Jabardast Reethu : జబర్దస్త్ హాట్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా పలు స్కిట్స్ లలో కనిపించి ఆకట్టుకుంది. ఈ అమ్మడు ఈ మధ్య ఫుల్ బిజీ అయిపొయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాంకర్ చేస్తుంది. ఇక వీలు దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ట్రిప్లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో రీతూ ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈ అమ్మడు మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ లోని ఓ స్టార్ కమెడియన్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ నటుడు ఎవరు? పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ లో ఉన్నప్పుడు బాగా పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అతనితో క్లోజ్ యాంగిల్ లో దిగిన ఫోటోల ను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. జబర్దస్త్ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ కుర్రాడితో ఫోటోలకు ఫోజులిచ్చింది.. ఆ ఫోటోలకు న్యూ బిగినింగ్ అంటూ రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు షాకయ్యారు. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. నిజానికి రీతూ చౌదరి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.. ఆ ఫొటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు విజయ్ రాజా.. ఇతను స్టార్ కొడుకు.
ఆ స్టార్ మరెవ్వరో కాదు సినీ నటుడు శివాజీ రాజా.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు విజయ్ రాజా. ఈ నేపథ్యంలో రీతూ చౌదరి తో కలిసి వ్యాపారంలోకి దిగాడు. బిజినెస్ సక్సెస్ అవ్వడంతో పాటుగా రీతూతో ప్రేమలో పడ్డాడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఈమె జబర్దస్త్ ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన టాలెంట్ తో క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చింది. ఇక మాటీవీ, జెమినీ, జీ తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్‌లలో నటించి కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందరూ సెలబ్రెటీల మాదిరిగానే రీతూ చౌదరి పర్సనల్ లైఫ్ మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి.. వాటికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇన్నాళ్లకు ఈ రూమర్స్ నే నిజం చేసింది. తాను ప్రేమించిన అబ్బాయిని పరిచయం చేసింది. ఇక పెళ్లి ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు. త్వరలోనే పెళ్లి ప్రకటన ఇవ్వబోతున్నట్లు సమాచారం..