E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి డెడ్ లైన్.. కమల్ ను అశ్విన్ టార్గెట్.. అక్షయ్ ప్లాన్ రివర్స్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి డెడ్ లైన్.. కమల్ ను అశ్విన్ టార్గెట్.. అక్షయ్ ప్లాన్ రివర్స్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 24th: పల్లవి చక్రధర్ ను కలిసిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా అవని పల్లవిని ఆపుతుంది.. ఏమైంది పల్లవి నీకు డబ్బులు అంత అవసరం ఏమి వచ్చింది అని అడుగుతుంది.. నువ్వు నాన్న దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగావని తెలుస్తుంది.. మీ వరికి ఆ మేటర్ అప్పుడే వచ్చేసిందా..? నాన్న అన్ని కూడా చెప్పేసాడు అన్నమాట.. అసలు నీకు అంత డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది అని అవని అడుగుతుంది. అయితే అస్సలు మాట వినకుండా పల్లవి నా ఇష్టం నా జీవితం అని మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే అవని నువ్వు ఇంకా మారవా ఎందుకు నువ్వు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటావు అని అంటుంది అవని.. ఇక పల్లవి ఎంత చెప్పినా వినదు కాబట్టి నాకు బాబు బంగారం నగలను తీసుకొని రావాలి అని పల్లవికి చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అవని మాట విన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

పల్లవికి షాకివ్వబోతున్న అశ్విన్..

అశ్విన్ పల్లవి ఫోటో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.. నీ ఫోటోలు ఉందని నవ్వు సంతోషాన్ని నీ జీవితంలో ఉన్న నివ్వకుండా చేయాలి అని అనుకుంటున్నాను.. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు అంటూ అశ్విన్ ఆ ఫోటోని చూస్తూ పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటాడు.. ఆరాధ్యను స్కూల్ నుంచి తీసుకొని వచ్చి నాకు కమల్ ఐస్ క్రీం కావాలని అడిగితే అక్కడే ఉన్న షాప్ కి వెళ్తారు. అదే ఐస్ క్రీమ్ షాప్ లో అశ్విన్ కుర్చీని పల్లవి ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆరోగ్య స్పీడ్ గా రావడంతో ఆ ఫోన్ కాస్త కింద పడిపోతుంది. కమల్ ను చూసిన అశ్విన్ పల్లవి వాళ్ళ హస్బెండ్ కదా వీడితో నాకు చాలా పని ఉంటుంది అని అనుకుంటాడు. పల్లవిని ఇరికించాలి అంటే వీడిని హెల్ప్ చేయాలని అడగాలి. వీడిని అడ్డుపెట్టుకొని పల్లవి నువ్వు ఆట ఆడుకుంటాను అని కమల్ తో పరిచయం పెంచుకుంటాడు అశ్విన్.

భానుమతికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఆరాధ్య కమల్ ఇద్దరు కూడా వస్తున్నప్పుడు తెచ్చుకున్న ఐస్క్రీమ్లను ఒక్కొక్కటిగా తీసి తింటూ ఉంటాడు.. పల్లవి ఎందుకంత చిరాగ్గా ఉన్నావు ఏమైంది అని? భానుమతి అడగ్గానే.. నా గురించి నీకెందుకు నీ పని ఏదో చూసుకో అని గట్టిగా అరుస్తుంది. కానీ భానుమతి దీనికి అందమైన మొహం ఇచ్చిన ఆ దేవుడు చిరాకును కూడా ఎక్కువగానే ఇచ్చారు అనే మనసులో అనుకుంటుంది. అటు ఆరాధ్య కమల్ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ అని పేరు చెప్పగానే భానుమతి నోట్లో నీరు ఊరుతుంది.. నాకు ఐస్క్రీం పెట్టరా అని ఎంతగా బ్రతిమలాడినా సరే నువ్వు పైకి వెళ్లి మా తాతయ్యని చంపేస్తావు కాబట్టి నీకు ఐస్ క్రీమ్ పెట్టనీకి ఏం పెట్టను అని కమల్ కసురుకోవడంతో భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక పల్లవి కూడా ఐస్క్రీం కోసమే చూస్తుంది అని కమల్ అక్కడి నుంచి పంపిస్తాడు..

అవనితో అక్షయ్ డ్యూయేట్..

అవని చాలా కోపంగా ఉందని తెలుసుకున్న అక్షయ్ తను ఎలాగైనా సరే కూల్ చేయాలని అనుకుంటాడు. నీ కోపం పాలపొంగు లాగా కాసేపు ఉంటుంది అని అనుకున్నాను కానీ నువ్వు నాకు కాకరకాయ లాంటి విషయాన్ని తినిపిస్తావని అస్సలు అనుకోలేదు అని అక్షయ్ అంటాడు.. నీ కోపం తీరింది కదా ఇంకా తీరలేదా నీకోసం నేను హల్వా తీసుకొని వచ్చాను. అని ఎంతగా బ్రతిమిలాడినా సరే అవని మాత్రం మొండిగా ఉంటుంది.. ఇక అక్షయ్ కోపాలు చాలు శ్రీమతి గారు అంటూ ఒక డ్యూయెట్ పాట కూడా వేసుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. కానీ అక్షయ్ ఎంతగా బతిమిలాడినా మాత్రం అవని మాత్రం కొంచెం కూడా కరగదు.. ఎన్ని పాట్లు పడినా కూడా అవనీ మనసు కరగలేదు అని అక్షయ్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

పల్లవి నిద్రపోతూ ఉంటుంది అయితే అశ్విన్ తనని పిలిచినట్టు తనతో మాట్లాడినట్టు ఊహించుకుంటుంది. మా నాన్న అన్న మాటలు నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి, భయపెడుతున్నాయి.. అప్పుడే అశ్విన్ ఫోన్ చేయడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే పల్లవి ఈ టైంలో అశ్విన్ ఫోన్ చేస్తున్నాడు. అంటే ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : అయ్యో.. పెళ్ళైన కొన్నిరోజులకే భరించలేని బాధ.. కన్నీళ్లు ఆగవు..!

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×