E-Paper
Advertisement

Telugu Serials : తెలుగు సీరియల్స్ లలో కన్నడ హీరోయిన్లు.. తెలుగు వాళ్లకు అందుకే ఛాన్స్ ఇవ్వట్లేదా..?

Telugu Serials : తెలుగు సీరియల్స్ లలో కన్నడ హీరోయిన్లు.. తెలుగు వాళ్లకు అందుకే ఛాన్స్ ఇవ్వట్లేదా..?
Advertisement

Telugu Serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఒకప్పుడు సీరియల్స్లలో కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కనిపించే వాళ్ళు.. ఎవరో కొంతమంది సీనియర్లు మాత్రమే తమిళ్ వాళ్ళు కనిపిస్తూ తెలుగులో పాపులర్ అయ్యేవారు.. కానీ ఈమధ్య సీన్ రివర్స్ అయింది.. తెలుగులో ఇతర భాషల్లోని హీరో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అనేకమంది వాదించారు కూడా.. వాళ్లకి అవకాశాలు ఇవ్వకపోవడంతో పాటుగా ప్రస్తుతం నటిస్తున్న వాళ్లకి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.. తెలుగు సీరియస్లలో కన్నడ హీరో హీరోయిన్లు ఉండడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. మరి ఇతర భాషల్లోని నటీనటులను తెలుగు సీరియల్స్లలోకి తీసుకోవడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

తెలుగు బుల్లితెరపై కన్నడ ముద్దుగుమ్మలు..

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బోలెడు సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తెలుగు ఛానల్ పోటీపడి మరి ప్రేక్షకులను అలరించడానికి కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తున్నాయి.. అయితే ఈ మధ్య ప్రసారమవుతున్న సీరియల్స్లలో తెలుగు వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు తప్ప మెయిన్ రోల్లో ఎక్కడ కనిపించలేదు.. జనాలు తెలుగు సీరియల్స్ ఆ కన్నడ సీరియల్సా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య తెలుగులో ఏ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ లో నైనా కన్నడ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ హీరోయిన్లనే మెయిన్ లీడ్ గా తీసుకొని సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నారు.. తెలుగు వాళ్లకి ఒకప్పుడు మంచి అవకాశాలు ఉండేవి. ఈ మధ్య మాత్రం పెద్దగా అవకాశాలు లేక చాలా మంది సోషల్ మీడియా ద్వారా డబ్బులను సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు రావడానికి అసలు కారణాలు ఏంటో మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

Advertisement

Also Read :భూషణ్ దెబ్బకు మహా షాక్.. నారాయణకు నిజం చెప్పిన కేశవ.. పెళ్లికి ప్రతాప్ ముహూర్తం ఫిక్స్..

కన్నడ హీరోయిన్స్ తీసుకోవడానికి కారణాలు..? 

తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా సందడి చేస్తున్నారు.. ఏ సీరియల్ చూసినా కూడా వీళ్ళే ఉన్నారు అని తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. కొన్ని చానల్స్ కేవలం కన్నడ హీరోయిన్లను మాత్రమే హీరోయిన్లుగా సీరియల్స్ నాకు తీసుకుంటున్నారు. అలా వాళ్ళని తీసుకోవడానికి గల కారణాలను కూడా గతంలో కొందరు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. తెలుగు వాళ్ళైతే టైం టు టైం అని అంటారు. కానీ కన్నడ వాళ్ళు మాత్రం ఎంత టైం అయినా పర్లేదు పూర్తి చేస్తాము అని కమిట్మెంట్ ఇస్తారట.. ఇక వాళ్లతో సీరియల్స్ చేయడం కూడా ఈజీ అని అందుకే డైరెక్టర్లు అలా ప్లాన్ చేస్తున్నారని గతంలో కొందరు యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఇకపోతే తెలుగు వాళ్ళ కన్నా వాళ్లకి రెమ్యూనరేషన్ ఎక్కువ.. వేరే రాష్ట్రం నుంచి రావడంతో వాళ్లకి రూమ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.. ఎన్ని ఖర్చులు అయినా పర్వాలేదు కానీ సీరియల్ త్వరగా పూర్తయితే చాలు అనుకున్న డైరెక్టర్లు కన్నడ హీరోయిన్లను ఎక్కువగా పరిచయం చేస్తున్నారు. మరి కొత్త సంవత్సరమైనా తెలుగు సీరియల్స్లలో తెలుగు వాళ్ళు కనిపిస్తారేమో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×