E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దాస్ కు వార్నింగ్ ఇచ్చిన జ్యోత్స్న 

Karthika Deepam 2 Serial Today Episode April 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దాస్ కు వార్నింగ్ ఇచ్చిన జ్యోత్స్న 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కాశీ మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకొచ్చి వాళ్లత్తకు ఇచ్చి కార్తీక్‌ వాళ్ల ఇంట్లో ఏదో పార్టీ ఉందని చెప్పారు మీరు వెళ్లలేదా..? అని అడగ్గానే.. స్వప్న రానని చెప్పింది అందుకే నేను వెళ్లలేదు అని చెప్పి ఆమె కూరగాయలు తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. దీంతో కాశీ, స్వప్న దగ్గరకు వెళ్లి మీ అన్నయ్య వాళ్ల ఇంటికి కూడా వెళ్లలేనంత బిజీగా ఉన్నావా.. అని కాశీ అడగ్గానే.. నన్ను అక్కడ అవమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు అందుకే వెల్లబుద్ది కాలేదు అని చెప్తుంది స్వప్న. దీంతో అవమానించే వాళ్లు ఎప్పూడు అవమానిస్తూనే ఉంటారు. వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఎలా అంటూ స్వప్నను కన్వీన్‌ చేయాలని చూస్తాడు. అసలు నువ్వు రెండో పెళ్లి కూడా చేసుకోలేవు అంటూ చెప్పగానే.. స్వప్న ఆలోచిస్తుంది.

మరోవైపు దాస్‌ను బయటకు తీసుకెళ్తుంది జ్యోత్స్న. చెప్పమ్మా నాతో ఏదో మాట్లాడాలి అన్నావు చెప్పమ్మా అని అడగ్గానే.. కూతురుతో నట్టించాలంటే సిగ్గుగా లేదా నాన్న అంటూ తిడుతుంది. లేని ప్రేమను కల్పించుకుని నువ్వు నటిస్తుంటే.. నేను నటించడంలో తప్పేం ఉంది అంటూ దాస్‌ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా దాస్‌ను తిడుతుంది. అందరూ ఎవరి స్వార్థానికి వాళ్లు బతుకుతున్నారు.. నా వర్జినాలిటీ ఏంటో అందరికీ తెలిసన రోజున నన్ను అసహ్యించుకోవచ్చు. కానీ నేను ఏం పట్టించుకోను. నాకు తెలిసినంత వరకు నేనేంటి అన్నదే నాకు ఇంపార్టెంట్‌.. అని చెప్పగానే.. మంచిది అమ్మా కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది.

Advertisement

నా మాట విని పెళ్లి చేసుకో అమ్మా.. ఎందుకంటే రేపు నువ్వు ఎవరు అనేది బయట పడినా నీకేం కాదు. ఎందుకంటున్నానంటే పెళ్లైన ఏ ఆడదానికైనా తల్లిదండ్రులు సొంతం కాదు. సొంతం కానప్పుడు సొంత వాళ్లు అయితేనేమీ.. పెంచిన వాళ్లు అయితేనేమీ అని చెప్పగానే.. ఇలాంటి మాటలన్నీ ఇంటి కెళ్లి గోడల మీద రాసుకో నాన్న అని జ్యోత్స్న చెప్పగానే.. సరే కానీ నువ్వు మాత్రం దీప కార్తీక్‌ ల జోలికి వెళ్లకు అని చెప్పగానే.. నా మెడలో తాళి కట్టేది బావే అని జ్యోత్స్న చెప్పగానే.. నువ్వింకా కలలోనే బతుకుతున్నావు.. అని దాస్‌ అంటే అత్తకు వచ్చిన కలను నిజం చేసే బాధ్యత నాదే అంటుంది.  నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా..?అనగానే.. ఆ మాట దీపకు చెప్పు నాకు కాదు అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.

మరోవైపు కాశీ మాటలకు ఆలోచిస్తున్న స్వప్నను చూసి ఎంత ఆలోచించినా నేను అడిగిన దానికి నీకు సమాధానం దొరకడం లేదు కదా అని కాశీ అడగ్గానే.. సమాధానం ఉంటే కదా చెప్పడానికి అంటుంది స్వప్న. అయితే వసంత్‌ నీకు గాజులు వేస్తుంటే.. నీ చెయ్యి ఎందుకు వణికింది.. నీకు ఏదో గుర్తుకు వచ్చింది అనగానే.. ఏదీ గుర్తుకు రాలేదు.. అని స్వప్న చెప్తుంది. దీంతో అయితే ఒట్టేసి నిజం చెప్పు అనగానే.. స్వప్న ఆలోచిస్తుంది. ఒక ఆడది తన మనసులో ఉన్న వ్యక్తితోనే ఇష్టంగా గాజులు వేయించుకుంటుంది అని నువ్వే చెప్పావు.. వసంత్‌తో నువ్వు గాజులు వేయించుకోలేదు అంటే.. వసంత్‌ ఎదురుగా ఉన్నా నీ మనసులో లేడు అంటూ కాశీ చెప్తుంటే.. స్వప్న షాకింగ్‌గా చూస్తుంటుంది.  నాకోసం కాకుండా నీకోసం ఒక్కసారి ఆలోచించు అంటూ కాశీ చెప్పగానే.. స్వప్న ఆలోచిస్తుంది.

Advertisement

మరోవైపు సుమిత్ర కోపంగా దశరథతో దీప గురించి తిడుతుంది. జ్యోత్స్నను దీప తిట్టడంతో తన వర్జినాలిటీ బయటపడిందని కోప్పడుతుంది. కానీ దశరథ మాత్రం జ్యోత్స్న ప్లాన్‌ ప్రకారం ఇదంతా చేసింది అని మనసులో అనుకుంటాడు. మరోవైపు కింద వంట చేస్తున్న దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్‌ వంటలో సాయం చేస్తుంటే.. వంట నేను చేస్తాను కానీ జ్యోత్స్న ఏం చేస్తుందో చూడమని చెప్తుంది. దీంతో కార్తీక్‌ మనం ఇంటికి వచ్చినప్పటి నుంచి కనిపించలేదు కదా అని చెప్పగానే.. అదే నా బాధ తను ఏం చేస్తుందోనని భయంగా ఉంది అని దీప చెప్తుంది. దీంతో అయితే జ్యోత్స్న తోనే అందరికీ నిజం చెప్పించాలని అనుకుంటున్నాను అనగానే.. దీప షాక్‌ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×