E-Paper
Advertisement

Su From So Movie: టీవీలోకి వచ్చేస్తోన్నబ్లాక్‌బస్టర్‌ హారర్‌ కామెడీ.. ఈ ఆదివారమే ప్రసారం!

Su From So Movie: టీవీలోకి వచ్చేస్తోన్నబ్లాక్‌బస్టర్‌ హారర్‌ కామెడీ.. ఈ ఆదివారమే ప్రసారం!
Advertisement

Su From So TV Premiere: ఈ మధ్య చిన్న సినిమాలు సైతం భారీ హిట్స్ అందుకుంటున్నాయి. పెద్ద బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బొల్తా కొడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండ వస్తున్న చిన్న సినిమాలు మాత్రం ఊహించని కలెక్షన్స్‌తో బాక్సాఫీసును షేక్‌ చేస్తున్నాయి. ఇతర భాష సినిమాలు వేరే భాషల్లోనూ అదరగొడుతున్నాయి. స్టార్ కాస్ట్ లేకపోయిన బాక్సాఫీసు వద్ద వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి.

థియేటర్ల, ఓటీటీలో బ్లాక్ బస్టర్

Advertisement

అలా ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన కన్నడ హారర్‌, కామెడీ మూవీ ‘సు ఫ్రమ్ సో’. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 25న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. పెద్ద స్టార్ కాస్ట్ లేదు, పెద్ద డైరెక్టర్ కాదు. కానీ, రికార్డు కలెక్షన్స్ తో బాక్సాఫీసును షేక్ చేసింది. థియేట్రికల్‌ రన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొట్టింది. ప్రముఖ డిజిటల్‌ సంస్థ జీయోహాట్‌స్టార్‌ ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది. హారర్‌, కామెడీతో వచ్చిన దీనికి ఓటీటీలోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అత్యధిక వ్యూస్‌తో ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో టాప్‌లో ఉంది. అంతేకాదు అత్యధిక మంది చూసిన సినిమాలో సు ఫ్రం సో టాప్‌లోన ఉంది.

త్వరలో టీవీలోకి

ఇప్పటికీ ఓటీటీలో అదరగొడుతున్న చిత్రం ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఆదివారం బుల్లితెరపై ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ ఆదివారం (నవంబర్‌ 7) సాయంత్రం 6గంటల ప్రముఖ టీవీ ఛానల్‌ స్టార్‌ మా ఈ సూ ఫ్రం సో ప్రసారం కానుంది. ఈ వీకెండ్‌ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే టీవీలో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేయండి. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించారు. కన్నడ హీరో, దర్శకుడు రాజ్ బి శెట్టి సహా నిర్మాతగా వ్యవహరించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు.

Advertisement

రూ. 120 కోట్ల వసూళ్లు

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ చిత్రంగా సు ఫ్రమ్ సో తెరకెక్కింది. తీర ప్రాంతంలో ఉండే ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తీరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకారు ఉరంతట వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికి కారమేంటి? అసలు ఆ సులోచన దెయ్యం ఎవర? చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ చిత్రానికి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో తెలుగులోనూ రిలీజ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. కన్నడ భాషలో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ అందుకున్న ఈ మూవీకి తెలుగులో పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది.

Also Read: Chitrapuri Colony Scam: చిత్రపూరి కాలనీలో 43 కోట్ల స్కాం… ప్రభుత్వ విచారణలో బట్టబయలు

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×