BigTV English

Intinti Ramayanam Today Episode : అవని కోసం అక్షయ్ ఆరాటం.. పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode : అవని కోసం అక్షయ్ ఆరాటం.. పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode March 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ బర్త్ డే ను సెలబ్రేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరు శ్రీకర్ కోసం వెయిట్ చేస్తుంటారు. శ్రీకర్ ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్తే బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా చేసేవాళ్లం కదా అని కమల్, అక్షయ్ అంటారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఒక అరగంటలోనే మనం హాల్లో డెకరేట్ చేసి శ్రీయ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్గా చేద్దామని అంటారు.. అప్పుడే శ్రీకర్ఇంటికి వస్తాడు. శ్రియకు బర్త్డే గిఫ్ట్ తీస్తే దాన్ని విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది.. శ్రీయా బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే శ్రీకర్ కూడా రూమ్ లోకి వెళ్తాడు.. శ్రీకరు శ్రియాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా వినదు అయితే అక్కడే ఉన్న నెక్లెస్ ను చూసి శ్రీకర్ పల్లవి దగ్గరికి తీసుకెచ్చి మొహాన విసిరి కొడతాడు. ఇక పల్లవి శ్రీయానే నెక్లెస్ తీసుకుందని చెప్పడంతో శ్రీకర్ కామ్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ మాత్రం అవని కోసం బాధపడుతూ ఉంటాడు ఆరాధ్య అవనికి ఫోన్ చేయమని అడుగుతుంది. ఆరాధ్య దయాకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది అవనికి ఇవ్వమని అడుగుతుంది. అవనితో అక్షయ్ ఫోన్ మాట్లాడుతాడు. ఆ తర్వాత అవని మాటలు విని అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఆరాధ్య అమ్మని ఎప్పుడు తీసుకొద్దాం నాన్న అని అడుగుతుంది ఇంకొద్ది రోజుల్లో తీసుకొద్దామని అంటాడు. ఆరాధ్యకు నాన్నను బాగా చూసుకోవాలమ్మా అని అవని చెప్తుంది. అలాగే అమ్మ నాన్న నేను చాలా బాగా చూసుకుంటున్నాను నువ్వు ఎప్పుడొస్తావ్ అమ్మ నువ్వు త్వరగా వస్తే మనందరం కలిసే ఉండొచ్చు కదా అని ఆరాధ్య అంటుంది.

రాజేంద్రప్రసాద్ ఇంట్లోని వాళ్లందరినీ పిలుస్తాడు. ప్రణతికి పెళ్లి సంబంధం మాట్లాడినట్లు అందరికీ చెప్తాడు. అయితే ఆ అబ్బాయి త్వరగా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతాడు. వాళ్ళ కుటుంబానికి పట్టింపులు ఎక్కువ. ఏదైనా పద్ధతిగా ఉండాలని అనుకుంటాడు అందుకే ఇంట్లో ప్రతిదీ అతనికి చెప్పాలని అనుకున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పట్టింపులు ఎక్కువ ఉన్నారు కదా నాన్న మరి అవని వదిన గురించి తెలిస్తే బాగోదేమో అనగానే రాజేంద్రప్రసాద్ అవనిని ఇంటికి పిలుద్దామని అనుకుంటున్నాను ఇలాంటి మంచి సంబంధం మళ్లీ మళ్లీ రాదు. అవి నేను పిలిచి పెళ్లి వరకు ఉంచితే బెటర్ అని నేను అనుకుంటున్నాను అని అనగానే అందరూ సంతోష పడతారు.


పార్వతి మాత్రం అవనిని ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు అని అనగానే రాజేంద్రప్రసాద్ నీకు నీ కూతురు పెళ్లి ముఖ్యమా నీ పట్టింపులు ముఖ్యమా కూతురు పెళ్లి కోసం ఆమాత్రం ఆలోచించవా అనేసి అనగానే మీరు ఏదైనా చెప్పండి నేను అవనిని ఇంటికి రావాలని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోను. నా మాట కాదని మీరు అవనిని ఇంటికి తీసుకురావద్దు అని పార్వతి అంటుంది. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఇది నా నిర్ణయం.. నా నిర్ణయాన్ని మార్చుకోను అవనిని పెళ్లికి ఇంటికి తీసుకొస్తానని తెగేసి చెప్పేస్తాడు.. ఇక పార్వతి నిర్ణయాన్ని రాజేంద్రప్రసాద్ కాదని లేక మౌనంగా ఉంటాడు.

ఆ తర్వాత ప్రణతి దగ్గరికి వెళ్లి మంచి పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి ఎలా ఉన్నాడు చూసి చెప్పు అని అడుగుతారు. లండన్ లో జాబ్ చేస్తున్నాడు మంచి అబ్బాయి మా అందరికీ నచ్చాడు మీ అభిప్రాయాన్ని చెప్తే వాళ్ళకి చెప్తామని ప్రణతితో అంటారు. ఇక ప్రణతి మీ ఇష్టమే నా ఇష్టం అనగానే ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు అటు అవన్నీ కూడా గుడికి వస్తుంది. ముందుగా వాళ్ల పేరు మీద అర్చన చేయండి అని పంతులతో చెప్తుంది అవని. మా అమ్మాయి ప్రణతి నిశ్చితార్థం రేపు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎవరి చూపు పడకుండా మంచిగా జరగాలని దేవుడి దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చామండి అలానే విఘ్నాలు కలగకుండా పూజ చేయండి అని పంతులు గారికి పార్వతి చెప్తుంది..

అది విన్న అవని ప్రణతి వైపు చూస్తుంది కానీ ప్రణతి మాత్రం అవని ఏదో తప్పు చేసినట్లు మొహం అలా తిప్పుకుంటుంది. అయితే అక్షయ్ మాత్రం అవని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ గుడిలో పూజ చేస్తూ ఉంటే అవని బయటకు వెళ్తుంది. అక్షయ్ కూడా అక్కడికి వస్తాడు. అవినీతో మాట్లాడుతుంటే అవని మాట్లాడడానికి ఇష్టపడదు. చూశారు కదండీ నేనెంత పరాయిదాన్ని అయిపోయాను. అక్కడ ప్రణతి పెళ్లి అన్న విషయం కూడా నాకు చెప్పడానికి అత్తయ్య ఇష్టపడడం లేదు ప్రణతి కూడా నా మొహం చూడడానికి ఇష్టపడటం లేదు నేను అక్కడి నుండి ఏం చేయాలి అని అవని వెళ్ళిపోతూ ఉంటుంది.

బయట పల్లవి అవనీని ఆపుతుంది. నిన్ను ప్రణతి పెళ్లికి రాకుండా చేస్తానని శపధం చేస్తుంది. నేను అసలు ఇంట్లోకి రానివ్వనని పల్లవి అవనితో అంటుంది దానికి అవని కింద ఉన్న మట్టిని తీసుకొని చేతులు దులుపుకొని పల్లవి చంప మీద ఒకటిస్తుంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసే రోజు వచ్చేసింది నువ్వు వెయిట్ చెయ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతకీ ఇంట్లో నువ్వు ఉంటావో నేనుంటాను చూడాలి అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×