Intinti Ramayanam Today Episode May 11th : పల్లవికి కమల్ చెప్పిన పని గురించి అడుగుతాడు.. భరత్ ని తిరిగి వాళ్ళ ఇంటికి పంపించకుండా ఉంటే కచ్చితంగా నీకు ఏం చేస్తానో అది చేస్తాను కదా మరి నువ్వు మీ అమ్మతో ఎందుకు మాట్లాడలేదు అని కమల్ అడుగుతాడు. నేనేమీ తప్పుగా అనలేదు కదా. మా అమ్మ నా మాట కూడా వినలేదు. ఎంత చెప్పినా సరే తన మాట తనదే అన్నట్లుగా ఉంది నేను ఏమి చేయలేను బావ అని కమలతో పల్లవి అంటుంది. ఆ మాట వినగానే కమల్ దీనికి తన తల్లి చేసే పనులలో వాటా ఉన్నట్లుంది. పల్లవి ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని కమల్ అనుకుంటాడు.. కమల్ కి తన మీద డౌట్ వచ్చిందని పల్లవి అనుకుంటుంది.
పల్లవి నిజంగానే వాళ్ళమ్మని రెచ్చగొట్టేలా మాట్లాడి ఇంట్లో సమస్యలు తెచ్చిపెడుతుంది అని కమల్ కి అనుమానం వస్తుంది.. అయితే కమల్ మీ అమ్మని కంట్రోల్ ఉండకపోతే నిన్ను ఏదైనా చేస్తాను అని అంటాడు.. ఎంత బెదిరించినా సరే పల్లవి మాత్రం మా అమ్మకు నాకు ఏ సంబంధం లేదు బావ అవన్నీ మా అమ్మ నిర్ణయాలే అని అంటుంది.. నన్నెందుకు బావ ప్రతిసారి నువ్వు అనుమానిస్తావు ఏం జరిగినా నాదే తప్పు అంటావ్ ఏంటి అని పల్లవి తన మీద అనుమానం రాకుండా చేసుకుంటుంది.. కానీ కమల్ మాత్రం పల్లవి ఇలా అంటుంది అంటే కచ్చితంగా ఏదో చేసే ఉంటుంది అని అనుమానం అయితే వస్తుంది..
ఉదయం లేవగానే పల్లవి ఊడవడానికి అని బయటికి వస్తుంది.. అయితే మీనాక్షి అక్కడ బాధపడుతూ కూర్చోవడం చూసిన పల్లవి బిల్లు మా ఇంట్లో కొంచెం కూర్చున్నారు అన్నట్లుగా ఒక విధంగా మొహం వాడ్చుకుంటూ వెళ్లిపోతుంది.. అయితే మీనాక్షి పల్లవి ఊడ్చేదానికి ఆ దుమ్ము ముఖంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా దగ్గుతో బాధపడుతూ ఉంటుంది.. కమల్ పల్లవి నీళ్ళు తీసుకురమ్మని చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా ఉంటుంది.. లోపలి నుంచి పరిగెత్తుకుంటూ నీళ్లు తీసుకొచ్చిన అవని ఆ గ్లాస్ ని మళ్లీ లోపలికి తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది.. ఇప్పుడు నీకు బాగానే ఉంది కదమ్మా ఏమి సమస్య లేదు కదా అనేసి పల్లవి ముందరే అవని అడుగుతుంది.. ఆ గ్లాస్ నీ లోపల పెట్టేందుకు వెళుతూ ఉండగా పల్లవి అక్కడికి వచ్చి దాన్ని పగలగొట్టేస్తుంది..
ఆ గ్లాస్ ఎక్కడ తీసుకొని వెళ్తున్నావ్? మీ అమ్మ రోగిష్టి దానిలాగా అక్కడ తగ్గుతూ ఉంటే ఆ గ్లాసు నువ్వు మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తే.. దాంతో ఎవరైనా తాగితే వాళ్లకి కూడా రోగం అంటుకుంటుంది అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది.. అందుకే ఆ గ్లాస్ ని పగలగొట్టాను అని చెప్పగానే అవని మా అమ్మని రోగిష్టి అని అంటావా అని పల్లవి చంప పగలగొడుతుంది. ఏంటి వదిన ఒక్కదానితోనే ఆపేసావు ఇంకా రెండు మూడు కొట్టాలి కదా అని కమల్ ఇంకాస్త ఎంకరేజ్ చేస్తాడు.. ఒక మనిషికి బాగోలేనప్పుడు ఎలా చూసుకోవాలో అర్థం కాదా నీకు.. నీ కన్నతల్లి స్థానంలో ఇలానే ఎవరైనా ఉంటే నువ్వు ఇలానే అంటావని అవని పల్లవికి బుద్ధి వచ్చేలా క్లాస్ పీకుతుంది.. చక్రధర్ వీళ్లిద్దరు ఏ రోజుకైనా తల్లి కూతుర్ లాగా కలిసి ఉండాలి నాకు మాత్రం పల్లవిని చూస్తుంటే భయమేస్తుంది అని అంటాడు.
ఆఫీస్ కి రెడీ అవుతున్న భరత్ దగ్గరికి వెళ్లిన ప్రణతి.. మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదట డాక్టర్ని తీసుకొచ్చి మరీ చూపించారట.. ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోదాం పద అని ప్రణతి భరత్ ని అడుగుతుంది.. నాకు నా ఇంటికి వెళ్లాలని లేదు మరి నీకెందుకు అనిపిస్తుంది అని భరత్ అంటాడు.. నాకు నా కన్న తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు మరి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని భరత్ అన్న మాటలు విని ప్రణతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్థమవుతుందా భరత్ మీ అమ్మకు బాగోలేదు అంటున్న సరే నువ్వు వెళ్లడానికి ఇష్టపడడం లేదు ఏంటి అని భరత్ తో గొడవకు దిగుతుంది ప్రణతి.. అది చూసినా రాజేశ్వరి ప్రణతిని అనద్దు భార్యని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడొద్దు అని అంటుంది ఆ మాటతో ప్రణతి ప్లాన్ రివర్స్ అవుతుంది..
పల్లవి గురించి తెలుసుకున్న కమల్ఎలాగైనా సరే దీనికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అయితే ఎంత చెప్పినా సరే పల్లవి వినకుండా ఉండడంతో కమల్ అత్తయ్యని రోగిష్టిది అని అంటుంది కదా దీని మొహం కూడా అలాగే తయారు చేయాలి అని అనుకుంటాడు.. వదిన కోసం నేను కాస్ట్లీ క్రీమును తీసుకొని వచ్చాను దీని ఖరీదు దాదాపు 1,50,000 ఒక పైనే ఉంటుంది.. ఇది మా వదినకి మాత్రమే గిఫ్ట్ ఇస్తాను నువ్వు ఎట్టి పరిస్థితిలో దీన్ని తగలవద్దు అని పదే పదే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంత డబ్బులు పెట్టింది ఆ అవినీకెందుకు దక్కని ఇస్తాను దాన్ని ముందు నేను ట్రై చేస్తాను అని అనుకుంటుంది. అయితే పల్లవి ముఖానికి ఆ క్రీమును రాసుకుందో లేదో ఒక్కసారిగా మంట రావడంతో కేకలు పెడుతుంది.. కమల్ దీనికి తిక్క కుదిరింది అని సంతోషంగా ఉంటాడు..
అక్షయ్ ఆఫీస్ కి బయలుదేరుతామని అనుకుంటాడు.. అప్పుడే వీళ్ళకి గతంలో డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్అ క్కడికి వస్తాడు. మీకు డబ్బులు ఇవ్వాల్సిన గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. మీరు డబ్బులు కట్టకపోతే మేము పోలీస్ కేసు ఇవ్వాల్సి వస్తుంది అని అతను అంటాడు.. ఇక్కడే ఉన్నా చక్రధర్ హామీ నేను ఇచ్చాను కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. మీకేం తమాషాగా ఉందా నేను చూసుకుంటాను కదా మీరు దయచేసి విషయం గురించి మర్చిపోండి అని ఎంత చెప్తున్నా సరే మీ దగ్గర డబ్బులు లేవు మీ మీద కూడా మేము పోలీస్ కేసు పెడతామని ఆ ఫైనాన్షియర్అం టాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..