెల్లి పెళ్లి… కితకితలు పెట్టే ఫ్యామిలీ కామెడీ డ్రామా
Advertisement

Family Drama OTT : కుటుంబంతో కలిసి సరదాగా చూడదగ్గ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకునే వారికి, ఓటీటీలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా చూస్తే విజిల్స్ వేస్తారు. నవ్వు ఆపుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్క సారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘గురువాయూర్ అంబలనదయిల్’ (Guruvayoor Ambalanadayil). దీనిని విపిన్ దాస్ దర్శకత్వం వహించగా, దీపు ప్రదీప్ కథను అందించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిల విమల్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  క్రేజీ కొరియన్ జాంబీ సిరీస్ ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’ అప్డేట్… మరో బ్యాడ్ న్యూస్ కూడా

స్టోరీ ఏమిటంటే

వినూ రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం తన ప్రియురాలు పార్వతితో బ్రేకప్ అయిన విషయాన్ని మర్చిపోలేక బాధపడుతుంటాడు. అతనికి కేరళలో అంజలి (అనస్వర రాజన్)తో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆనందన్ (పృథ్వీరాజ్ సుకోమారన్) అంజలి అన్నయ్య. జంషెడ్‌పూర్‌లో పనిచేస్తుంటాడు. వినూ తన చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి, వినూతో ఫోన్‌లోనే మంచి స్నేహం పెంచుకుంటాడు. వినూ తన పాత ప్రేయసిని మర్చిపోయేలా ఆనందన్ అతనికి ధైర్యం చెప్తాడు. ఆనందన్ కూడా తన భార్యతో గొడవపడి విడిపోయి ఉంటాడు. వినూ సలహాతోనే ఆనందన్ తన భార్యతో మళ్లీ కలుస్తాడు.

Advertisement

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. వినూ గతంలో ప్రేమించిన పార్వతి (నిఖిలా విమల్) మరెవరో కాదు, ఆనందన్ భార్యే అని వినూకు తెలుస్తుంది. తన బావ భార్యే తన పాత ప్రేయసి అని తెలియడంతో వినూ షాక్‌కు గురవుతాడు. ఈ విషయం ఆనందన్‌కు తెలిస్తే పెళ్లి ఆగిపోవడమే కాకుండా, వారిద్దరి మధ్య గొడవలు జరుగుతాయని వినూ భయపడతాడు. గురువాయూర్ ఆలయంలో వినూ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆనందన్ మాత్రం పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపించాలని పట్టుదలతో ఉంటాడు. చివరికి ఈ నిజం ఆనందన్‌కు ఎలా తెలుస్తుంది ? వినూ, అంజలి పెళ్లి జరిగిందా ? ఆనందన్, వినూల మధ్య గొడవ సమసిపోతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×