E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వైరా, జ్యోత్స్న మధ్య గొడవ 

Karthika Deepam 2 Serial Today Episode April 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వైరా, జ్యోత్స్న మధ్య గొడవ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్న కిడ్నాప్‌ గురించి దాస్‌, కార్తీక్‌, దశరథ టెర్రస్‌ మీద నిలబడి బాధపడుతుంటారు. దాస్‌ ఏడుస్తుంటే.. బాధపడటమేనా సమస్యకు ఏదైనా సొల్యూషన్‌ ఆలోచిద్దామా అంటాడు కార్తీక్‌. దీంతో దాస్‌ ఏడుస్తూనే ఇప్పటి వరకు నేను సీరియస్‌గా తీసుకోలేదు అల్లుడు. జ్యోత్స్ ఏదైనా నాటకం  ఆడుతుందేమో అనుకున్నాను కానీ ఆ కిడ్నాపర్‌ మీ కూతరు మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పడంతో మా అమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి అంటూ దాస్‌ ఎమోషనల్ అవుతుంటాడు. జ్యోత్స్నకు ఏమీ కాదు మామయ్య అంటూ కార్తీక్‌ ఓదారుస్తుంటాడు.

దాస్‌ ఏడుస్తూనే.. అన్నయ్య నా కూతురును కాపాడు అన్నయ్య.. అనగానే.. ఏరా దాని మీద నీకేనా ప్రేమ నాకు లేదా..? దాన్ని ఈ భుజాల మీద వేసుకుని పెంచాను నేను 30 కోట్లు కాదు నా ఆస్థి మొత్తం ఇవ్వడానికైనా నేను రెడీ.. డబ్బులు రెడీ అవుతున్నాయి.. వాడి ఫోన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ దశరథ ఎమోషనల్‌ అవుతూ చెప్పగానే.. దాస్‌ ఏడుస్తూనే.. నా కూతురును ఎలాగైనా కాపాడు అన్నయ్య అనడం శివనారాయణ వింటాడు. నీ కూతురును కాపాడటమేంట్రా అని అడగ్గానే.. కార్తీక్‌, దాస్‌, దశరథ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీక్‌ కవర్‌ చేస్తాడు. నీ కూతురును ఎలాగైనా కాపాడు అన్నయ్య అని చెప్తే నీకు అలా వినిపించిందేమో అంటాడు.. ఇంతలో అక్కడికి వచ్చిన పారిజాతం కోపంగా దాస్‌ను చూస్తూ.. అనుమానంగా జ్యోత్స్న నీ కూతురేగా అంటూ అడగ్గానే.. దాస్‌ ఏవో మాటలు చెప్పి కవర్‌ చేస్తాడు.

Advertisement

తర్వాత పోలీసులు డబ్బు తీసుకుని వచ్చి కిడ్నాపర్‌తో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో చెప్తుంటారు. అప్పుడే సుమిత్ర కోపంగా అందరినీ తిడుతుంది. కార్తీక్‌ ఓదారుస్తుంటే కార్తీక్‌ను తిడుతుంది. పోలీసులను కూడా ఇన్వాల్వ్‌ కావొద్దని రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో సుమిత్రను దశరథ ఆపేస్తాడు. అయినా వినకుండా సుమిత్ర దశరథను కూడా అడ్డు రావొద్దని చెప్తుంది. దీంతో దశరథ, శివనారాయణ కూడా పోలీసులను ఇన్వాల్వ్‌ కావొద్దని చెప్తారు. దీంతో సుమిత్ర ఊపిరి పీల్చుకుంటుంది.

మరోవైపు ఇడ్లీ తింటున్న జ్యోత్స్న వైరాను తిడుతూ ఫోన్‌ చేసి డబ్బులు అడుగు అని చెప్తుంది. దీంతో ఇప్పుడే అరైంజ్‌ చేసి ఉంటారంటావా..? అని వైరా అడగ్గానే.. నీ ఫోన్‌ కోసం అక్కడ వెయిట్‌ చేస్తూ ఉంటారు. వెంటనే చేయ్‌ అంటుంది జ్యోత్స్న. దీంతో వైరా వెంటనే ఫోన్‌ తీసుకుని దశరథకు కాల్‌ చేస్తూ.. అవును నువ్వు అసలు దశరథకు సొంత కూతురివేనా..? అని అడగ్గానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. కోపంగా వైరాను తిడుతుంది.

Advertisement

వైరా ఫోన్‌ చేయగానే దశరథ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే.. నా కూతురు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంటే.. పక్కన పోలీసులను పెట్టుకుని డ్రామాలు ఆడింది చాలు నాకు ఎవడి గొంతు వినబడినా… నీ కూతురు గొంతు కోస్తా అని వార్నింగ్‌ ఇవ్వగానే.. దశరథ భయంగా వద్దు డబ్బు రెడీగా ఉంది.. అని చెప్పగానే.. అయితే డబ్బు తీసుకుని బయలుదేరు మళ్లీ ఎక్కడికి రావాలో మళ్లీ ఫోన్‌ చేస్తాను అని చెప్పి కట్ చేయగానే.. దశరథ ఎవ్వరినీ రావొద్దని ఒక్కడే డబ్బు తీసుకుని బయలుదేరుతాడు.  దశరథ కారులో వెళ్తుంటే.. దాస్‌ ను తీసుకుని పోలీసులు ఆ కారును ఫాలో అవుతారు. ఆ వెనకాలే కార్తీక్‌, పారిజాతం కూడా స్కూటీ మీద ఫాలో అవుతుంటారు.

మరోవైపు జ్యోత్స్న, వైరా మధ్య వాటాల విషయంలో గొడవ జరుగుతుంది. తన వాటా ఎలా ఇస్తావని జ్యోత్స్న అడగ్గానే.. ఇచ్చిన డబ్బును ఎలా తీసుకెళ్తావని వైరా అడుగుతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో వైరా అసిస్టెంట్‌ మాత్రం తనకెందుకో మీరిద్దరూ దొరికిపోతారేమో అనిపిస్తుంది అంటాడు. దీంతో ఇద్దరూ కలిసి అసిస్టెంట్‌ను తిడతారు. తర్వాత వైరా, దశరథకు కాల్‌ చేసి కారు దిగమని చెప్పి దూరంగా వెళ్లమనగానే దశరథ కారుకు దూరంగా వెళ్తాడు. ఎవరో వెళ్లి కారు తీసుకుని వెళ్లిపోతారు. దశరథ కంగారు పడుతుంటే దాస్‌, పోలీసులు దగ్గరకు వెళ్తారు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ లైఫ్ మొత్తం మారిపోయిందా? అంజి మామ షాకింగ్ కామెంట్స్

మొగలి రేకులు నటి శిరీషకు మరో పెళ్లి ?.. వరుడు కూడా ..

సామాన్యుడి ముఖంపై నీళ్లు చల్లిన బిందు మాధవి.. అభిజిత్ సపోర్ట్.. అసలేం జరుగుతోంది?

తెలుగు రానోళ్లతో తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ ఏంటి భయ్యా? నిఖిల్ ఫైర్!

ఇది కదా అసలు మజా.. అగ్నిపరీక్షలో ఏకంగా జపాన్ వ్యక్తి!

యువతితో రెడ్ హ్యాండెడ్ గా గదిలో భార్యకు దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్!

అనిల్ రావిపూడిపై ఇంత కక్ష్య.. ఏకంగా రంగంలోకి రౌడీలు!

Bigg Boss Telugu 10: ఇదేంట్రా నాయనా.. కంటెస్టెంట్స్ కు ఒక్కరోజుకు లక్షల్లో రెమ్యూనరేషనా?

Big Stories

Advertisement
×