E-Paper
Advertisement

Intinti Ramayanam Trp Rating: ‘ఇంటింటి రామాయణం ‘ టీఆర్పీ రేటింగ్.. జనవరి నెల హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam Trp Rating: ‘ఇంటింటి రామాయణం ‘ టీఆర్పీ రేటింగ్.. జనవరి నెల హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam Trp Rating: తెలుగు ఆడియన్స్ ను ఎక్కువగా బుల్లితెర సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా అలరిస్తూ వస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీతో వస్తున్న సీరియల్స్ కావడంతో ఒకదాన్ని మించి మరొకటి స్టోరీతో వస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్ని కూడా ఆడియన్స్ ను మంత్ర ముగ్దల్ని చేస్తున్నాయి. కుటుంబ విలువలను తెలిపేలా కొన్ని సీరియల్స్ జనాలను బాగా కదిలిస్తున్నాయి. వాటిలో ఇంటింటి రామాయణం ఒకటి.. కుటుంబంలో ఆస్తి తగాదాలు వస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఈ సీరియల్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు.. ఈ సీరియల్ కథనాలతో పోలిస్తే ఈనెల మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ వస్తుంది. మరి జనవరి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం..

జనవరి నెలలో హైలెట్ ఎపిసోడ్స్…

ఇంటింటి రామాయణం సీరియల్ టైటిల్ కి తగ్గట్లే డిఫరెంట్ గా ఉంటుంది. డిసెంబర్ నెలలో ఆస్తి గొడవలు ఎక్కువగా ఈ సీరియల్ లో కనిపించాయి. జనవరి నెలలో కూడా ఆస్తి కోసం ఇద్దరు కోడలు చేసే రచ్చ అంత ఇంత కాదు. తమ ఆస్తులు చక్రధర్ అరెస్టు అయిన తర్వాత వచ్చాయని అందరు సంతోషంగా ఉంటారు. కానీ పల్లవి మాత్రం మా డాడీని అరెస్ట్ చేస్తారని అక్షయ్ కక్ష పెంచుకుంటుంది. శ్రీయ మాత్రం ఆస్తిస్తే మేము వెళ్ళిపోతాము అన్నట్లుగా అందరితో గొడవకు దిగుతుంది రోజురోజుకీ ఇంట్లో ఆస్తి పంపకాల గురించి గొడవలు జరుగుతున్నాయని రాజుగా ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. డబ్బు విలువ మనుషులు విలువ తెలియాలంటే తాను పుట్టి పెరిగిన ఊరికి తీసుకెళ్లాలని అనుకుంటాడు తన కుటుంబంతో కలిసి తన సొంత ఊరికి రాజేంద్రప్రసాద్ వెళ్తాడు. అక్కడ మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో అన్నది తెలుసుకునేలా చేస్తాడు. తమ ఆస్తిని కా చేసిన ఏకలింగంతో పల్లవి డీల్ ఫిక్స్ చేసుకుంటుంది సపోర్ట్ చేస్తూ పల్లవి ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ ఉంటుంది.. ఏకలింగంతో కలిసి అతనిని దెబ్బ కొట్టాలని అనుకుంటుంది. ఆ ఊర్లో ఉన్న ఆస్తులు తన సొంతం చేసుకోవడానికి రాజేంద్రప్రసాద్ కుటుంబానికి ఎటువంటి సాయం చెయ్యరాదు అని ఆ వూరు జనాలకు వార్నింగ్ ఇస్తాడు. అయితే ఏక లింగం చేసిన మోసాలు అనే బయట పెట్టేందుకు రాజేంద్రప్రసాద్ కుటుంబం చాలా కష్టపడుతుంది చివరికి ఆ దుర్మార్గుడి బండారం నిజస్వరూపాన్ని బయటపెడుతుంది ఆ ఊరిలో వాళ్ళు కట్టించిన స్కూలు హాస్పిటల్ ను మళ్లీ తిరిగి ప్రారంభిస్తారు. అయితే స్కూల్ పిల్లలకు భోజనం పెట్టాలని అనుకుంటారు అదే అక్షయ్ కి శాపంగా మారుతుంది. పల్లవి ఏకలింగం కలిసి పిల్లల కోసం చేసిన భోజనాల్లో పాయిజన్ కలుపుతారు. ఆ తర్వాత పిల్లలు స్పృహ తప్పి పడిపోవడంతో అక్షయ్ సంపాలనుకున్నాడు అని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీసాలు తెలుసుకుని పోలీసులు అక్షయ్ ని విడుదల చేస్తారు. శ్రీయ తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతుంది. రాజేంద్రప్రసాద్ సొంత ఊర్లో సంక్రాంతి సంబరాలను పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్కు వస్తారు. శ్రీయ కు సేవలు చేస్తున్నారని పల్లవి తెగ ఫీల్ అయిపోతుంది. తాను కూడా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుంది. ఇక అక్షయ్ తప్పక చక్రధరిని తీసుకొని వస్తాడు.. ఆ తర్వాత రెండు గంటల పర్మిషన్ తో వచ్చినట్లు తెలుసుకుని అందరూ షాక్ అవుతారు.. ఇక పల్లవి తన అబద్ధపు కడుపు బయటపడిందని పెద్ద రచ్చ చేస్తుంది. తన తండ్రిని రిలీజ్ చేయించాలని అనుకుంటుంది. ఇప్పటివరకు పల్లవి ఏ ప్లాన్ చేసిన ఫీల్ అవుతూ వచ్చాయి. ఇకముందు ఇలా పల్లవికి మంచి టైం నడుస్తుంది ఏమో చూడాలి..

ప్రస్తుతం స్టోరీలో ట్విస్ట్.. 

Advertisement

పల్లవికి అవని సొంత అక్కని తెలిసిపోతుంది. వాళ్ల నాన్న చెప్పినట్లు అవని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎలాగైనా కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తుంది . అయితే ప్రస్తుతం ఈమె అవని పుట్టుక గురించి అవనితోనే చెబుతుంది. అది విన్న అవని షాక్ అవుతుంది. నువ్వు ఏమి కనపడే నేను కాపాడాలి అనుకున్నాను. నా సొంత చెల్లెలు అయినప్పుడు నేను ఎందుకు నిన్ను వదిలేస్తాను అని అంటుంది. అవని చక్రధర విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో చెబుతుంది. అవి నీకు సపోర్ట్ గా రాజేంద్ర నిలుస్తాడు. ఇకముందు ఎపిసోడ్లు ఎలా సాగుతాయో తెలియాలంటే అసలు మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ని చూడాల్సిందే..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×