E-Paper
Advertisement

Frequent Headache: తరచూ తలనొప్పా ? బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు జాగ్రత్త !

Frequent Headache: తరచూ తలనొప్పా ? బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు జాగ్రత్త !
Advertisement

Frequent Headache: మనం తల నొప్పిని చిన్న సమస్యనే కాదా అని అని లైట్ తీసుకుంటాం. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్ లేదా కంటి ఒత్తిడి వంటివి తలనొప్పికి సాధారణ కారణాలు. కానీ తరచుగా తలనొప్పి ఉంటే.. మాత్రం దానిని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్యకు కారణం కావచ్చు. ముందుగానే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి ఎలా ఉంటుంది ?
మెదడులో కణితి ఏర్పడినప్పుడు.. అది పుర్రె లోపల ఒత్తిడిని పెంచుతుంది లేదా చుట్టు పక్కల మెదడు కణజాలాన్ని చికాకు పెడుతుంది. ఈ ఒత్తిడి వల్ల కలిగే తల నొప్పులు సాధారణ తల నొప్పుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.

Advertisement

కొన్ని సాధారణ లక్షణాలు:
1.ఉదయం పూట తీవ్రమైన నొప్పి
2. దగ్గినప్పుడు, వంగినప్పుడు నొప్పి పెరుగుతుంది.
3. నొప్పి సమయంలో పెయిన్ కిల్లర్స్ కూడా  పనిచేయవు

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు:
మెదడు కణితులతో సంబంధం ఉన్న తలనొప్పి ఒంటరిగా రాదు. వీటితో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. మీ తలనొప్పితో పాటు మీరు ఈ కింది సమస్యలను ఎదుర్కొంటే.. మాత్రం జాగ్రత్తగా ఉండండి.

Advertisement

1. నిరంతర వికారం లేదా వాంతులు
2. అస్పష్టమైన దృష్టి లేదా డబుల్ దృష్టి
3. మూర్ఛ
4. జ్ఞాపక శక్తి సమస్యలు లేదా ప్రవర్తనలో మార్పులు
5. చేతులు లేదా కాళ్ళలో బలహీనత

డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి ?
మీ రోజువారీ పనులకు అంతరాయం కలిగించే తీవ్రమైన లేదా ఎక్కువ సేపు తలనొప్పి ఉంటే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి, గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది లేదా అసమతుల్యత వంటి నాడీ సంబంధిత లక్షణాలతో కూడి ఉంటే.. వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం ?
మెదడు కణితులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. ముందస్తుగా గుర్తించడం వల్ల సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకునే అవకావం కూడా ఉంటుంది.  MRI లేదా CT స్కాన్‌లు వంటి రోగ నిర్ధారణ సాధనాలు నిరంతర తలనొప్పికి గల కారణాలను గుర్తించడంలో సహాయ పడతాయి. ఇవి ప్రమాద తీవ్రతను కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×