E-Paper
Advertisement

Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?

Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?
Advertisement

Auto Ram Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి మంచి జీవితాన్ని ప్రసాదించిందనే విషయం తెలిసిందే. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా పరిచయమై మంచి ఆదరణ సొంతం చేసుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ షోలో కమెడియన్స్ గా సందడి చేసిన అదిరే అభి, ధన్ రాజు, వేణు వంటి తదితరులు ఇప్పటికే దర్శకులుగా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే గెటప్ శ్రీను హైపర్ ఆది వంటి పలువురు వెండితెరపై కమెడియన్లుగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

మెగా ఫోన్ పట్టనున్న ఆటో రాంప్రసాద్..

బలగం సినిమా ద్వారా దర్శకుడుగా వేణు ఎలాంటి సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వేణు బాటలోనే మరొక కమెడియన్ ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad)కూడా దర్శకుడుగా మారబోతున్నట్లు ఈయన ప్రాణ స్నేహితుడు గెటప్ శ్రీను(Get Up Sreenu) తెలియజేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆటో రాంప్రసాద్ ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నారని అతి త్వరలోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులలో రాంప్రసాద్ బిజీగా ఉన్నారని గెటప్ శ్రీను తెలిపారు.

దర్శకుడిగా మారనున్న కమెడియన్..

Advertisement

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఆటో రాంప్రసాద్ తో పాటు గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున స్కిట్లు చేస్తూ వీరి స్కిట్ల ద్వారా బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెరపై సక్సెస్ అయిన వీరందరూ వెండితెరపై కూడా సక్సెస్ సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆటో రాంప్రసాద్ దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి.

బుల్లితెరకు దూరంగా ఆటో రాంప్రసాద్..

Advertisement

ఈ విధంగా ఆటో రాంప్రసాద్ దర్శకుడిగా మారబోతున్నారనే విషయాన్ని గెటప్ శ్రీను వెల్లడించడంతో అభిమానులకు కూడా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఈయన దర్శకుడిగా మారితే తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో కనిపించరా? బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్టేనా? సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై సరైన స్పష్టత రావాలి అంటే ఆటో రాంప్రసాద్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Ranveer Singh: కాంతారా వివాదం…రణవీర్ సింగ్ కు ఊరట… చర్యలు వద్దన్న కోర్టు..

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Big Stories

Advertisement
×