Kanguva Day 1 Box Office Prediction : కోలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ ‘కంగువ’ (Kanguva). ఈ సినిమా బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న అంటే ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘కంగువ’ (Kanguva). ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబి డియోల్ (Bobby Deol), దిశా పటాని (Disha Patani) సూర్య తో పాటు లీడ్ రోల్స్ పోషించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు సూర్య గట్టిగానే ప్రమోషన్స్ జరిపారు. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ని కూడా కవర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తెలుగులో నెగిటివ్ టాక్ వస్తోంది.
అయితే ముందుగా నెలకొన్న హైప్ కారణంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నిజానికి చివరి నిమిషంలో నైజాంలో ఈ సినిమా రిలీజ్ కు సమస్యలు మొదలయ్యాయి. ఏషియన్ థియేటర్స్, మైత్రి మూవీ మేకర్స్ మధ్య నెలకొన్న వివాదం వల్ల బుకింగ్స్ చాలా చోట్ల సరిగ్గా ఓపెన్ కాలేదు. మరోవైపు సూర్య (Suriya) సొంత గడ్డ తమిళంలో కూడా అనుకున్న రేంజ్ లో షోలు పడలేదు. ప్రస్తుతం ఈ సినిమాకి ఇండియాలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే 10.5 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 4 కోట్ల మార్కును అందుకుంది ‘కంగువ’ మూవీ. ఈ బుకింగ్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. తమిళనాడులోని ఫస్ట్ డే 10 నుంచి 12 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను ‘కంగువ’ (Kanguva) మూవీ అందుకుంటుందని అంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ టాక్ బాగుంటే 8 నుంచి 10 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కానీ ప్రస్తుతం ఈ మూవీకి నెగటివ్ టాక్ నడుస్తోంది. ఇక కేరళ, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ప్రస్తుతం ఈ మూవీ టికెట్ బుకింగ్స్ పరంగా పర్వాలేదు అనిపిస్తోంది. కానీ బుకింగ్స్ జోరు ఇంకా ‘కంగువ’ (Kanguva) పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 55 నుంచి 60 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇంత నెగిటివ్ టాక్ మధ్య ‘కంగువ’ (Kanguva) మూవీ అనుకున్న రేంజ్ లో వసూళ్లను రాబడుతుందా? అనేది చూడాలి. ఇక ఈ సినిమా మరో ‘బాహుబలి’ అవుతుందంటూ సూర్యతో పాటు చిత్ర బృందం మొత్తం నమ్ముతుంది. చూడాలి మరి సూర్య అండ్ టీం నమ్ముకం ఎంత వరకు నిలబడుతుందో…