Naa Anveshana: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన తర్వాత చాలా మంది సామాన్యులు కూడా ఈ సోషల్ మీడియాను ఆదాయ వనరుగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సోషల్ మీడియాను కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ప్రేక్షకులు అందలం ఎక్కిస్తారు. ఒకవేళ తప్పుడు దారిలో వెళ్తూ సమాజానికి హాని కలిగించే వ్యాఖ్యలు కానీ, పనులు కానీ చేస్తే మాత్రం వారిని ఏం చేయాలో..ఎక్కడ పెట్టాలో కూడా ప్రజలకు బాగా తెలుసని చెప్పాలి.. సరిగ్గా ఇప్పుడు నా అన్వేషణ విషయంలో అదే జరుగుతోంది. చక్కగా విదేశాలకు వెళ్లి అక్కడి రుచులను, పద్ధతులను, అక్కడ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకున్న నా అన్వేషణ అన్వేష్ ఇప్పుడు నోటి దూల కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు.ముఖ్యంగా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ గట్టి దెబ్బ కొట్టారని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. నిధి అగర్వాల్ ఘటన తర్వాత శివాజీ ఆడవారి వస్త్రాలపై చేసిన కామెంట్స్ పై అనసూయ, చిన్మయి, నాగబాబు లాంటి సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. మరి కొంతమంది శివాజీకి అండగా నిలిచారు. అలా ఈ విషయాలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. అంతేకాదు ఏ ఛానల్ చూసినా సరే ఈ విషయంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి .ఈ క్రమంలోనే యూట్యూబర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న నా అన్వేషణ రంగంలోకి దిగి శివాజీను మాత్రమే కాదు ఈ వివాదంలోకి గరికపాటి నరసింహారావును కూడా లాగి అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా హిందూ దేవతలైన సీతాదేవి, ద్రౌపదీలపై కూడా అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డాడు.
ముఖ్యంగా సగటు తెలుగు వారు కూడా వినలేని రీతిలో తన కామెంట్లతో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే గరికపాటి టీం కూడా స్పందించింది. మా గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను, ఫోటోలను ఇప్పటి సమస్యలకు జత చేసి అన్య పద్ధతిలో విపరీతంగా వైరల్ చేస్తున్నారని అన్వేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
ALSO READ:Prabhas : హీరోయిన్‌కు ప్రభాస్ చీర గిఫ్ట్… పబ్లిక్‌గా అసలు స్టోరీ చెప్పెసింది
అయితే అన్వేష్ మాత్రం రోజురోజుకీ రెచ్చిపోతున్నాడని చెప్పాలి. భారతదేశాన్ని అవమానించేలా వీడియోలు పెడుతూ నేను ఇలాగే రోజుకు ఐదు వీడియోలు పెడతాను మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ తెగ రెచ్చిపోతున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇతడిపై మండిపడుతున్నారు. రెండు రోజుల్లోనే సుమారుగా 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. అయినా కూడా తగ్గని అన్వేష్ తాజాగా మరొకసారి ఇండియాని కించపరుస్తూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. తాజాగా ఆ వీడియోలో.. థాయిలాండ్ లో చూడండి ఇక్కడికి ఆడవాళ్లు వస్తే సురక్షితంగా తిరిగి వెళ్తారు.. అదే ఇండియాకి ఆడవాళ్లు వస్తే రే*ప్ అయిపోయి వస్తారు అంటూ చాలా దారుణంగా ఇండియాని అవమానిస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు అన్వేష్.
ఇక అన్వేష్ చేసిన ఈ వీడియో మరింత క్షమించరానిది అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఎవరైతే ఇతడిని ఫాలో అవుతున్నారో అంతా వెంటనే బయటికి రావాలని అన్ ఫాలో చేయాలని పిలుపు సైతం వచ్చింది. దీంతో ఇన్స్టా, యూట్యూబ్లో మూడేసి మిలియన్లకు పైగా ఉన్న ఫాలోవర్లు క్రమంగా తగ్గుతూ వన్ మిలియన్ కి వచ్చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ చూస్తుంటే.. మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==