E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. భరత్, ప్రణతిల మధ్య చిచ్చు.. పల్లవికి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. భరత్, ప్రణతిల మధ్య చిచ్చు.. పల్లవికి మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 14th : చక్రధర్ ఫైనాన్సర్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఎలాగైనా సరే తన కూతురు అల్లుడ్ని ఈ సమస్య నుంచి బయట పడేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. డబ్బుల కోసం అక్షయవని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య తాతయ్య నాకు నిద్ర రావడం లేదు ఏదైనా ఒక కథ చెప్పండి అని అడుగుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన అవని అలాగే పల్లవిలను చూసి నీకు ఒక కథ చెప్తాను. అది ఒక అక్క చెల్లెల కథ అని అవని పల్లవిల స్టోరీని ఆరాధ్యకు చెప్తాడు.. పల్లవి గురించి చెప్పడంతో తను కోపంగా ఉంటుంది. చక్రధర్ చెప్పిన స్టోరీ తన గురించి అని తెలుసుకున్న పల్లవి ఈ జన్మలో అవనితో కలవడం కుదరదు అని అనుకుంటుంది..

గుడ్ న్యూస్ చెప్పిన అక్షయ్..

అవని పార్వతి అలాగే కమల్ ముగ్గురు కూడా పూజ చేస్తారు. ఇంట్లో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు మనో ధైర్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ అవని దేవుడిని ప్రార్థిస్తుంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కించే బాధ్యత కూడా నీదే అని దేవుడికి దండం పెట్టుకొని బయటకు వస్తుంది. అక్షయ్ అవని నీ పిలవడంతో ఏమైందండీ అని అడుగుతుంది.. ఏం కాలేదు అవని ఇవాళ నేను ఒక ప్రైవేటు బ్యాంకు కి వెళ్తున్నాను అక్కడ వాళ్ళు లోన్ ఇస్తే బాగుండు అని అక్షయ్ చెప్పగానే చాలా మంచి వార్త చెప్పారండి.. కచ్చితంగా మీకు ఈ లోన్ వస్తుంది అని అవని అంటుంది.. అవున్రా అవన్నీ చేసిన పూజ ఫలించింది అప్పుడే నువ్వు ఈ న్యూస్ చెప్పావు అని పార్వతి అంటుంది. ఇక అక్షయ్ లోన్ కోసం బయటికి వెళ్లిపోతాడు..

లోన్ రాదు అని పల్లవి కౌంటర్..

Advertisement

అమ్మ అవని నాకు ఒక కాఫీ తీసుకొని వస్తావా అని పార్వతి చెప్పగానే అవని సరే అత్తయ్య అని లోపలికి వెళ్తుంది.. అక్షయ్ లోను గురించి చెప్పగానే పల్లవి నిజంగానే లోన్ వస్తుందా అని ఆలోచిస్తుంది. ఇక తర్వాత పల్లవి వంటగదిలోకి వెళ్ళిన అవని దగ్గరికి వస్తుంది.. లోన్ కోసం ఆ బ్యాంకు కి వెళ్తున్నాడు అంతే వస్తుంది అని చెప్పలేం కదా అని పల్లవి అంటుంది. రాకూడదు అని బలంగా కోరుకుంటున్నటున్నావ్ కదా అని అవని పల్లవితో అంటుంది. అయినా నువ్వు ప్రతిదానికి ఇలా నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించు సమస్యలు వాటి అంతటి అవే బయటపడతాయి అని అవని అంటుంది. నువ్వు ఎంతగా కోరుకుంటున్న సరే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సమస్యను పరిష్కరించే అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను అని పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది అవని.

భరత్, ప్రణతి ల మధ్య చిచ్చు..

భరత్ నీ ప్రణతి మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదామని ఎంతగా అడుగుతున్నా సరే అసలు వినడు భరత్. ఇకనుంచి వెళ్లే ప్రసక్తే లేదు అని భరత్ ప్రగతితో చెప్తాడు. రాజేశ్వరి దగ్గరికి వెళ్లిన ప్రణతి మా ఇంటికి వెళ్లేలా భరత్ నీకు కన్విస్ట్ చేస్తానని చెప్పావు కదా మరి ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు చెప్పు అని అంటుంది. అలాగే అమ్మ చెప్తాను అని రాజేశ్వరి అంటుంది. ఇంకా భరత్ నీ టిఫిన్ కి పిలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేసి ప్రణతిని వెళ్లిపోయేలా చేస్తే భరత్ నా దగ్గరే ఉంటాడు కదా అని రాజేశ్వరి ఆలోచిస్తుంది. టిఫిన్ చేస్తుండగా కావాలనే సాంబార్ తన మీద పడేలా చేసుకుంటుంది. భరత్ ప్రణతిని తిట్టేలా పక్కా ప్లాన్ ప్రకారం రాజేశ్వరి చేస్తుంది. మీ అమ్మగారికి హెల్త్ బాగోలేదని విన్నాను ఒక్కసారి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది అని రాజేశ్వరి ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెప్తాడు. ప్రణతి భరతుల మధ్య రాజేశ్వరి చిచ్చు రాజేసి వెళ్తుంది..

పల్లవికి చుక్కలు చూపించిన కమల్..

Advertisement

చక్రధర్ ఆలోచిస్తూ ఉండగా కమల్ దేని గురించి మావయ్య అంతగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు. ఫైనాన్షియర్ అడిగిన డబ్బులు గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎంతోమంది దగ్గర నేను ఎప్పుడు అడగలేదు కానీ అక్షయ కోసం అడుగుతున్నాను. ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు.. ఇదంతా రాజేశ్వరి కావాలని చేసిన ప్లాను అని అన్నగా పల్లవి ఎక్కడికొచ్చి మా మామ్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు కదా మీ వల్లే ఇలా తయారైంది అని అంటుంది. పల్లవికి ఎలాగైనా సరే చుక్కలు చూపించాలని బయటికి తీసుకువెళ్లిన కమల్ ఎండలో తన చేత బైక్ ని తోపిస్తాడు. పల్లవి బండిని తోస్తూ ఎండలో అవస్థలు పడుతుంది. నువ్వు తొందరగా తొయ్ కుంటే మనం ఇక్కడే ఉంటాము నీ హీరోయిన్ లాంటి ఫేసు మాడిపోతుంది అని కమల్ అంటాడు. ఇక లోన్ కోసం వెళ్ళినా చేయి లోన్ రాలేదని దిగాలుగా ఇంటికి వస్తాడు. అది గమనించిన అవని పర్లేదులేండి ఇంకొకటి ట్రై చేద్దామని సపోర్ట్ గా నిలుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై నర్మదకు అనుమానం.. ధీరజ్ పై సాగర్ సీరియస్.. భాగ్యం మాస్టర్ ప్లాన్..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×