E-Paper
Advertisement

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!
Advertisement

Kissik Talks:జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పవిత్ర (Pavitra ) తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోకి గెస్ట్ గా వచ్చి.. అక్కడ పలు విషయాలను పంచుకుంది. హోస్ట్ గా ఉన్న వర్ష ప్రస్తుతం పవిత్ర ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా పవిత్ర ఏం చేస్తోందంటే మూవీస్ చేస్తోంది, వెబ్ సిరీస్ చేస్తోంది. అంటూ సమాధానం తెలిపింది. ఈ విషయం వినగానే వర్ష .. మన పవిత్ర ఏం సినిమాలు చేస్తోంది రా అంటూ కామెంట్ చేయగా.. ఆ వెంటనే పవిత్ర సినిమాలు విడుదలయితే నేనే చెబుతాను రా అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. ఆ వెంటనే వర్ష ఎందుకు అవి రిలీజ్ అవ్వవా అంటూ అడిగింది.

వరుస సినిమాలలో అవకాశం..

ఆ వెంటనే పవిత్ర ఎక్స్ క్యూజ్ మీ.. అవి మీ సినిమాలు కాదు నా సినిమాలు అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. అలా వీరిద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పవిత్ర మాట్లాడుతూ.. యాక్చువల్ గా నేను మ్యాడ్ 1 లో కూడా చేసినప్పటికీ ఎడిటింగ్లో వాటిని తీసేసారంటూ తెలిపింది. అందులో తాను 1:50 నిమిషం పాటూ నటించినప్పటికీ.. అది ఎడిటింగ్ ప్రాబ్లమో, లేక నా దురదృష్టమో తెలియదు కానీ అందులో కూడా 30 సెకండ్ల వరకు కట్ అయ్యిందని తెలిపారు. ముఖ్యంగా తన ఎంట్రీ సీన్ కట్ అయిందని చెప్పుకొచ్చింది.

మ్యాడ్ మూవీలో కీలకమైన పాత్ర.. కట్ చేస్తే..

Advertisement

అందులో తన పాత్ర ప్రెగ్నెంట్ లేడీగా ఉంటాను.. స్లో మోషన్ లో తనని హీరో కన్యాకుమారి అని పిలుస్తారు.. ఆ తరువాతే తాను కడుపుతో తిరుగుతాను.. ఆసీనే కట్ అయిందని తెలిపింది. ఒకవేళ అందులో తన సీన్స్ ఫుల్ ఉండి ఉంటే.. మరో 10 సినిమాలలో అవకాశాలు వచ్చేవి అంటూ చెప్పుకొచ్చింది జబర్దస్త్ పవిత్ర. చాలామందికి తాను సినిమాలు చేస్తున్నా, షోలు చేస్తున్నాను అని చెబితే అవి విడుదలవుతాయా? నిజంగానే చేస్తున్నావా? లేదా? అని అడిగి చాలా బాధపెట్టేవారని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే పవిత్ర షోల లోనే కాకుండా సిరివాలలో కూడా నటిస్తోందని తెలిసి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

పవిత్ర షోలు..

Advertisement

ఇకపోతే పవిత్ర ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షోలో సందడి చేస్తోంది. ఇందులో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. బెస్ట్ లేడీ కమెడియన్ గా పేరు సొంతం చేసుకుంటుంది.

టాక్సిక్ ప్రేమ.. మోసపోయానంటూ కన్నీళ్లు..

ఇకపోతే పవిత్ర తాను ఒక వ్యక్తిని నమ్మి, శాశ్వతం అప్పగించి, చివరికి అతడి మోసం తెలుసుకొని ఆ టాక్సిక్ ప్రేమ నుండి బయటపడ్డాను అంటూ చెప్పింది. జీవితంలోకి ఒకరిని ఆహ్వానించిన తర్వాత.. వారే సర్వస్వంగా భావిస్తాము. వారితోనే ఎన్నో ఊహించుకుంటాము. కానీ అలా నమ్మిన వారే మోసం చేస్తే.. జీవితంలో మరో తోడు కోసం ఎదురుచూస్తామా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మొత్తానికైతే పవిత్ర ఒకప్పుడు ప్రేమలో మునిగితేలి, ఆ టాక్సిక్ ప్రేమ నుండి బయటపడి ఇప్పుడు సంతోషంగా ఉన్నానంటూ తెలిపింది.

Related News

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

Big Stories

Advertisement
×