E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మ దిగే బస్టాప్ కే వచ్చిన అమర్

Nindu Noorella Saavasam Serial Today January 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మ దిగే బస్టాప్ కే వచ్చిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ, బుజ్జమ్మల కోసం హైదరాబాద్‌లో రాజు వెయిట్‌ చేస్తుంటాడు. బస్టాండ్‌ లో నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో రాజుకు సరస్వతి వార్డెన్ ఫోన్‌ చేస్తుంది. రాజు గారు భాగీ వాళ్లను పికప్‌ చేసుకున్నారా..? అని సరస్వతి అడుగుతుంది. ఇంకా బస్సు రాలేదు మేడం.. బస్టాప్‌ లోనే వెయిట్‌ చేస్తున్నాను అని చెప్తాడు రాజు. దీంతో సరస్వతి సరే రాజు గారు వాళ్లు రాగానే జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకెళ్లండి అని చెప్తుంది. రాజు అలాగే మేడం అని చెప్పగానే.. సరస్వతి మరో విషయం చెప్తుంది రాజు గారు ఇంకో విషయం బిడ్డను తీసుకుని భాగీ అక్కడికి రావడానికి చాలా సంతోషించింది. నేను ఎంతగానో నచ్చజెప్పి పంపించాను.

మీరు వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే.. రాజు కూడా మీరు మళ్లీ చెప్పాలా మేడం.. అది నా బాధ్యత భాగీ మేడం గారు లేకపోతే మన ఆశ్రమమే లేదు అంటాడు. దేవుడి శాపమో..? విధి వక్రించిందో ఏమో కానీ ఆ దంపతులు ఐదేళ్లుగా విడిపోయారు. మళ్లీ దగ్గర అవ్వడానికి ఇంకో రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకు భాగీని ఆ పాపను మనమే కాపాడాలి అని చెప్తుంది. సరస్వతి. దీంతో రాజు అలాగే మేడం వాళ్లుక ఏ లోటూ లేకుండా నేను చూసుకుంటాను.. విడిపోయిన దంపతులను కలపడానికి ఆ దేవుడు భాగీ మేడంను ఇక్కడికి పంపిస్తున్నాడేమో మేడం అని చెప్పగానే.. సరే రాజు గారు వాళ్లు వచ్చాక మీరు ఆశ్రమానికి వెళ్లాక నాకు ఫోన్‌ చేయండి అని చెప్తుంది సరస్వతి. అలాగే మేడం అంటూ రాజు కాల్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో అమర్‌, రాథోడ్‌ కలిసి అక్కడికి వస్తారు. కారు దిగి అటూ ఇటూ చూస్తారు. రాథోడ్‌ ఇక్కడేనా..? అని అమర్‌ అడగ్గానే.. అవును సార్‌ బస్సు ఇక్కడే ఆగుతుందని చెప్పారు అంటాడు రాథోడ్‌.

Advertisement

వాళ్లిద్దరిని చూసిన రాజు షాక్‌ అవుతాడు. అదేంటి సార్‌ వాళ్లు ఇక్కడికి వచ్చారు. భాగీ మేడం ఇక్కడే కదా బస్సు దిగుతుంది. కొంపదీసి భాగీ మేడం వస్తున్నట్టు సారుకు తెలిసిపోలేదు కదా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో రాథోడ్‌ రాజును చూస్తాడు. రాజు కూడా వాళ్ల దగ్గరకు వెళ్లి నమస్తే సార్‌ అని పలకరిస్తాడు. అమర్‌ గుర్తు పట్టనట్టు మీరు అని అడగ్గానే.. రాథోడ్‌ కల్పించుకుని సార్‌ రాజు గారు.. అనాథ ఆశ్రమంలో పని చేసే రాజు గారు.. సరస్వతి వార్డెన్‌ గారు ఉంటారు కదా..? ఆ ఆశ్రమం సార్‌ మీరు మిస్సమ్మ ఆ ఆశ్రమానికి 50 లక్షలు దానంగా ఇచ్చారు అని రాథోడ్‌ చెప్పగానే.. అమర్‌ సారీ సార్‌ మర్చిపోయాను.. సరస్వతి గారు, పిల్లలు  ఎలా ఉన్నారు అని అడగ్గానే.. మీరు మేడం గారు చేసిన సాయం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు సార్‌ అని రాజు చెప్పగానే.. అమర్‌ బాధగా అనాథ పిల్లలకు సాయం చేసింది.. నన్ను అనాథను చేసి వెళ్లిపోయింది అని మనసులో అమర్‌ బాధపడుతుంటాడు.

ఏంటి రాజు గారు విశేసాలు పొద్దు పొద్దున్నే ఇక్కడేం  చేస్తున్నారు.. అని రాథోడ్‌ అడగ్గానే.. సార్‌ అది ఊరు నుంచి మా బంధువులు వస్తున్నారు సార్‌ పికప్‌ చేసుకుందామని వచ్చాను సార్‌ అని రాజు చెప్పగానే.. మేము కూడా సార్‌ వాళ్ల ఫ్రెండ్‌ను పికప్‌ చేసుకుందామని వచ్చాము అని రాథోడ్ చెప్తాడు. దీంతో రాజు అవునా సార్‌.. సరే సార్‌.. అని చెప్తూ.. సార్‌ ఇక్కడ ఉన్నట్ఉట భాగీ మేడం కు ఫోన్‌  చేసి ముందు స్టాఫ్‌లో దిగిపోమ్మని చెప్పాలి అని మనసులో అనుకుని సరే సార్‌ ఉంటాను అంటూ పక్కకు వెళ్లి మిస్సమ్మకు కాల్‌ చేస్తాడు రాజు.. చెప్పండి రాజు గారు అని మిస్సమ్మ అడగ్గానే.. మేడం ఎక్కడిదాకా వచ్చారు అని రాజు అడుగుతాడు.. ఇప్పుడే సిటీలోకి ఎంటర్‌ అయ్యాము అని చెప్తుంది. దీంతో రాజు మిస్సమ్మను వేరే స్టాప్‌లో దిగమని  చెప్తుంటే.. మిస్సమ్మ ఫోన్‌ స్విచ్చాప్‌ అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×