E-Paper
Advertisement

Top 20 News: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం….ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి

Top 20 News: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం….ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి

1. రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకులు ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై బీజేపీ నిరసన బాట పట్టింది. బీజేపీ ఆఫీస్ వద్ద మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

2. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పవన్ ప్రణాళిక

రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం అయ్యేలా, రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, సామాన్యుల నూతన ఆవిష్కరణలను గుర్తించి, వారికి పేటెంట్ హక్కులు కల్పించి, పారిశ్రామికవేత్తలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

3. మంచిర్యాల జిల్లాలో గుడుంబా సెంటర్లపై పోలీసుల దాడి

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో పోలీస్ & ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 21 చోట్ల గుడుంబా తీసేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 3,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం సీఐ బన్సిలాల్ గుడుంబా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మండలాన్ని గుడుంబా రహిత మండలంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులను కోరారు.

4. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం

పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్ర కలకలం రేపింది. సత్తెనపల్లి పరిధిలో ఈ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన జ్యోతి, రాజుపాలెం మండలం R.R. సెంటర్‌కు చెందిన నాగమ్మజ్వరం, ఒంటినొప్పులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రక్త పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయింది. కోత్తూరులో మరో వృద్ధురాలు చికిత్స పొందుతున్నారు.

5. పెంచలయ్య కుటుంబానికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థిక సాయం

నెల్లూరులో దారుణ హత్యకు గురైన సీపీఎం నేత పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. పెంచలయ్య కుటుంబానికి 10లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన కూమారులు ఒకరు IAS, మరొకరు IPS అయ్యే వరకు వారి పూర్తి బాధ్యత తమ కుటుంబమే తీసుకుంటుందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తానని, కాలనీ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

6. ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు వింత షాక్ ఇచ్చారు. కోతుల బెడద తీవ్రంగా ఉన్నందున ఓటు వేయాలంటే ముందు కోతుల్ని తరమండి అంటూ డిమాండ్ చేశారు. ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మా ఓటును అమ్మేది లేదు, కోతులను తరిమి ఓట్లు అడగండి అని నినదించారు. గ్రామంలోని 3016 మంది ఓటర్లు, 7గురు అభ్యర్థులను ఈ డిమాండ్‌తో ఆశ్చర్యపరిచారు.

7. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాపై దీత్వ తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వైయస్సార్ నగర్, అండర్ బ్రిడ్జిలు జలమయమై, డ్రైన్లు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. తీర ప్రాంతంలో వాగులు, వంకలు పొంగడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. దెబ్బతిన్న రహదారులతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

8. నా పిల్లల తండ్రి ఎవరో డీఎన్ఏ పరీక్ష చెయ్యండి: మారుతీ మహాలక్ష్మి

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పూర్వ పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. తనపై నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ, దేవాదాయ, హోం మంత్రులు తన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రత్యర్థులు తనను రాళ్లతో కొట్టి చంపేందుకు కుట్ర కోరినట్లు ఆమె పేర్కొన్నారు.

9. నకిలీ మద్యం తయారీ కేసులో అధికారులపై పిడి

అన్నమయ్య జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన A2 కట్టా రాజు వద్ద స్వాధీనం చేసుకున్న డైరీ, కాల్ డేటా ఆధారంగా కొందరిపై వేటు పడింది. బెల్ట్ షాప్ నిర్వాహకులతో ఫోన్ సంభాషణలు బయటపడటంతో చిత్తూరు ఎక్సైజ్ నోడల్ అధికారి శ్రీనివాస్ ఎక్సైజ్ కానిస్టేబుల్ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లు జి.మణి, ఎం.కిరణ్, ఎ.వినోద్ కుమార్, ఎం.నరేందర్ రెడ్డిలను అటాచ్ చేస్తూ బదిలీ చేశారు.

10. ప్రభుత్వ భూమిని దోచుకొని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఆక్రమణదారులు అక్కడ అనధికార పొగాకు బేరన్లను నిర్మించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, నగదు చేతులు మారడమే దీనికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో రెవెన్యూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రమణ తెలిపారు.

11. భవాని మాల వేసుకున్నందుకు స్కూల్ ఎంట్రీ లేదు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని సికెలే స్కూల్‌లో ఉద్రిక్తత నెలకొంది. భవాని మాల ధరించిన నాలుగో తరగతి విద్యార్థినిని స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించకపోవడంతో దీనిని నిరసిస్తూ.. విద్యార్థిని తల్లిదండ్రులు, భవానీలు ఆందోళనకు దిగారు. సికెలే స్కూల్లో.. ఈ ఘటన జరిగింది. భవానీల ఆందోళనతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.

12. జర్నలిస్టుల సమస్య తీర్చండి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్ వద్ద టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ పాలసీని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు.

13. మెజిస్టిక్ హోటల్‌లో ముసుగు దొంగలు

నందిగామ గాంధీ సెంటర్‌లోని పాత మెజిస్టిక్ హోటల్‌లో గత రాత్రి ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. సుత్తి, గడ్డపార వంటి ఆయుధాలతో షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు గోడను, ఫర్నిచర్ వంటి వస్తువులను ధ్వంసం చేశారు. లోపల నిద్రిస్తున్న వర్కర్లు భయభ్రాంతులై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

14. గురజాడ అప్పారావు ఇంట్లో దుండగుల విధ్వంసం

విజయనగరం జిల్లాలోని మహాకవి గురజాడ అప్పారావు ఇంట్లో దుండగులు విధ్వంసం సృష్టించారు. బాత్రూమ్ డోర్, పూలకుండీలను ధ్వంసం చేశారు. వర్ధంతి మరుసటి రోజే ఈ ఘటన జరగడంపై విచారం వ్యక్తం చేస్తూ, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

15. భారత్‌తో రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ ఆమోదం

భారత్‌తో వ్యూహాహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. రవాణాలో పరస్పర మార్పిడి సహకారానికి గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి సై అంది. గురు, శుక్రవారాల్లో రష్యా అధ్యక్షడు పుతిన్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభ ఆమోదం తెలపడం విశేషం. పుతిన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

16. పుతిన్‌ భారత పర్యటనలో కీలక పరిణామాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఆమోదం తెలిపింది. పుతిన్‌ పర్యటనలో భాగంగా భారత్‌-రష్యా పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

17. సినిమా అనేది ఎనిమిది గంటల పనికాదు: రానా దగ్గుబాటి

వర్కింగ్‌ అవర్స్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో దగ్గుబాటి రానా. అన్ని రంగాల కంటే సినీ రంగం భిన్నమైనదని అన్నారు. ఇది లైఫ్‌స్టైల్‌ దీన్ని దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని, ఈ జీవనశైలిని పాటించాలా, వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయమే అన్నారు. ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొని పనిచేస్తే అద్భుతమైన అవుట్‌పుట్‌ రావడానికి యాక్టింగ్‌ అనేది ప్రాజెక్ట్‌ కాదు. ఇక్కడ ప్రతి విభాగంలోనూ నటీనటులు భాగమైతేనే గొప్ప సన్నివేశాలు వస్తాయన్నారు.

18. రోహిత్, కోహ్లీ అంటే మాకు భయం

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భారత జట్టులో లేకుంటే నేను ఆనందపడతా అని అఫ్గానిస్థాన్‌ ఆటగాడిగా రహ్మనుల్లా గుర్బాజ్‌ అన్నారు. వారు టీమ్‌ఇండియాలో ఉంటే.. ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిద్దరూ లెజెండ్స్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ జట్టులో లేరు అని ఎవరూ చెప్పలేరు. నిజానికి వారు జట్టులో లేకుంటే.. ప్రత్యర్థి జట్లు చాలా సంతోషపడతాయి అన్నాడు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×