E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి తిక్కకుదిరింది.. అవని ఫుల్ హ్యాపీ.. భరత్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి తిక్కకుదిరింది.. అవని ఫుల్ హ్యాపీ.. భరత్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 15th : చక్రధర్ ఆలోచిస్తూ ఉండగా కమల్ దేని గురించి మావయ్య అంతగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు. ఫైనాన్షియర్ అడిగిన డబ్బులు గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎంతోమంది దగ్గర నేను ఎప్పుడు అడగలేదు కానీ అక్షయ కోసం అడుగుతున్నాను. ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు.. ఇదంతా రాజేశ్వరి కావాలని చేసిన ప్లాను అని అన్నగా పల్లవి ఎక్కడికొచ్చి మా మామ్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు కదా మీ వల్లే ఇలా తయారైంది అని అంటుంది. పల్లవికి ఎలాగైనా సరే చుక్కలు చూపించాలని బయటికి తీసుకువెళ్లిన కమల్ ఎండలో తన చేత బైక్ ని తోపిస్తాడు. పల్లవి బండిని తోస్తూ ఎండలో అవస్థలు పడుతుంది. నువ్వు తొందరగా తొయ్ కుంటే మనం ఇక్కడే ఉంటాము నీ హీరోయిన్ లాంటి ఫేసు మాడిపోతుంది అని కమల్ అంటాడు. ఇక లోన్ కోసం వెళ్ళినా చేయి లోన్ రాలేదని దిగాలుగా ఇంటికి వస్తాడు. అది గమనించిన అవని పర్లేదులేండి ఇంకొకటి ట్రై చేద్దామని సపోర్ట్ గా నిలుస్తుంది..

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

పల్లవి ఇంటికి రాగానే నొప్పులు పడుతూ కనిపిస్తుంది. అసలు ఇంత ఇబ్బందులు పడతామని తెలిస్తే బయటికి వెళ్లే దాన్నే కాదు అని పల్లవి బాధ పడిపోతూ ఉంటుంది. నా జాయింట్లు జారిపోయినయి అయ్యో రామా అంటూ పల్లవి తెగ బాధ పడిపోతూ ఉంటుంది. దీనికి ఒళ్ళు నొప్పులు మాత్రమే కాదు మెంటల్ గా టెన్షన్ పెట్టాలి అని అనుకుంటాడు.. అర కిలోమీటర్ కూడా తోయలేదు నువ్వెందుకు ఇంతగా బాధ పడిపోతున్నావు అని కమలంటాడు. బండిమీద కూర్చుని నువ్వు దర్జాగా వచ్చావు తోసింది నేను కదా అని బాధపడిపోతుంది పల్లవి. అయితే నేను మెకానిక్ కి ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా అందుకే నొప్పులు తగ్గావు కదా అని కమల్ చెప్పగానే ఇప్పుడు ఆ మాట చెప్పేదేమీ పల్లవి తెగ ఫీల్ అయిపోతుంది.. ఇక భానుమతి కాపడం పెట్టాలి అని వేడి నీళ్లు తెచ్చి పల్లవికి పెడుతుంది.. దాంతో పల్లవి కెవ్వుమని అంటుంది.

శ్రీకర్ కు శ్రీయా వార్నింగ్..

Advertisement

శ్రియ డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి తనతో ఎక్సర్సైజులు చేపిస్తే డెలివరీ ఈజీగా అవుతుంది అని శ్రీకర్ తన చేత కష్టమైన సరే ఎక్సైజ్ లను చేపిస్తుంటాడు. శ్రేయ మాత్రం నావల్ల కావట్లేదని ఎంత చెప్తున్నా సరే శ్రీకర్ మాత్రం ఇలా అయితేనే నీకు డెలివరీ ఈజీగా అవుతుంది. లేదంటే కాంప్లికేషన్స్ ఉంటాయి అని తనతో బలవంతంగా చేపిస్తాడు. అప్పుడే ఇంటికి కమల్ రావడం చూసి శ్రీయ ఏమై ఉంటుంది అని అనుకుంటుంది. కమల్ కి ఒక కాఫీ తెచ్చి ఇవ్వు అని శ్రీకర్ అడుగుతాడు.. కానీ శ్రియ మాత్రం నాకు అంత ఓపిక లేదు మీరే పెట్టివ్వండి అని అంటుంది. 50 లక్షల డబ్బుల కోసం అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు కూడా ట్రై చెయ్ అన్నయ అని చెప్పగానే సరే అని శ్రీకర్ అంటాడు. నీ తాహతుకు మించి నువ్వు ఏది చేయాలని అనుకోకు అని శ్రేయ శ్రీకర్ కి వార్నింగ్ ఇస్తుంది.

ప్రణతి, భరత్ లను విడగొడుతున్న రాజేశ్వరి.

భరత్ ఫైల్స్ మీద సంతకాల కోసం ఇంటికి వస్తాడు. రాజేశ్వరి అన్ని ఫైల్స్ మీద సంతకాలు చేస్తుంది. ఒకసారి చెక్ చేసి చేయండి అమ్మ అని భరత్ ఎంత చెప్తున్నా సరే తను మాత్రం నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వేమీ బాధపడకు అని అంటుంది. నువ్వు నా నమ్మకానివి కాబట్టే నేను మళ్లీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ప్రణతి భరత్ లు ఎక్కడికైనా హనీమూన్ కి వెళ్ళారా అని అడుగుతుంది. ఇప్పుడు అవసరం రాలేదమ్మా అని భరత్ అనగానే అలా ఏంటి మీరు కొత్తగా పెళ్లయిన వాళ్లు కదా మీరు హనీమూన్ కి వెళ్ళే ఏర్పాట్లు నేను చేస్తాను అని రాజేశ్వరి అంటుంది. భరత్ ఆఫీస్ లో ఎక్కువ పని ఉందమ్మా ఇప్పుడు కుదరదు అని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం హనీమూన్ కి ప్లాన్ చేస్తుంది. ప్రణతి నాకు ఇష్టం లేదని చెప్పగానే భరత్ ప్రణతి పై సీరియస్ అవుతాడు. రాజేశ్వరి ప్లాన్ ప్రకారం విడగొట్టే ప్రయత్నం చేస్తుంది.

అవనికి రమ్య సాయం..

Advertisement

అవని తన ఫ్రెండు రమ్య దగ్గరికి వెళ్లి ఎలాగైనా సరే డబ్బులు అడగాలని అనుకుంటుంది. మొదటిసారి తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లిన అవని తన ప్రాబ్లం గురించి చెబితే ఏమనుకుంటుందో అని ముందు బాధపడుతుంది. చివరికి రమ్యకు తనకు 50 లక్షలు కావాలన్న విషయాన్ని చెప్తుంది. ఇక రమ్య ఏమి మాట్లాడకుండా అవనికి 50 లక్షలు తెచ్చి ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో రమ్య చేసిన సాయం చాలా పెద్దది అంటూ అవని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఈ డబ్బులను వీలైనంత త్వరగా నీకు తిరిగి ఇస్తాను అని అవని చెప్పి డబ్బులు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళుతుంది..

అక్షయ్ హ్యాపీ.. పల్లవికి షాక్..

అవని ఆ డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి అక్షయ్ ని పిలుస్తుంది. ఇదిగోండి 50 లక్షలు అని ఆ బ్యాగ్ ని అక్షయ్కిస్తుంది. ఈ డబ్బులను తీసుకొని వెళ్లి ఆ ఫైనాన్సియర్ కు కట్టండి.. మనం ఈ సమస్య నుంచి బయటపడినట్లే అని అవని అనగానే ఆ బ్యాగ్ లో ఏముంది అని చెక్ చేసిన అక్షయ్ డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంత డబ్బులు ఎలా వచ్చాయని పల్లవి కూడా షాక్ అవుతుంది. అయితే ఈ డబ్బులు ఎలా వచ్చాయని అడుగుతాడు అక్షయ్. నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానండి మీరు ఏమి ఆలోచించకుండా వెళ్లి ఆ డబ్బులని కట్టండి అని అవని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి ఆ డబ్బులు అనే కొట్టేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కొత్త కారు కొన్న ధీరజ్.. ఫీల్ అవుతున్న ప్రేమ..విశ్వం రీ ఎంట్రీ అదుర్స్..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×