PM Modi: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులకు అన్నివర్గాల నుంచి మద్దతు క్రమంగా పెరుగుతోంది. పరిస్థితి గమనించిన ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈసారి ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం చెప్పారు?
వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోడీ- నీట్ పేపర్ లీక్‌లపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రకటన చేశారు. అర్ధరాత్రి ప్రధాని ఓ వీడియో రిలీజ్ చేశారు. దాదాపు మూడు నిమిషాల వీడియోలో అనేక అంశాలను ప్రస్తావించారు. పేపర్ లీక్ అనేది ఒక సాధారణ విషయం కాదని తనకు తెలుసని ప్రస్తావించారు.
దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చాలా బాధాకరమైనదిగా చెప్పారు. శుక్రవారం జరగనున్న కేంద్ర మంత్రివర్గంలో దీనిపై చర్చిస్తుందని చెప్పారు.వచ్చే వారం పార్లమెంటులో దీనికి సంబంధించి బిల్లు పెడతామని తెలిపారు. అదే సమయంలో ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నేరస్థులకు కఠిన శిక్షలు సహా పరీక్ష పత్రాల లీకేజీని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి-పేపర్ లీకేజీ ఘటనలో గడిచిన రెండున్నర నెలల్లో అనేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు ప్రధాని.దోషులను పట్టుకుని జైలులో పెట్టామని, విద్యార్థుల ఏడాది వృధా కాకుండా చూడటమే మా బాధ్యతగా చెప్పారు. 22 లక్షల మంది విద్యార్థులు తక్కువ సమయంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల బిల్లు గురించి మాట్లాడారు ప్రధాని.
అన్నివర్గాల నుంచి నిరసనకారులకు మద్దతు-దీనికి సంబంధించి గురువారం సంబంధిత శాఖలను ఆదేశించినట్టు వివరించారు. ఆయా శాఖలు అర్ధరాత్రికి తనకు తీర్మానాన్ని సమర్పించాయని వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కఠిన శిక్షలకు సంబంధించిన నిబంధనలతో కూడిన తీర్మానాన్ని శుక్రవారం కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు.
ALSO READ: కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!
కేబినెట్ సహచరుల సూచనల తర్వాత దీన్ని ఖరారు చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో ఆ బిల్లును సభలో ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ రిలీజ్ చేసిన వీడియోపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో విడుదల చేయడం విద్యార్థుల మేధస్సును అవమానపరిచేలా ఉందన్నారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తక్షణమే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇది విద్యార్థులను అవమానించడమేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ప్రస్తావించారు.
Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.
Don’t insult their intelligence with this pathetic midnight video.
1. Sack Pradhan.
2. Punish those who beat students.
3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026