E-Paper
Advertisement

Psycho Thriller OTT : మహిళల్ని మాత్రమే చంపే మాస్క్ మ్యాన్… ఆ పార్ట్స్ కట్ చేసి అరాచకం భయ్యా… లాస్ట్ ట్విస్టుకు మైండ్ పోవడం పక్కా

Psycho Thriller OTT : మహిళల్ని మాత్రమే చంపే మాస్క్ మ్యాన్… ఆ పార్ట్స్ కట్ చేసి అరాచకం భయ్యా… లాస్ట్ ట్విస్టుకు మైండ్ పోవడం పక్కా
Advertisement

Psycho Thriller OTT  : సీరియల్ కిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చే రొమాంటిక్ ఇంటెన్స్ థ్రిల్లర్ లను ఆడియన్స్ అస్సలు వదిలి పెట్టరు. ఇలాంటి సినిమాలు సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంటాయి. వీటికి భాష కూడా అవసరం ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. మరోవైపు ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ సినిమాకి ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా మేకింగ్ స్టైల్ ఉపేంద్ర సినిమాలను పోలి ఉంటుంది. మరి అలనాటి ఫీల్ కావాలని అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ కన్నడ రొమాంటిక్ సైకో థ్రిల్లర్ సినిమా పేరు ‘ఐ యామ్ గాడ్’ (I Am God). రవి గౌడ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథానాయకుడిగా కూడా నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 26 నుండి Sun NXT ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. సిబిజి ప్రొడక్షన్ బ్యానర్‌పై సుధా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రవి గౌడ (దేవ పాత్రలో), విజేత పరీక్ (బిందు పాత్రలో), పి. రవిశంకర్ (భరత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో) నటించారు. ఈ సినిమాకి ఐయండిబిలో 9/10 రేటింగ్ ఉండటం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా ఒకే సమయంలో రెండు భిన్నమైన స్టోరీలతో సాగుతుంది. ఒకవైపు కాలేజీ విద్యార్థులైన దేవ, బిందుల మధ్య అందమైన ప్రేమకథ నడుస్తుంటుంది. దేవ తన ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, బిందు కూడా అతనితో పిచ్చి ప్రేమలో ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకునే విధంగా, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో సాగుతాయి.

మరోవైపు నగరంలో వరుసగా జరుగుతున్న మహిళల హత్యలు తీవ్ర కలకలం రేపుతాయి. తనను తాను గాడ్ అని పిలుచుకునే ఒక మాస్క్ ధరించిన సైకో కిల్లర్ అత్యంత క్రూరంగా మహిళలను చంపుతుంటాడు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ భరత్ రంగంలోకి దిగుతాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఆ హంతకుడికి దేవ ప్రేమకథకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : ఈ బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×