E-Paper
Advertisement

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ, ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ,  ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం
Advertisement

Strait of Hormuz: ఒమన్ తీరం సమీపంలో డ్రోన్ దాడిలో భారత్ సరుకు రవాణా నౌకపై డ్రోన్లతో దాడి జరిగింది. ఆ తర్వాత ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలియగానే ఈ దాడిని కేంద్రప్రభుత్వం ఖండించింది. వాణిజ్య నౌకలపై ఈ విధంగా దాడి కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది?

ఒమన్‌లో భారత్ నౌకపై డ్రోన్లతో దాడి.. మునిగిన హాజీ అలీ

Advertisement

సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు సరుకుతో వెళ్తోంది భారత్ నౌక. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడితో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది సముద్రంలో మునిగిపోయింది. ఘటన తర్వాత స్పందించిన ఒమన్ తీరం అధికారులు, నౌకలోని 14 మంది సిబ్బందిని రక్షించారు. వారిని సమీపంలోని దిబ్బా పోర్టుకు తరలించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. స్వేచ్ఛా నౌకా వాణిజ్యానికి ఆటంకం కలిగించవద్దని పేర్కొంది. ఆ నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. వారిని భారత్‌కు రప్పించేందుకు ఒమన్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని షిప్పింగ్ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

సిబ్బంది సేఫ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్-అమెరికా ఘర్షణకు సంబంధించి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన సముద్ర భద్రతపై మరింత ఆందోళనలను పెంచింది. మునిగిపోయిన నౌక గుజరాత్‌లోని ద్వారకా జిల్లా సలయా పోర్టులో రిజిస్టర్ అయ్యింది. నౌకపై దాడి ఎవరు చేశారనేది వెంటనే ఇంకా తెలియాల్సివుంది. వారం రోజుల వ్యవధిలో గుజరాత్‌కు చెందిన హాజీ అలీ మునిగిపోవడం ఇది రెండో సంఘటన.

అంతకుముందు సలయాకు చెందిన అల్ ఫైజ్ నూర్ సులేమానీ-1 నౌక హోర్ముజ్ జలసంధిలో మునిగిపోయినట్లు సమాచారం.ఈ రెండు సంఘటనలు గుజరాత్ సముద్ర రంగంలో ఓడల నిర్వాహకులు, వ్యాపారులలో ఆందోళనను రేకెత్తించాయి. చాలామంది వ్యాపారులు సరుకు రవాణా కోసం గల్ఫ్ మార్గాలపై ఆధారపడి ఉన్నారు.

ALSO READ: ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం.. అసలు గుట్టు బయటకు, ఆ నటి మాటేంటి?

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×