Intinti Ramayanam Today Episode October 16th: తల్లి కోసం ఆరాధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే.. అమ్మని నేను చూడాలి అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే తల్లి కోసం బాధపడుతూ ఉండటం చూసి అందరూ బాధపడతారు. కమల్ ఇంటికి రావడంతో ఏంటి బాబాయ్ నువ్వు ఒక్కడివే వచ్చావో అమ్మ ఎందుకు రాలేదు అని బాధపడిపోతుంది. ఆరాధ్య తల్లి కోసం పడే బాధని అందరూ అర్థం చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మని చూడాలి నేను అమ్మతో మాట్లాడాలి అని ఆరాధ్య అంటూ ఉండగా అప్పుడే వచ్చిన అక్షయ్ కూడా అమ్మ వస్తుంది అమ్మ రెండు రోజుల్లో అని ఎంత చెప్తున్నా సరే ఆరాధ్య మాత్రం అసలు వినదు. శ్రియ ఏదో ఒక మాటలు చెప్పి ఆరాధ్యకు భోజనం పెడుతుంది.
భరత్ కమల్ ఇంట్లో వచ్చి అంతర్ రచ్చ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు.. ఒక్క మాట చెప్పి ఉంటే నేను బావని వచ్చి కొట్టేవాడిని కదా బావకి సరైన బుద్ధి చెప్పే వాడిని కదా అని పల్లవి తో మాట్లాడుతూ ఉండగా.. అప్పుడే ఇంట్లోకి వచ్చినా చక్రధర్ ఏం చెప్తావ్ నువ్వు.. నువ్వు ఒక మనిషివేనా అక్కడ ఉన్నది మన ఇంటి మనుషులేని గుర్తించకుండా పల్లవితో కలిసి వెళ్లి కేసు పెట్టాలని అనుకున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని చక్రధర్ భరత్ ని చంపలు పగలగొట్టేస్తాడు. మీనాక్షి కూడా భరత్ ని కొట్టడంతో ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నేను వెళ్ళిపోతాను అని భరత్ అంటాడు. చక్రధర్ భరత్ ని కొట్టి నా సంగతి నీకు తెలియదు. నేను తలుచుకుంటే మాత్రం నీ పని అంతే అనవసరంగా ఎక్స్ట్రాలు చేయకూడదు లోపలికి వెళ్ళు అని వార్నింగ్ ఇస్తాడు.
ఆరాధ్య అవని కోసం బాధపడిపోతూ కలవరిస్తూ ఉంటుంది. నాకు అమ్మ కావాలి అమ్మతో నేను మాట్లాడాలి అంటూ ఆరాధ్య కలవరిస్తూ ఉంటుంది. అది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. అవని అక్కకి బాగా జ్వరంగా ఉంది వాళ్ళు భోజనం కూడా పెట్టలేదు కదా మనం వెళ్లి పెడదామని శ్రియ అంటుంది. అయితే ఆ ఎస్ ఐ ఒక పెద్ద శాడిస్ట్ దాని దగ్గరికి వెళ్తే మనల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి మనం ఇదే లేనిపోని కేసులు పెట్టి లోపల వేస్తుంది అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక చివరికి శ్రేయ ఆడవాళ్లే కదండి నేను కూడా వెళ్లి అడుగుతాను. కనికరిస్తే అక్కకి అన్నం పెట్టేసి వస్తాను అని అనగానే శ్రీకర్ నిన్ను కూడా రానివ్వదు అదొక సైకో మొహం ది అంటూ ఎస్ఐ ప్రవర్తనపై అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు మరి అవనికి జ్వరంగా ఉంది కదా ఏం చేయాలి అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.
పల్లవి దగ్గరికి మీనాక్షి వెళ్తుంది. పల్లవి ఫోన్ మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపిస్తుంది అప్పుడు మీనాక్షి బాధపడిపోతూ అక్కడికి వెళ్తుంది.. అమ్మ పల్లవి అవనికి అస్సలు బాగోలేదు. నువ్వు ఏదో ఒకటి చేయాలి అని మీనాక్షి అంటుంది.. అవని కి జ్వరంగా ఉంది తనని బయటకు తీసుకొచ్చేందుకు నువ్వు సహాయం చేయాలి అని ఎంత చెప్పినా సరే మీనాక్షి మాట వినకుండా పల్లవి మాటకు మాట సమాధానం చెబుతుంది. అవని నా జీవితాన్ని నాశనం ఎలా చేసింది? అలాంటి అవన్నీ నేను ఎందుకు క్షమిస్తాను అని పల్లవి అంటుంది. రెండు రోజులు మనకి బెయిల్ రాదమ్మా అలానే ఉంటే అవని ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటే నేను ఏమి చేయను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని పల్లవి అనగానే మీనాక్షి బాధ పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
పార్వతి ఇంట్లోని వాళ్ళందరూ కూడా అవనీ లేదు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. అవని అక్క ఉంటే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది ఇల్లంతా కలకలలాడేది ఉదయం లేవగానే పూజ గదిలో దీపం వెలిగేది. అవని ఎప్పుడూ ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకునేది అంటూ ఇంట్లోని వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు. అవని త్వరగా ఇంటికి వస్తే బాగుంటుంది అంటూ అందరూ కోరుకుంటారు. అయితే అందరూ పూజ చేయడానికి భానుమతి పల్లవి ఎలా ఉందో ఏంటో అని వీళ్ళకి ఎవరికీ లేదు పల్లవిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేదామని ఆలోచించారు అని మనసులో అనుకుంటూ అవని నేను తిట్టుకుంటూ ఉంటుంది.
పల్లవి ఏదో పంపించింది అని ఆ ఫోన్ ని చూస్తుంది. అవనిని ఆర్ సి ఐ కొట్టిన వీడియోని పంపించడంతో అది చూసిన పల్లవి సంతోషంతో డాన్స్ చేయాలని అనుకుంటుంది అయితే పెద్దగా సౌండ్ పెట్టి టీవీలో సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగా చక్రధర్ అలాగే మీనాక్షి అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంతగా డాన్స్ చేస్తున్నావు. నిన్ను నీ వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశారు అని తెలుసు కదా.. అయితే నువ్వు కొంచెం కూడా బాధపడకుండా ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని పల్లవి కి చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక మీనాక్షి అసలు పల్లవి ఎందుకింత సంతోషంగా ఉంది అని బాధపడిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవనిని కొట్టిన విషయం తెలుస్తుందా లేదా అన్నది చూడాలి..