Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఇరగదీస్తున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ లాంటి డేంజర్ బౌలర్లను కూడా ఉతికి ఆరేస్తున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్ పైన దుమ్ములేపిన వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ), లేటెస్ట్ గా RCB బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. వెంటనే వైభవ్ సూర్య వంశీకి డోపింగ్ టెస్టులు ( Dope Test) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసీసీకి లేక రాయబోతున్నట్లు వెల్లడించారు. వైభవ్ సూర్యవంశీ ఇలానే వదిలేస్తే రెచ్చిపోయి ఆడతాడు అని వార్నింగ్ ఇచ్చారు షాహిద్ అఫ్రిది ( Shahid Afridi ). దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవతల పడాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్నాడు. మొన్న ముంబై పై ఇరగదీసిన వైభవ్, నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై అద్భుతమైన అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 15 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ, 78 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. 7 సిక్సర్లు అలాగే 8 బౌండరీలు సాధించిన వైభవ్, 300 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. అయితే మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ బౌలింగ్ లో కూడా అదరగొట్టిన వైభవ్ సూర్య వంశీపై షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న బౌలర్లను ఇంత చక్కగా ఎలా ఎదుర్కొంటున్నాడో ? అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
15 ఏళ్ల కుర్రాడు ఇలా ఆడడం వింత అంటూ వ్యాఖ్యానించారు. దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. వెంటనే వైభవ్ సూర్య వంశీ వయసుపైన ఐసీసీ జోక్యం చేసుకొని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అతని స్టామినాపై టెస్టులు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే అన్ని నిజాలు బయటపడతాయని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు వైభవ్ వాడుతున్న బ్యాట్లను కచ్చితంగా చెక్ చేయాలని కోరారు. అందులో స్ప్రింగులు, చిప్ లు ఉండే ఛాన్సులు ఉంటాయని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీనిపై ఐసీసీకి లేఖ రాస్తానని కూడా షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోకపోతే బౌలర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. వరల్డ్ క్లాసు బౌలర్లు కూడా అతనికి బౌలింగ్ వేయలేరని బాంబు పేల్చారు.
Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగరేట్ తాగి, నడిరోడ్డుపైనే..ఏం బతుకురా నీది
🚨 SHAHID AFRIDI QUESTIONS IPL 🚨
Shahid Afridi has urged ICC to take a closer look at IPL performances, raising doubts over how 15-year-old Vaibhav Suryavanshi is dominating experienced bowlers.
Afridi reportedly demanded a Dope Test and even checking for his bat is he using… pic.twitter.com/lGXIQwSzDv
— Muftanal Wohra (@mufatnal_wohraa) April 11, 2026