E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న చింటూ.. రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందా..? బాలు కీలక నిర్ణయం..

Gundeninda GudiGantalu Today episode: తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న చింటూ.. రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందా..? బాలు కీలక నిర్ణయం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. చింటును చూసేందుకు బాలు మీనా ఆ ఊరికి వెళ్తారు. చింటూ బర్త్డే అని తెలుసుకున్న బాలు సుశీలమ్మను అడుగుతాడు..ఒక్కసారి కూడా మాకు ఫోన్ చేసి ఏ విషయం చెప్పలేదు. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే మేమే గ్రాండ్గా చింటూ బర్త్డేని చేసేవాళ్లం కదా అని బాలు మీనా అంటారు.. ఆమె రోహిణి విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడిపోతుంది. ఫోన్ చేస్తే అమ్మ తిడుతుంది అని సుశీల అంటుంది. అదే మీ అమ్మ తిడుతుంది అని ఫోన్ చేయలేదు బాబు.

అసలే మీ అమ్మగారికి మేమంటే అస్సలు ఇష్టం లేదు అని సుశీల అంటుంది.  వాళ్ళని ఎందుకు పిలవడం అని అంటుంది. ఎన్ని పనులు ఉన్నా ఇంత దూరం వచ్చాం వీడి కోసం మాత్రం అన్ని పక్కన పెట్టేస్తామని బాలు మీనా అనగానే సుశీల షాక్ అవుతుంది. బాలు మీనాలను చూసినా రోహిణి షాక్ అవుతుంది.. వీళ్ళిద్దరి ఇక్కడికి వచ్చారంటే కచ్చితంగా నేను దొరికిపోతాను అని అనుకుంటుంది.. ఎలాగైన వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది.. సుశీలమ్మ రోహిణి గురించి ఎక్కడ తెలిసిపోతుందనే కంగారు పడిపోతూ బాలు మీనాలతో సరిగ్గా మాట్లాడదు. వాళ్లు మాత్రం మేము రావడం మీకు ఇష్టం లేదు అంటూ అంటారు. అదేం లేదు బాబు రండి లోపలికి తీసుకెళ్తుంది. వాళ్లు లోపలికి రావడం చూస్తున్న రోహిణి అక్కడి నుంచి మెల్లగా జారుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అంటూ బర్త్డే అని తెలుసుకున్న మీనా బాలు ఇద్దరు కూడా సుశీలమ్మను అడుగుతారు.. వాడి పుట్టినరోజు అని కూడా మీరు మాకు చెప్పడం లేదు మేమంతా పరాయి వాళ్ళం అయిపోయాం అని అంటారు. అదేం లేదు బాబు ఎవరికీ చెప్పలేదు అందుకే అనేసి అనగానే సరే అమ్మ వెళ్దాం పద అని అంటాడు. మీకు ఎన్నో పనులుంటాయి కదా మీరు వెళ్ళండి పిల్లలు ఎదురుచూస్తున్నారని వెళ్లి వారితో కేక్ కట్ చేయిస్తాను అనేసి ఆమె అంటుంది. మమ్మల్ని రావద్దని చెప్తున్నారా అని బాలు అడుగుతాడు. అదేమీ లేదు రండి బాబు అని లోపలికి తీసుకొని వెళుతుంది.. మీనా బాలు హాల్లోకి రాగానే అక్కడ రోహిణి బ్యాగ్ చూసి సుశీల వాళ్ళ గుర్తుపడతారేమో అని కంగారు పడిపోతూ ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి వంట గదిలో పెడుతుంది..

అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు. వాళ్ళని రమ్మని చెప్పావా అని రోహిణి సీరియస్ అవుతుంది. కానీ సుశీల మాత్రం నేను రమ్మని చెప్పలేదు వాళ్లే వచ్చారు అదే నాకు కంగారుగా ఉంది అని అంటుంది.. నువ్వు నా జీవితం నిన్ను నడిరోడ్డు మీద చూస్తున్నావు అని రోహిణి సీరియస్ అవుతుంది.. ఇప్పుడు నా కొడుకు కోసం నేను ఉండాలా? నాకాపురాన్ని నిలబెట్టుకోవడానికి నేను వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తుంది. కానీ బాలు మీనాలు మాత్రం అంతా రెడీ చేసేసారు కదా కేక్ కట్ చేద్దాం రండి అని అంటారు.. అక్కడున్న వాళ్ళందరూ కూడా కళ్యాణి ఎక్కడా అని అడుగుతారు. సుశీల ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేస్తుంది.. ఆ కేక్ కట్ చేయ్యడానికి ముందు బాలు మీనా సుశీలతో అసలు నిజం చెప్పండమ్మా అని బ్రతిమలాడుతారు.

Advertisement

అన్న కొడుకు బర్త్డే కూడా రాలేకపోతున్నానే మీనా అనగానే.. అన్న కొడుకు కాదు కన్నా కొడుకు అని సుశీల అంటుంది. ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి మా అప్పులు తీరుస్తానని ముందుకు వచ్చాడు. అతనికి బదులుగా నా కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పాడు. బలవంతంగా నేను నా కూతుర్ని ఒప్పించి పెళ్లి చేసుకునేలా చేశాను. అతను చనిపోయాడు నా మీద కోపంతో తింటూ నేను నా దగ్గర వదిలేసి తను వెళ్ళిపోయింది. చదువును పూర్తిచేసుకుని ఉద్యోగం లో చేరింది.. దుబాయ్ లోనే సెటిలైపోయింది.ఒకసారి నాకు ఆమె నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడుతూనేని బాలు అంటాడు.

Also Read : కొత్త సీరియల్ ఎంట్రీతో ఆ రెండు సీరియల్స్ అవుట్.. దారుణంగా పడిపోయిన టీఆర్పీ..?

ఇక బాలు మీనా ఇద్దరు కలిసి కేక్ కట్ చేయిస్తారు.. ఆ తర్వాత చింటూ తన తల్లి కోసం ఎంతగా వెయిట్ చేసినా సరే రోహిణి వాళ్ళు ఉన్నారని రాదు. వంటగదిలోకి వచ్చిన సుశీల రోహిణి ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటుంది.. వాళ్ళని పంపించిన తర్వాత నేను లోపలికి వస్తాను అని రోహిణి అంటుంది. ఇక సుశీల వాళ్ళని ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుంది.. బాలు నేను ఇద్దరు కూడా చింటూ నీ దత్తత తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×