America: అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా టీనేజర్లు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాఠశాలలోని ఓ టీనేజర్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ఓ టీచర్ మృత్యువాత పడ్డారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని దారుణమైన ఘటన జరిగింది. బెండ్ సిటీలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూలులో 16 ఏళ్ల టీనేజ్ బాలుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు.నిందితుడు పాఠశాలలోకి ప్రవేశించడాన్ని గమనించిన స్థానికులు, అతడ్ని పాఠశాలలోకి వెంబడించి కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది.
స్థానిక కాలమానం ప్రకారం.. ఒరెగాన్లోని బెండ్లోవున్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ పాఠశాలలో మధ్యాహ్నం 12.59 గంటలకు కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం వచ్చింది. నిమిషాల వ్యవధిలో పోలీసులకు పదేపదే ఫోన్లు రావడం కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులు స్పందించినట్టు బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి షీలా మిల్లర్ వెల్లడించారు. పోలీసులు పాఠశాలకు వచ్చేసరికి నిందితుడు గాయాలతో మృతి చెందాడు.
ఈ ఘటన నేపథ్యంలో పలు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎఫ్బీఐ సాయంతో దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ 16 ఏళ్ల టీనేజ్ నిందితుడు ఎవడు? ఏకంగా పాఠశాలలోకి వచ్చి కాల్పులు జరపడానికి కారణమేంటి? స్కూలుతో ఏమైనా సంబంధం ఉందా? అక్కడ గతంలో చదివాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాటల్లో చెప్పలేని విషాదమని పాఠశాల సూపరింటెండెంట్ స్టీవెన్ కుక్ ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ: హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?
గురువారం మధ్యాహ్నం ఓ టీనేజర్ గన్తో పాఠశాలలోకి ప్రవేశించాడు. తలుపులకు తాళం వేసి ఉన్న డోర్లపై కాల్చులు జరుపుతూ స్కూలులోకి చొరబడ్డాడు. ఈ కాల్పుల్లో 5 నుంచి 11 ఏళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులు, టీచర్ అక్కడికక్కడే మరణించారు. మరొక టీచర్, విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు సమీపంలోని మెడికల్ సెంటర్కు తరలించారు. వారికి అక్కడ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
#Breaking
🚨Police respond to reports of an active shooter at Silver Rail Elementary School in #Bend, #Oregon▪️A large police presence has gathered in the area. Residents are asked to avoid the area. The school has been placed on lockdown due to this incident.
▪️Few details…— ⚡️🌎 Sarwar 🌐⚡️ (@ferozwala) October 15, 2026