Comedy Horror Thriller OTT : జానపద కథల నేపథ్యంలో ఓ కన్నడ మూవీ ఓటీటీలోకి వచ్చింది. దీనిని ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ కథ ఒక గ్రామంలో ప్రతి ఏటా జరిగే దున్నపోతు బలి ఆచారం నిలిచిపోతుంది. దీనివల్ల ఆ గ్రామంలో తలెత్తిన అతీంద్రియ సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ, హారర్ థీమ్స్ తో రూపొందింది. గ్రామీణ నేపథ్యం, దట్టమైన అడవులతో విజువల్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. మరి ఈ సినిమాని చూడాలనుకుంటే, ఇప్పుడే ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
2025 లో వచ్చిన ఈ కన్నడ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కోన’ (Kona). హరి కృష్ణ S దర్శకత్వంలో కుప్పండాస్ ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఇందులో కోమల్ కుమార్, తనీషా కుప్పండ, నమ్రత గౌడ మరియు విజయ్ చెందూర్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా ప్రస్తుతం ZEE5, Airtel Xstream Play లో అందుబాటులో ఉంది.
కొల్లూరు అనే గ్రామంలో ఏటా జరిగే ‘కోన’ ఆచారం జరుగుతుంటుంది. అక్కడ ఈ ఆచారంలో దున్నపోతును బలి ఇస్తుంటారు. ఆ గ్రామంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి ఏటా కచ్చితంగా బలి ఇవ్వాలనే నమ్మకం గ్రామస్తుల్లో ఉంటుంది. అయితే, ఒకానొక సందర్భంలో ఈ ఆచారం ఆగిపోవడంతో, ఆ గ్రామంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ పరిణామాలు గ్రామాన్ని అతలాకుతలం చేస్తాయి.
నారాయణ (కోమల్ కుమార్) అనే వ్యక్తి తన భార్య మరణం తర్వాత ఈ భయంకరమైన వాతావరణంలోకి వస్తాడు. అక్కడ ఎదురయ్యే విచిత్ర సంఘటనలతో కథ కామెడీతో పాటు, సస్పెన్స్ తో నడుస్తుంది. అతని దగ్గర ఓ బుల్లి రోబో కూడా ఉంటుంది. దీంతో కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. చివరికి నారాయణ ఆ ఊరిలో ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ? ఆ గ్రామ దేవత ఆగ్రహం నుంచి గ్రామస్తులు ఎలా బయటపడ్డారు ? అనే ప్రశ్నలతో మిగతా కథ ఉంటుంది. ఈ సినిమా భయపెడుతూనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.
Read Also : ఇదేం సినిమారా సామీ… ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల్లోకీ వచ్చే ప్రొఫెసర్… క్షణక్షణం ఉత్కంఠ