E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీయ.. పల్లవికి షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీయ.. పల్లవికి షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. స్కూల్లో తెరిపించామని కక్ష తోనే ఏక లింగం ఇలా చేశారని అందరూ అనుకుంటారు… పోలీసులు అక్షయ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత అందరూ అక్కడికి వెళ్తారు.. మా ఆయన ఏ తప్పు చేయలేదు అండి అని అవని అంతగా చెప్తున్నా సరే ఆ ఎస్ ఐ మాత్రం ఏ మాట వినడు. మీ ఆయన కథ ఒప్పుకున్నాడు తానే పిల్లలకు భోజనం పెట్టాడని అన్నారు. ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు మీరు ఏమి చేయలేరు అని ఎస్ ఐ అంటాడు. నేను ఒక లాయర్ ని బెయిల్ కు ట్రై చేస్తాను అని శ్రీకర్ అంటాడు. ఇక్కడ ఏ లాయర్ బెయిలు పనిచేయదు..

మీ ఊరు సర్పంచ్ ఏకలింగం ఏది చెప్తే అదే ఫైనల్ అని ఎస్ఐ అంటాడు.. అన్నయ్య నువ్వు స్కూల్ తెరిపించి ఈ ఊరికి మంచి చేయాలని చూస్తావు అందుకే ఆ ఏక లింగమే కావాలని నేను ఇలా ఇరికించాడు అని కమల్ అంటాడు.. నువ్వు ఒక్కమాట చెప్పు అన్నయ్య. వాడి అంతు చూస్తాను అని కమల్ సీరియస్ అవుతాడు.. కన్నయ్య ప్రతిదానికి ఆవేశపడితే మనం ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అవని అంటుంది.. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే అవి ఏక లింగంతో మాట్లాడండి అని ఎస్ఐ అనగానే అందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇన్ని జరగడానికి కారణం అవనినీ తిడతారు. ఇంట్లోకి వెళ్లి అక్షయ్ ని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే శ్రీయ ఇంట్లోని వస్తువుల అన్నిటిని విసిరిస్తూ ఉంటుంది. ఏంటి శ్రియా నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇవన్నీ విసిరేస్తున్నావ్ అని అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది.. శ్రీయ గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. కానీ పల్లవి మాత్రం షాక్ అవుతుంది.. ఇక ఎలాగైనా సరే అక్షయని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. స్కూలుకు వెళ్లిన అవని భోజనాలని నేను ఇంటి నుంచి తెచ్చాను. మరి పాయిజన్ ఎక్కడ కలిసిందో అర్థం కావట్లేదు అని స్కూల్ టీచర్ ని అవని అడుగుతుంది..

ఏమో మేడం ఎలా జరిగిందో తెలియలేదు మీరు పిల్లల కోసం మంచి జరగాలని అన్నీ చేశారు.. మిమ్మల్ని చూసి ఎవరో ఓర్వలేక ఇలా చేసినట్టున్నారు అని టీచర్ చెప్తుంది. అయితే అక్కడికి వచ్చిన కోటిలింగం ఆరాధ్య మీకోసం ఊరంతా వెతుకుతుంది మేడం అని అంటాడు.. మీరు ఎటువంటి సమస్యలు ఉన్న మీ సమస్యలను పోగొట్టడానికి మా అన్నయ్య సర్పంచ్ ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అని అవినీతో అంటాడు కోటిలింగం.. అసలు సమస్య వచ్చిందే మీ అన్నయ్య వాళ్ళని అవని అనుకుంటుంది.. నేను పెట్టిన రీలు ఒకటి చాలా బాగా పోతుంది ఒకసారి చూడు ఆరాధ్య అని అంటాడు..

Advertisement

ఆ రీల్ చూస్తున్న మధ్యలో ఏకలింగం అక్షయ్ ఇది జైలుకు పంపించాలి అని మాట్లాడుతూ ఉన్నట్లు వినిపిస్తుంది.. ఆ వీడియో ఏంటి ఇలా ఇవ్వు అని అవన్నీ తీసుకొని చూస్తుంది.. ఆ వీడియోని చూసి అవని షాక్ అవుతుంది.. ఇదంతా ఏక లింగం పని అని తెలుసుకొని అక్షయని విడిపించడానికి పోలీస్ స్టేషన్కు వెళుతుంది.. అవని అక్షయ్ ని విడిపిస్తానని చెప్పింది కదా మరి ఎలా విడిపిస్తుంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అవనినే చెప్పింది కదా మేము విడిపిస్తాను అని.. ఎలా విడిపిస్తుందో చూద్దాము అని అందరూ అనుకుంటూ ఉంటారు.

అక్షయ్ కోసం అవని పోలీస్ స్టేషన్కు వెళుతుంది.. మా అన్నయ్యని జైల్లో పెట్టాలి లేదా లోపలికి తీసుకొని వెళ్ళాలి. స్టేషన్ బయట ఎందుకు నిల్చబెట్టారు అని శ్రీకర్ అడుగుతాడు. లోపల స్టేషన్ లో కాళీ లేదు మీ అన్న ఏమి సన్మానం చేయించుకుని రాలేదు లోపల కూర్చోబెట్టి మాట్లాడడానికి అని ఎస్ ఐ అంటాడు. అయితే మీరు ఎవరు చేస్తారో తెలుసుకుని రమ్మన్నారు కదా ఎవరు చేశారో ఇది చూడండి అని అవని అంటుంది. ఆ వీడియోని చూపించగానే ఏకలింగం చేశాడని తెలుసుకొని పోలీసులు అక్షయ్ ని రిలీజ్ చేస్తారు. అవని ఇంకా అక్షయ్ తీసుకురాలేదేంటి అని రాజేంద్రప్రసాద్ తో పాటుగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.

అప్పుడే అక్షయ్అక్కడికి వస్తాడు.. నాన్న అని పిలుస్తాడు. రాజేంద్ర అక్షయ్ వచ్చావా అని ఎమోషనల్ అవుతాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్షయ్ వచ్చారని సంతోషంగా ఉంటాడు. అసలు ఎలా బయటికి వచ్చాడు రా ఏం జరిగింది నువ్వు కానీ బెయిల్ ఇచ్చావా ఏంటి అని శ్రీకర్ని రాజేంద్ర అడుగుతాడు.. అయితే నేను కాదు నాన్న వదిననే ఆ ఏకలింగం చేశాడని నిరూపించి మరీ అన్నయ్య నువ్వు రిలీజ్ చేసేలా చేసింది అని అవని పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు శ్రీకర్. అటు కమల్ కూడా వదిన చేసిన పనికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అని అంటాడు.. అక్షయ్ విడుదలడంతో మనకు ఇంకొక న్యూస్ కూడా తెలిసింది అని పార్వతి అంటుంది ఏంటి ఇంకో గుడ్ న్యూస్ అని అనగానే శ్రీయా తల్లి కాబోతుందని చెప్పగానే శ్రీకర్ చాలా సంతోషంగా ఉంటాడు.. ఇంట్లో అందరూ కూడా ఈ న్యూస్ విని చాలా సంతోషంగా ఉంటారు.

Also Read :తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న చింటూ.. రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందా..? బాలు కీలక నిర్ణయం..

నువ్వు ఇంక మారవా నీ బుద్ధి ఇంక మార్చుకోవా ఏంటి నువ్వు అని అవని పల్లవిని సీరియస్ గా తిడుతుంది. రాత్రి పల్లవిని మాట్లాడాలి అని బయటకు పిలుస్తుంది అవని..పల్లవి నీ ఇదంతా చేసింది అని అవనీకి తెలిసిపోతుంది ఏమో పల్లవిని కొడుతుంది.. అవని ఏక లింగంతో మాట్లాడిన వీడియో ని చూపించు మరి పల్లవిని కొడుతుంది. నువ్వు ఇంక మారవా నీ బుద్ధి ఇంక మార్చుకోవా ఏంటి నువ్వు అని అవని పల్లవిని సీరియస్ తిడుతుంది. ఈ వీడియోని భర్తకు చూపిస్తే నిన్ను ఏకలింగం కన్నా ముందు చంపేస్తాడు అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×