జన్ ధన్ బ్యాంకు ఖాతాల గురించి కొత్త వార్తల వెలుగులోకి వచ్చింది. ఆనాడు ఎంతో ఘనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ, ఇప్పుడు ఆయా ఖాతాలు 25 శాతం పని చేయలేదని తేలిపోయింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సమాధానం ఇచ్చింది. ఇంకా ఏం చెప్పిందంటే..
ప్రధాని నరేంద్రమోదీ తొలినాళ్లలో ప్రారంభించిన పథకాల్లో జనధన్ బ్యాంకు ఖాతాలు. గతేడాది ఈ ఖాతాల గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంది కేంద్రం. మొత్తం 59 కోట్లకు పైగా ఖాతాలున్నట్లు తెలిపింది. దీంతో సమాచారం చట్టం ద్వారా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలకు ఆర్థిక సేవలు అందించేందుకు ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాలు నాలుగోవంతు నిర్వహణకు దూరంగా ఉన్నట్లు తేలిపింది. ఈ ఖాతాలో తప్పని సరిగా నగదు నిల్వ చేయాలన్న నిబంధన ఏమీ లేదు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు నేరుగా అర్హులకు బదిలీ చేసేందుకు మాత్రమే ఈ ఖాతాలను ఉపయోగిస్తుంది ప్రభుత్వం. ఈ ఖాతాలు ఎలా ఉపయోగపడుతున్నాయన్న దానిపై సమాచార హక్కు చట్టం-ఆర్‌టీఐ కింద చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ- ఆర్థిక సేవల విభాగం ఈ విధంగా రిప్లై ఇచ్చింది. 2026 ఆగస్టు 12 నాటికి పీఎంజేడీవై కింద 59.03 కోట్ల ఖాతాలున్నాయి. అందులో నగదు నిల్వలు రూ.3.15 లక్షల కోట్లకు పైగా ఉంది. మరో 5.72 కోట్ల ఖాతాల్లో ఎలాంటి బ్యాలెన్స్ లేదు. అంటే 15.36 కోట్ల ఖాతాలను ఆయా వినియోగదారులు నిర్వహించడం లేదు. అది మొత్తంలో సుమారు 26 శాతానికి సమానం. 32.89 కోట్లు మహిళల పేరిట ఖాతాలున్నాయి.
26.14 కోట్ల ఖాతాలు పురుషులకు చెందినవి కాగా, మిగతావి ట్రాన్స్‌జెండర్స్ వారు ఉన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో అగ్రభాగం ఉత్తరప్రదేశ్. అక్కడ 10.51 కోట్ల ఖాతాలతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీహార్-7.01 కోట్లు, పశ్చిమబెంగాల్-5.73 కోట్లు, రాజస్థాన్-3.87 కోట్లు, మహారాష్ట్ర-3.85 కోట్లు ఉన్నాయి. అయితే జీరో బ్యాలెన్స్ ఖాతాలు అత్యధికంగా యూపీలో ఉన్నాయి. తర్వాత బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, మహారాష్ట్ర ఉన్నాయి. నిర్వహణ లేని ఖాతాలు ఉత్తరప్రదేశ్ 3.23 కోట్లు. ఇదే అధికం కూడా. తర్వాత బీహార్-1.59 కోట్లు, మధ్యప్రదేశ్-1.35 కోట్లు, పశ్చిమ బెంగాల్-1.02 కోట్లు, మహారాష్ట్ర-97.94 లక్షలు ఉన్నాయి.
ALSO READ: ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు
PMJDYని ఆగస్టు 2014లో జాతీయ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. కుటుంబాలకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత, సామాజిక భద్రతా పథకాలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఖాతా నిష్క్రియంగా మారినంత మాత్రాన అందులోని డబ్బు పోయినట్లు కాదు. కస్టమర్ లావాదేవీలు లేకపోవడాన్ని సూచిస్తుంది. బ్యాంకు సూచించిన ప్రక్రియను అనుసరించడం ద్వారా అటువంటి ఖాతాలను తిరిగి కంటిన్యూ చేయవచ్చు.