E-Paper
Advertisement

రోల్స్ రాయ్స్‌ లో టీ అమ్మకం.. లాభం రాకపోయినా నెట్టింట సూపర్ హిట్!

రోల్స్ రాయ్స్‌ లో టీ అమ్మకం.. లాభం రాకపోయినా నెట్టింట సూపర్ హిట్!
Advertisement

Selling Tea in a Rolls-Royce: ఆలోచన క్రేజీగా ఉంటే, సక్సెస్ సాలిడ్ గా ఉంటుంది. తాజాగా డీలక్స్ భయ్యాజీ అనే ఓ కంటెంట్ క్రియేటర్ అచ్చంగా ఇదే పని చేశాడు. అనుకున్న స్థాయిలో లాభం రాకపోయిన సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో వైరల్ అయ్యాయి.  సాధారణంగా టీ అంటే రోడ్డు పక్కన చిన్న స్టాళ్లలో తాగడం చూస్తుంటాం. కొన్నిసార్లు నీలోఫర్ లాంటి లగ్జరీ కేఫ్ లలో కూడా తాగుతారు. కానీ, ఓ యువకుడు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచించాడు. విలాసవంతమైన అనుభూతిని అందించాలని భావించాడు. ఖరీదైన రోల్స్ రాయ్స్ కారును అద్దెకు తీసుకుని, అందులోనే టీ అందించే ప్రత్యేక కాన్సెప్ట్‌ ను ప్రారంభించాడు.

రూ. 1 లక్ష వెచ్చించి రోల్స్ రాయ్స్ కారును రెంట్ కు తీసుకొని!

Advertisement

ఈ బిజినెస్ కోసం ఆ యువకుడు సుమారు రూ. 1 లక్ష  వెచ్చించి రోల్స్ రాయ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారు ముందు ఎర్ర తివాచీ పరచి, లోపల కూర్చుని టీ తాగేలా ఏర్పాట్లు చేశాడు. వినియోగదారులకు చాయ్‌ తో పాటు బిస్కెట్లు కూడా అందించాడు. టీ కోసం రూ. 300 ఛార్జ్ చేయగా, రోల్స్ రాయిస్ రైడింగ్ కు గాను రూ. 1000 తీసుకున్నాడు.  ఈ రాయల్ చాయ్ ఎక్స్ పీరియెన్స్ సాధారణ ప్రజలకు ఓ అరుదైన అవకాశం ఇచ్చింది. సాధారణంగా అందుకోలేని లగ్జరీని దగ్గరగా అనుభవించే అవకాశం రావడంతో చాలామంది ఆసక్తి చూపారు. ఈ కాన్సెప్ట్ వెనుక కేవలం టీ అమ్మకం మాత్రమే కాదు.  ప్రత్యేక అనుభూతిని కల్పించాలనే ఆలోచన ఉంది. కారు, సెటప్, సర్వింగ్ కలిపి ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. కుటుంబాలతో సహా అనేక మంది వచ్చి ఈ అనుభవాన్ని ఆస్వాదించారు.

నష్టం వచ్చినా సోషల్ మీడియాలో సూపర్ హిట్!

సదరు కుర్రాడు చేసిన ఈ ప్రయత్నం అతడికి లాభాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సెటప్ కోసం మొత్తం ఖర్చు సుమారు రూ. 1,08,000 అయ్యింది. కానీ, అతడి సంపాదన కేవలం రూ. 88,400 వచ్చింది.  సుమారు రూ. 30 వేల మేర నష్టపోయాడు. అయినప్పటికీ, సదరు యువకుడు ఈ ప్రయోగాన్ని ఫెయిల్యూర్ గా చూడలేదు. ప్రజలకు కొత్త అనుభవాన్ని అందించాననే సంతృప్తి తనకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ఈ కుర్రాడి ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ సంపాదించింది. చాలా మంది నెటిజన్లు అతడి సృజనాత్మకతను ప్రశంసించారు.  ఈ రోజుల్లో ప్రజలు కేవలం ప్రొడక్ట్స్ కే కాకుండా, కొత్త ఎక్స్ పీరియెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు త్వరగా గుర్తింపు పొందుతున్నాయి. లగ్జరీ, సాధారణ లైఫ్ స్టైల్ ను మిక్స్ చేసినప్పుడు మరింత ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ రాయల్ చాయ్  ప్రయోగం డబ్బు పరంగా లాభం ఇవ్వకపోయినా, పెద్ద స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. కొత్తగా ఆలోచించడం, ప్రజలకు ఆనందాన్ని పంచడం కూడా ఒక విజయమేనని ఈ ఘటన వెల్లడించింది.

Read Also: బట్టతల బాధితులు ఈ దేశంలోనే ఎక్కువ.. మరి ఇండియా ఏ ప్లేసులో ఉంది?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×