Podarillu Today Episode December 31st : మా వాడిని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు కచ్చితంగా వాళ్ళు నాశనం అయిపోతార. నా కొడుకు అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో అని కంగారు పడిపోతూ ఉంటారు. మా వాడికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరు తీసుకెళ్లారు అర్థం కావట్లేదు అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు.. లలిత మాత్రం ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఏంటండీ అని అంటుంది. ఈ పెళ్లి మొత్తానికి ఆగిపోయిందని మహా చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మహాని చూసిన చక్రి ప్రేమలో పడిపోయింది అని గాలిలో ఎగిరిపోతూ ఉంటాడు. గదిలోకి వెళ్లిన మహా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసి నా చక్రి నవ్వుకుంటాడు..జుట్టు పోలిగాడు కిడ్నాప్ అయ్యాడు నా పెళ్ళ ఆగిపోయింది చాలా సంతోషంగా ఉంది అని మహా డాన్స్ వేస్తుంది.. ఎంత ఆనంద పడుతుందో అంత నావల్లేని చక్రి కూడా బయట డాన్స్ వేస్తూ ఉంటాడు.. ఈ పెళ్లి ఆపడానికి చక్రి ఏం చేశాడు అన్న విషయాన్ని మాకు చెప్తాడు. నువ్వు చాలా బాగా చేసావు నువ్వు సూపర్ అంతే అని చక్రిపై ప్రశంసలు కురిపిస్తుంది మహా. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా భోజనం చక్రికి భోజనం తీసుకొని వస్తుంది.. మహాలక్ష్మీ చక్రిని ఆ కిడ్నాప్ ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకుంటూ ఇద్దరు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటారు.. తన ఫ్యామిలీ గురించి చక్రి అన్ని విషయాలను పంచుకుంటారు. ఇక మహాచక్రియల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అక్కడికి వచ్చిన భూషణ్ ను చూసి అందరూ సంతోషపడతారు.. ఏమైందిరా నీకు ఎవరు తీసుకెళ్లారు అని భూషణ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది.. నీ భూషణ్ మాత్రం నన్ను ఎవరు తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అనేసి అంటాడు. సరే బాబు ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది కదా మరో మూడు రోజుల్లో ముహూర్తం ఉంది దానికే కాయం చేద్దాము. అప్పుడు మీరు డైరెక్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు అని అంటాడు.. ఆ మాట వినగానే మీ ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు.
చక్రీ తో మాట్లాడి వచ్చుచున్న మహాను చూసి భూషణ్ నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నావు అని అడుగుతాడు. అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మహా నోరు జారేస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను అంటే మిమ్మల్ని వదిలేసారు కదా అందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని మహా అంటుంది. మిమ్మల్ని అప్పుడే వదిలేశారా అదేంటి అని మహా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నేను వచ్చిన దానికంటే నువ్వు నేను వెళ్ళిపోయిందానికి చాలా సంతోషంగా ఉన్నావు కదా అని భూషణ్ అంటాడు. ఏదో ఒకటి చెప్పి మహా మేనేజ్ చేస్తుంది ఈ పెళ్లి ఆగిపోయినందుకు మీరు చాలా బాధపడుతున్నట్టు ఉన్నారు. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకుందామని మహా అంటుంది.
అవసరం లేదు ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని భూషణ్ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్లీ చక్రి దగ్గరికి వచ్చిన మహా వాడు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాడు ఏంటి అని నాకు టెన్షన్ గా ఉంది అని అంటుంది మహా. ఇప్పట్లో వాడు పెళ్లి ఆలోచనలు పెట్టుకోడు అని మహతో చక్రి అంటాడు. నారాయణ ఒక్కడే కూర్చుని తాగుతూ ఉండడంతో కన్నా కేశవ ఇద్దరు కూడా మొదలెట్టేసావా అని అడుగుతారు. నారాయణ వాళ్ళకి కామెడీగానే సమాధానం చెప్తాడు. ఆ తర్వాత మాధవ్ చేసే ఫుడ్డు ఎవరూ చేయలేరని పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇక తర్వాత మహా పెళ్లి ఆగిపోయింది అని సంతోషంతో కిందకి వస్తుంది. మాధవ్ కు కవిత ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి ఒకసారి వస్తారా అని అడుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి వద్దనుకొని వెళ్లారు కదా మరి ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడాలి అని మాధవ అడుగుతాడు..
మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి మీరు మీ వీధి చివరన ఉన్న టెంపుల్ పక్కన రెస్టారెంట్ కి వస్తారా అని అడుగుతుంది.. సరే వస్తాను కానీ ఈ అమ్మాయి నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అని మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. మహా కిందకు రాగానే భోజనం చేస్తూ ఈ పెళ్లి నాకు సెట్ అవ్వదు అని చెప్పాలని అనుకుంటుంది.. ఈ పెళ్లి ఎటువంటి ఆటంకాలు జరగకుండా జరగాలని వినాయకుడికి పూజ చేద్దామని లలిత అంటుంది. కానీ అప్పుడే మహా నాకు ఈ పెళ్లి సెట్ అవ్వలేదు నాన్న దేవుడే ఈ పెళ్లి నుంచి అడగొడుతున్నాడు అని అంటుంది.
Also Read :నర్మదకు దొరికిపోయిన శ్రీవల్లి.. అమూల్య బయటపెట్టిన నిజం.. ప్రేమకు షాక్..
దానికి సీరియస్ అయిన ప్రతాప్ ఈ పెళ్లి ఆగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా..? ఇప్పటికీ పెళ్లి ఆగిపోయింది అని నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట అలాంటివి ఏమీ లేకుండా పెళ్లిని ముందుకు తీసుకొచ్చాను అని అంటాడు. అయితే మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని ప్రతాప్ మహా కు షాక్ ఇస్తాడు. మూడు రోజుల్లో పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపించేస్తాను అని మహా తో ప్రతాప్ ఛాలెంజ్ చేస్తాడు. ఈ విషయం ఎలాగైనా సరే చక్రి తో చెప్పాలని అనుకుంటుంది. చక్రిని నీళ్లు కొట్టి నిద్రలేపి మరీ ఈ విషయాన్ని చెప్తుంది. తర్వాత రోజు ఉదయం పెళ్లి పనులు మొదలు పెట్టడంతో మహా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..