E-Paper
Advertisement

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
Advertisement

YouTuber Nandana:యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వేలాది మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ నందన ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ‘నందూస్ వరల్డ్’ ఛానల్ ద్వారా నెటిజన్లకు సుపరిచితమైన ఆమెను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విదేశాల్లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. వివరాల్లోకి వెళితే..

లండన్ జాబ్స్ స్కామ్.. అసలు కేసు ఇదే:

నందన మరియు ఆమె భర్త మధుకర్ కలసి ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో ఒక సంస్థను నడిపేవారని సమాచారం. లండన్ వంటి విదేశాలలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా రెన్యూవల్స్ చేయిస్తామని నమ్మించి దాదాపు 100 మంది నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు తీసుకుని, ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఎయిర్‌పోర్టులో లుకౌట్ నోటీసులతో అరెస్ట్:

Advertisement

విదేశీ ఉద్యోగాల మోసంపై కేసు నమోదు కావడంతో, గతంలోనే పోలీసులు నందన దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణించేందుకు వచ్చిన ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆర్జీఐఏ పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.

ALSO READ:ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

సినిమాల్లోనూ నటన.. సోషల్ మీడియా క్రేజ్ :

Advertisement

యూట్యూబ్‌లో నిరంతరం ట్రావెల్, లైఫ్‌స్టైల్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన నందన, ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో అంతటి ఫాలోయింగ్ ఉన్న ఒక సెలబ్రిటీ ఇలా కోట్లాది రూపాయల జాబ్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక నమ్మకం పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్, ఫాలోయింగ్ చూసి గుడ్డిగా నమ్మేస్తే ఎలాంటి ప్రమాదాల్లో పడతామో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే ఆఫర్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఏజెన్సీల ద్వారా మాత్రమే వీసా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న నందన కేసులో విచారణ ముమ్మరం కాగా, మరిన్ని ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related News

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

Big Stories

Advertisement
×