E-Paper
Advertisement

అనసూయ ఎవరో నాకు తెలియదు… షాక్ ఇచ్చిన బుల్లితెర యాంకర్?

అనసూయ ఎవరో నాకు తెలియదు… షాక్ ఇచ్చిన బుల్లితెర యాంకర్?
Advertisement

Soumya Rao: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కామెడీ షో ప్రసారం అవుతూ పుష్కరకాలం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మొదట్లో యాంకర్ గా అనసూయ(Anasuya) వ్యవహరించారు అనసూయకు జబర్దస్త్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక అనసూయ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కెరియర్ పరంగా బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ గుర్తింపు…

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తన పట్ల ఎవరైనా ఏదైనా విమర్శలు చేస్తే వారికి తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉంటారు. ఇలా జబర్దస్త్ యాంకర్ గా మొదలైన ఈమె ప్రస్తానం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి మరో జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు(Soumya Rao)చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ యాంకర్ గా సౌమ్యరావు..

Advertisement

అనసూయ తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి సౌమ్య రావు యాంకర్ గా వ్యవహరించారు. ఈమె కన్నడ అమ్మాయి అయినప్పటికీ అప్పటికే పలు తెలుగు సీరియల్స్ లో నటించారు.. జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో తెలుగులో మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడిన సౌమ్యరావు అనంతరం తెలుగు చక్కగా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్యరావు జబర్దస్త్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఈ నేపథ్యంలోనే అనసూయ గురించి కూడా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనసూయ అంటే అప్పటివరకు నాకు తెలీదు..

Advertisement

జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా రావడానికి అనసూయ కారణం ఆమె వల్లే మీకు అవకాశం వచ్చింది కదా అంటూ ప్రశ్న ఎదురవడంతో తనకు జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చేవరకు కూడా అనసూయ అంటే ఎవరో తెలియదని షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన తర్వాత నేను ఈ షో కి సంబంధించిన కొన్ని వీడియోలు చూసానని అప్పుడు అనసూయ గారిని చూసానని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత పలు సందర్భాలలో అనసూయను కలిసాను, అలాగే స్టార్ మా లో ఒక షో కూడా చేసాము అందులో అనసూయ జడ్జిగా వ్యవహరించారు అంటూ సౌమ్యరావు తెలిపారు. జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ బాగా యాంకరింగ్ చేస్తుందా? లేదా అనసూయ బాగా యాంకరింగ్ చేస్తుందా? అనే ప్రశ్న ఎదురవడంతో సౌమ్య రావు స్పందిస్తూ వాళ్ళిద్దరూ వారి లాంగ్వేజ్ కు అనుగుణంగా యాంకరింగ్ చేస్తారని, ఎవరు ఎక్కువ తక్కువ కాదంటూ సౌమ్యరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ఆదర్శ కుటుంబంలోకి ధురంధర్ 2 నటుడు.. వెంకీ మామను ఢీ కొట్టబోతున్నాడా?

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×